
న్యూఢిల్లీ: కృష్ణ జింకల్ని చంపిన కేసులో ఐదేళ్ల జైలు శిక్ష ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్ ఆదివారం జోధ్‌పూర్ చేరుకున్నారు. ఈ కేసులో సోమవారం జోధ్‌పూర్ సెషన్స్ కోర్టులో జరగనున్న వాదనలకు సల్మాన్ హాజరు కావాల్సి ఉంది. ఇందులో భాగంగా ఒక రోజు ముందే సల్మాన్ జోధ్‌పూర్ చేరుకున్నారు. ముంబై నుంచి విమానంలో వచ్చిన సల్మాన్.. జోధ్‌పూర్ విమానాశ్రయంలో ఆయన కనిపించారని, సోమవారం కోర్టు విచారణకు ఆయన హాజరవుతారని ఏఎన్‌ఐ వార్తాసంస్థ ట్వీట్‌చేసింది.
కృష్ణ జింకల్ని చంపిన కేసులో ఐదేళ్ల జైలు శిక్ష ఎదుర్కొంటున్న సల్మాన్‌కు ప్రస్తుతం బెయిల్‌మీద బయట ఉన్న సంగతి తెలిసిందే. ట్రయల్ కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించి జైలు శిక్ష విధించడంతో రెండ్రోజులు జోధ్‌పూర్ కేంద్ర కారాగారంలో సల్మాన్ శిక్ష అనుభవించారు. అనంతరం ఆయనకు బెయిల్ లభించింది. అయితే బెయిల్ మంజూరును రాజస్తాన్ హైకోర్టులో సవాలు చేస్తామని బిష్ణోయ్ తెగ ప్రతినిధి రామ్ నివాస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment