truckers
-
లక్ష ట్రక్ ఆపరేటర్లకు డిజిటల్ సర్వీసులు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఒక లక్ష పైచిలుకు ట్రక్ ఆపరేటర్లకు (ట్రకర్లు) డిజిటలీకరణ సేవలు అందించినట్లు టెక్ స్టార్టప్ సంస్థ బ్లాక్బక్ సహ వ్యవస్థాపకుడు రాజేశ్ వై తెలిపారు. తమ వ్యాపారాలను పూర్తిగా స్మార్ట్ఫోన్ల ద్వారా నిర్వహించుకోవడానికి, నగదు లావాదేవీలను తగ్గించుకోవడానికి, తమ ట్రక్కులను మరింత మెరుగ్గా నియంత్రించుకోవడానికి, ఆదాయా న్ని మెరుగుపర్చుకోవడానికి ఇవి ఉపయోగపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో 5,000 పైచిలుకు గ్రామాల్లో తమకు కార్యకలాపాలు ఉన్నాయని, వచ్చే 12 నెలల్లో దీన్ని 15,000కు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు రాజేశ్ వివరించారు. కొత్త లోడ్ ఆర్డర్లను పొందడం మొదలుకుని జీపీఎస్లతో ట్రక్కులను ట్రాక్ చేసుకోవడం, రుణాలు పొందడం వరకు బ్లాక్బక్తో అన్ని రకాల సర్వీసులు పొందవచ్చని పేర్కొన్నారు. 2015లో రాజేశ్, చాణక్య హృదయ, రామసుబ్రమణియన్ బి కలిసి బ్లాక్బక్ను ఏర్పాటు చేశారు. (ఇదీ చదవండి: రుణాల చెల్లింపులో అదానీ పోర్ట్స్ దూకుడు.. తాజాగా రూ. 1,500 కోట్లు) -
ఎమర్జెన్సీలోనూ ఆగని నిరసనలు.. భారతీయులకు అలర్ట్
కెనడాలో రోడ్డెక్కిన ట్రక్కర్లు.. తగ్గేదేలే అంటున్నారు. రోడ్లను బ్లాక్ చేస్తూ మరీ.. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిస్తున్నారు. అమెరికా కెనడా మధ్య తిరిగే ట్రక్కర్లకు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయడంతో ఈ ఉద్యమం మొదలై.. తీవ్ర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని ఒట్టావా రోడ్ల మీదకు వేలమంది చేరుకుని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రతిగా దూకుడు చర్యలకు దిగని కెనడా ప్రభుత్వం.. ఎమర్జెన్సీ విధింపు ద్వారా ద్వారా ట్రక్కర్లను నిలువరించే ప్రయత్నం చేస్తోంది. ఈ పరిణామాల నడుమ.. కెనడాలో ఉంటున్న భారతీయుల భద్రతపై స్వదేశంలోని వాళ్లు బంధువుల్లో ఆందోళన నెలకొంది. అయితే.. ఈ వ్యవహారంపై కెనడాలోని భారత హై కమిషన్ స్పందన కొంచెం ఆలస్యం అయ్యింది. కెనడాలోని భారతీయులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తాజాగా కొన్ని మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. నిరసనలు కొనసాగుతున్న మార్గాల గురించి, అక్కడి అధికారులు ఇచ్చిన సూచనలను పాటించాలంటూ భారతీయ పౌరులను కోరుతోంది. కెనడాలో నివసిస్తున్న భారతీయులు, కెనడాకు వెళ్లాలనుకుంటున్న భారతీయులకు ఈ సూచనలు చేసింది కెనడాలోని భారత హై కమిషన్. ట్రక్కర్ల నిరసనల మధ్య కెనడాలోని తమ దేశ పౌరులను 'అలర్ట్గా' ఉండాలని మంగళవారం ఆ ప్రకటనలో భారత్ కోరింది. రాజధాని ఒట్టావో సహా టొరంటో, మరికొన్ని ప్రధాన నగరాల్లో ట్రక్కర్ల ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. రోడ్డు బ్లాకులు, ప్రదర్శనలు, సామూహిక నిరసనలు నడుస్తున్నాయి. ఇది ట్రాఫిక్కు అంతరాయం కలిస్తోంది. కాబట్టి, నిరసనలు జరిగే ప్రాంతాల్లో, అక్కడి ప్రభుత్వం విధించిన ఆంక్షలను, సూచనలను పాటించండి. ఇబ్బంది పడోద్దు. కర్ఫ్యూలు, మీడియా ఇచ్చే సమాచారాన్ని అనుసరించండి. అంటూ ఆ ప్రకటన విడుదలలో పేర్కొంది భారత హై కమిషన్. Advisory for Indian Citizens in Canada or planning travel to Canada- Please take all precautions in light of the ongoing protests and public disturbance in Ottawa and other major Canadian cities. Special #Helpline for distressed Indian citizens in Canada- ☎️ 6137443751 pic.twitter.com/jNLodQuphU — India in Canada (@HCI_Ottawa) February 8, 2022 అంతేకాదు స్పెషల్ ఎమర్జెన్సీ నెంబర్ (+1) 6137443751 ను అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవచ్చని కోరింది. లేదంటే హై కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ద్వారా సాయం కోరవచ్చని సూచించింది. సాయం కోసం, మరింత సమాచారం కోసం టొరంటో, వాకోవర్ కాన్సులేట్స్లను నేరుగా కూడా సంప్రదించవచ్చు. ఇదిలా ఉంటే.. కెనడాలో ట్రక్కర్ల నిరసనతో రోడ్లు బ్లాక్ అయ్యాయి. ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఒట్టావాలో ఎమర్జెన్సీని విధించిన ప్రభుత్వం.. ఇప్పటివరకు 23 మందిని అరెస్ట్ చేసింది. -
UK Bumper Offer : జీతం ఎంత కావాలంటే అంత ఇస్తాం
-
వావ్.. నెటిజన్ల ప్రేమను దోచేశారు
-
వావ్.. నెటిజన్ల ప్రేమను దోచేశారు
లండన్: మానవత్వం పరిమళించింది. తప్పిపోయిన ఓ గున్న ఏనుగు పిల్లను ఆదుకునేందుకు రోడ్డుపై వెళుతున్నవారు చాలా ఓర్పును ప్రదర్శించారు. అది ఏం కోరుకుంటుందో గుర్తించి దానికి తగిన సహాయం చేసి నెటిజన్లతో శబాష్ అనిపించుకున్నారు. బోట్స్వానాలోని ఓ జాతీయ రహదారిపై కార్లోస్ శాంతోస్, జోహాన్ గ్రోన్వాల్డ్, పీటర్ రూసో అనే ముగ్గురు వ్యక్తులు మూడు ట్రక్కుల్లో వెళుతున్నారు. అలా వెళుతున్నవారికి మిట్టమధ్యాహ్నం మండుటెండలో పక్కనే ఉన్న గుబురులో నుంచి బయటకొచ్చి రోడ్డుపై నిల్చున్న చిన్న ఏనుగుపిల్ల కనిపించింది. దానికి సరిగ్గా మూడు వారాలు మాత్రమే ఉంటాయి. అది దాహంతో ఉన్నట్లు గమనించారు. వెనుకాముందు ఆలోచించకుండా కిందికి తమ వద్ద ఉన్న వాటర్ బాటిల్స్తో నీళ్లుతాగించారు. అనంతరం ఏనుగుల గుంపు ఆ సమీపంలో ఎక్కడైనా ఉందా అని వెతికి చూశారు. ఎక్కడా కనిపించకపోవడంతో ఆలోచించి తమ ప్రయాణాన్ని కాసేపు వాయిదా వేసుకొని ఆ గున్న ఏనుగు పిల్లను తమ వాహనంలోకి ఎక్కించుకున్నారు. నేరుగా తీసుకెళ్లి బోట్స్వానాలోని అటవీ వన్యమృగ ప్రాణుల సంరక్షణా కేంద్రానికి అప్పగించి అక్కడి అధికారుల ప్రశంసలు దక్కించుకున్నారు. అంతేకాదు ఇప్పుడు ఆ ఏనుగు పిల్ల అక్కడ ఎంత సంతోషంగా ఉందో కూడా తెలియజేస్తూ ఇంటర్నెట్లో ఓ వీడియోను కొన్ని ఫొటోలు పోస్ట్ చేయగా దానిని చూసినవారంతా వారిని మెచ్చుకుంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.