సల్మాన్ ఖాన్(పాత చిత్రం)
జోధ్‌పూర్ : కృష్ణ జింకల వేట కేసులో బెయిల్‌పై ఉన్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు మరో ఊరట లభించింది. జోధ్‌పూర్ జిల్లా సెషన్స్ కోర్టు రూ.25 వేల విలువైన రెండు బాండ్లు, కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లొద్దనే నిబంధనలపై ఆయనకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సల్మాన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని కోర్టుని ఆశ్రయించారు. దీనిపై మంగళవారం కోర్టు తన తీర్పును వెలువరించింది. మే 25 నుంచి జూలై 10 మధ్యకాలంలో కెనడా, నేపాల్, అమెరికా వెళ్లేందుకు సల్మాన్‌కు అనుమతినిచ్చింది. అయితే సల్మాన్ ఎందుకు విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నాడనేది మాత్రం తెలియరాలేదు. ఈ కేసులో సల్మాన్ దోషిగా తెలడంతో కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. రెండు రోజులు జైల్లో గడిపిన అనంతరం సల్మాన్ బెయిల్‌పై బయటకొచ్చిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment