ఎమర్జెన్సీలోనూ ఆగని నిరసనలు.. భారతీయులకు అలర్ట్​ | Trucker Protest: Alert To Indians Canada Toll Free Number Other Details | Sakshi
Sakshi News home page

ఎమర్జెన్సీలోనూ ట్రక్కర్ల నిరసనల హోరు.. భారతీయలకు అలర్ట్​, ఇలా చెయ్యండి..

Published Wed, Feb 9 2022 10:13 AM | Last Updated on Wed, Feb 9 2022 10:32 AM

Trucker Protest: Alert To Indians Canada Toll Free Number Other Details - Sakshi

కెనడాలో రోడ్డెక్కిన ట్రక్కర్లు.. తగ్గేదేలే అంటున్నారు. రోడ్లను బ్లాక్​ చేస్తూ మరీ.. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిస్తున్నారు. అమెరికా‌‌ కెనడా మధ్య తిరిగే ట్రక్కర్లకు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయడంతో ఈ ఉద్యమం మొదలై.. తీవ్ర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని ఒట్టావా రోడ్ల మీదకు వేలమంది చేరుకుని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రతిగా  దూకుడు చర్యలకు దిగని కెనడా ప్రభుత్వం.. ఎమర్జెన్సీ విధింపు ద్వారా ద్వారా ట్రక్కర్లను నిలువరించే ప్రయత్నం చేస్తోంది. ఈ పరిణామాల నడుమ.. కెనడాలో ఉంటున్న భారతీయుల భద్రతపై స్వదేశంలోని వాళ్లు బంధువుల్లో ఆందోళన నెలకొంది. 

అయితే.. ఈ వ్యవహారంపై కెనడాలోని భారత హై కమిషన్ స్పందన కొంచెం ఆలస్యం అయ్యింది. కెనడాలోని భారతీయులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తాజాగా కొన్ని మార్గదర్శకాలను రిలీజ్​ చేసింది. నిరసనలు కొనసాగుతున్న మార్గాల గురించి, అక్కడి అధికారులు ఇచ్చిన సూచనలను పాటించాలంటూ భారతీయ పౌరులను కోరుతోంది.

కెనడాలో నివసిస్తున్న భారతీయులు, కెనడాకు వెళ్లాలనుకుంటున్న భారతీయులకు ఈ సూచనలు చేసింది కెనడాలోని భారత హై కమిషన్​. ​ట్రక్కర్ల నిరసనల మధ్య కెనడాలోని తమ దేశ పౌరులను 'అలర్ట్‌గా' ఉండాలని మంగళవారం ఆ ప్రకటనలో భారత్ కోరింది. రాజధాని ఒట్టావో సహా టొరంటో, మరికొన్ని ప్రధాన నగరాల్లో ట్రక్కర్ల ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. రోడ్డు బ్లాకులు, ప్రదర్శనలు, సామూహిక నిరసనలు నడుస్తున్నాయి. ఇది ట్రాఫిక్​కు అంతరాయం కలిస్తోంది. కాబట్టి,  నిరసనలు జరిగే ప్రాంతాల్లో, అక్కడి ప్రభుత్వం విధించిన ఆంక్షలను, సూచనలను పాటించండి. ఇబ్బంది పడోద్దు. కర్ఫ్యూలు, మీడియా ఇచ్చే సమాచారాన్ని అనుసరించండి. అంటూ ఆ ప్రకటన విడుదలలో పేర్కొంది భారత హై కమిషన్​.

అంతేకాదు స్పెషల్​ ఎమర్జెన్సీ నెంబర్​ (+1) 6137443751 ను అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవచ్చని కోరింది. లేదంటే హై కమిషన్​ ఆఫ్​ ఇండియా వెబ్​సైట్​లో రిజిస్ట్రేషన్​ ద్వారా సాయం కోరవచ్చని సూచించింది. సాయం కోసం, మరింత సమాచారం కోసం టొరంటో, వాకోవర్​ కాన్సులేట్స్​లను నేరుగా కూడా సంప్రదించవచ్చు. ఇదిలా ఉంటే.. కెనడాలో ట్రక్కర్ల నిరసనతో రోడ్లు బ్లాక్​ అయ్యాయి. ట్రాఫిక్​ జామ్​తో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఒట్టావాలో ఎమర్జెన్సీని విధించిన ప్రభుత్వం.. ఇప్పటివరకు 23 మందిని అరెస్ట్​ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement