జోథ్‌పూర్ కోర్టుకు హాజరైన సల్మాన్ ఖాన్
సాక్షి, న్యూఢిల్లీ : కృష్ణజింకలను వేటాడిన కేసులో తనకు విధించిన శిక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణకు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోమవారం జోథ్‌పూర్ సెషన్స్ కోర్టు ఎదుట హాజరయ్యారు. అయితే విచారణను జిల్లా సెషన్స్ కోర్టు జులై 17కు వాయిదా వేసింది. భారీ భద్రత నడుమ కోర్టుకు హాజరైన సల్మాన్ కేసు విచారణ వాయిదా పడటంతో తిరుగుముఖం పట్టారు. కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్‌ను గత నెలలో కోర్టు దోషిగా ప్రకటించడంతో జోథ్‌పూర్ సెంట్రల్ జైలులో కొద్దిరోజులు గడిపిన విషయం తెలిసిందే. సల్మాన్‌కు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించగా ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.
సల్మాన్ విదేశాలకు వెళ్లాలంటే తమ అనుమతి అవసరమని కోర్టు స్పష్టం చేసింది. కాగా, ఇదే కేసులో సల్మాన్ సహ నటులు సైఫ్ అలీఖాన్, టబు, నీలం, సోనాలి బింద్రేలకు కోర్టు విముక్తి కల్పించింది. హమ్ సాథ్ సాథ్ హై చిత్ర షూటింగ్ నేపథ్యంలో సల్మాన్ జోథ్‌పూర్‌కు సమీపంలోని కంకణి గ్రామం వద్ద 1998 అక్టోబర్ 1న కృష్ణజింకలను వేటాడి హతమార్చిన కేసులో ఆయనను కోర్టు దోషిగా నిర్ధారించింది.
Comments
Please login to add a commentAdd a comment