Black buck poaching case
-
కోర్టుకు హాజరుకాని సల్మాన్
జోధ్‌పూర్ : బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ శుక్రవారం కోర్టుకు గైర్హాజరయ్యారు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో జోధ్‌పూర్ కోర్టు ముందు ఆయన నేడు హాజరు కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అయితే సల్మాన్ మాత్రం కోర్టుకు రాలేదు. సల్మాన్ గైర్హాజరు గల కారణాలను అతని లాయర్లు కోర్టుకు వివరించారు. సల్మాన్‌ను చంపేస్తామంటూ సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చిన విషయాన్ని వారు కోర్టుకు తెలిపారు. సల్మాన్ కోర్టుకు హాజరయ్యే సమయంలో అక్కడి పరసరాల్లో శాంతి భద్రతలను అదుపులో ఉంచాలని కోరారు. దీంతో కోర్టు విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేశారు. 1998లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఓ రోజు రాత్రి సల్మాన్‌తో పాటు మరికొందరు నటులు జోద్పూర్ పరిసరాల్లోని అడవిలో కృష్ణ జింకలను వేటాడినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో అప్పట్లోనే సల్మాన్‌తో పాటు మరికొందరు నటులపై జోద్పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో సల్మాన్ ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తూ గతేడాది ఎప్రిల్లో కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో ఆయన కోర్టు తీర్పును సవాలు చేసి బెయిల్ పొందారు. ఆ సమయంలో సల్మాన్ రెండు రోజుల పాటు జోధ్‌పూర్ జైలులో ఉన్నారు. అయితే బెయిల్ పొందినప్పటి నుంచి సల్మాన్ న్యాయస్థానం ముందు హాజరు కాలేదు. కాగా, ఈ ఏడాది జూలై 4వ తేదీన కేసు విచారణ సమయంలో.. సల్మాన్ సెప్టెంబర్ 27వ తేదీన కోర్టుకు హాజరు కాని పక్షంలో బెయిల్‌ను రద్దు చేస్తామని జస్టిస్ చంద్రకుమార్ ఆదేశించిన సంగతి తెలిసిందే. -
సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం అంటూ సోషల్ మీడియాలో బెదిరింపు పోస్ట్ దర్శనమివ్వటం కలకలం రేపుతోంది. ఈ నెల 27న సల్మాన్ కృష్ణ జింకలను చంపిన కేసులో జోథ్‌పూర్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సల్మాన్‌ను చంపేస్తామంటూ కొందరు దుండగులు ఫేస్బుక్లో పోస్ట్ చేయటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ‘సల్మాన్.. భారతీయ చట్టాల నుంచి నిన్ను నువ్వు కాపాడుకోగలవేమో. కానీ మా కోర్టులో నువ్వు నేరస్థుడివి. నీకు మేం మరణశిక్ష విధించాం’ అంటూ పంజాబ్ యూనివర్సిటీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఫేస్ బుక్ పేజ్‌లో ఈ నెల 16న పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. హమ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ కృష్ణ జింకలను వేటాడి చంపినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సల్మాన్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థాయం ఐదేళ్ల శిక్ష విధించింది. అయితే తీర్పును సవాల్ చేసిన సల్మాన్‌కు కోర్టు బెయిల్ మంజురూ చేసింది. -
సల్మాన్‌కు కోర్టు గ్రీన్ సిగ్నల్
జోధ్‌పూర్ : కృష్ణ జింకల వేట కేసులో బెయిల్‌పై ఉన్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు మరో ఊరట లభించింది. జోధ్‌పూర్ జిల్లా సెషన్స్ కోర్టు రూ.25 వేల విలువైన రెండు బాండ్లు, కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లొద్దనే నిబంధనలపై ఆయనకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సల్మాన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని కోర్టుని ఆశ్రయించారు. దీనిపై మంగళవారం కోర్టు తన తీర్పును వెలువరించింది. మే 25 నుంచి జూలై 10 మధ్యకాలంలో కెనడా, నేపాల్, అమెరికా వెళ్లేందుకు సల్మాన్‌కు అనుమతినిచ్చింది. అయితే సల్మాన్ ఎందుకు విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నాడనేది మాత్రం తెలియరాలేదు. ఈ కేసులో సల్మాన్ దోషిగా తెలడంతో కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. రెండు రోజులు జైల్లో గడిపిన అనంతరం సల్మాన్ బెయిల్‌పై బయటకొచ్చిన విషయం విదితమే. -
ప్రత్యేక విమానంలో ముంబైకి సల్మాన్..
జోధ్‌పూర్ : కృష్ణ జింకల వేట కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ పోలీసుల పటిష్ట భద్రత మధ్య జోధ్‌పూర్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. గత రెండు రోజులుగా జరుగుతున్న నాటకీయ పరిణామాల మధ్య 50 వేల రూపాయల పూచీకత్తుపై, కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ను సల్మాన్‌కు మంజూరు చేస్తున్నట్లు జోధ్‌పూర్ కోర్టు శనివారం మధ్యాహ్నం వెల్లడించిన విషయం తెలిసిందే. కోర్టు ఉత్తర్వుల కాపీ అందుకున్న పోలీసులు సల్మాన్‌ను పటిష్ట భద్రతతో జైలు నుంచి విడుదల చేశారు. సల్మాన్‌ను తీసుకెళ్లేందుకు కొందరు సన్నిహితులు జోధ్‌పూర్ జైలుకు వచ్చారు. జైలునుంచి విడుదలైన సల్మాన్‌ను పోలీసులు జోధ్‌పూర్ ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో సల్మాన్ ముంబైకి బయలుదేరారు. ఒకరిద్దరు వ్యక్తిగత సిబ్బంది, సన్నిహితులు సల్మాన్‌తో ఉన్నారు. మరోవైపు కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ కేసు తదుపరి విచారణ మే7న చేపట్టనున్నారు. 20 ఏళ్ల కిందటి కేసులో దోషిగా తేలిన సల్మాన్‌కు జోధ్‌పూర్ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించగా.. రూ.25 వేల విలువైన రెండు బాండ్లతో పాటు కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లొద్దన్న నిబంధనలపై సల్మాన్‌కు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. బెయిల్ అనంతరం ఎయిర్ పోర్టుకు బయలుదేరుతున్న సల్మాన్ -
సల్మాన్‌కు బెయిల్; ఫ్యాన్స్ ఏంచేశారంటే..
జోధ్‌పూర్/ముంబై: కృష్ణ జింకల వేట కేసులో దోషి సల్మాన్ ఖాన్‌కు బెయిల్ లభించడంతో ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. బెయిల్ పిటిషన్‌పై తీర్పు సందర్భంగా శనివారం జోధ్‌పూర్ కోర్టు హాలు, పరిసరాలు హీరో అభిమానులతో కిక్కిరిసిపోయింది. పెద్ద సంఖ్యలో గుమ్మికూడిన అభిమానులెవరూ సెల్ఫీల పేరుతో సల్మాన్ దగ్గరికి రాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. తీర్పు వచ్చిన మరుక్షణమే కోర్టు బయట అభిమానులు హడావిడి చేశారు. అటు ముంబైలోని సల్మాన్ ఇంటి వద్దా దాదాపు ఇదే పరిస్థితి. శనివారమే సల్మాన్ ముంబైకి వచ్చేస్తారన్న వార్తల నేపథ్యంలో ముంబైలోని ఆయన ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. సల్మాన్ ఫ్లెక్సీలను చేతబట్టి.. హీరోకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రచ్చ చేశారు. రోడ్లపై వెళ్లేవారికి మిఠాయిలు తినిపించి ఆనందాన్ని పంచుకున్నారు. ఖాన్ నిర్వహిస్తోన్న ‘బీయింగ్ సల్మాన్ ఫౌండేషన్’ ద్వారా సాయం పొందిన చాలా మంది తమ అభిమాన నటుడు క్షేమంగా ఇంటికి తిరిగిరావాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఈమేరకు సంబంధిత ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు సల్మాన్‌కు బెయిల్ దక్కడంపై హర్షం వ్యక్తంచేశారు. 20ఏళ్ల నాటి కేసు: 1998లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ కోసం జోధ్‌పూర్ వెళ్లిన చిత్రబృందం.. విరామ సమయంలో ఆటవిడుపుగా వేటకు వెళ్లి అరుదైన కృష్ణ జింకలు రెండిటిని చంపేశారని అభియోగాలు నమోదయ్యాయి. 20 ఏళ్ల విచారణ అనంతరం జోధ్‌పూర్ సెషన్స్ కోర్టు గురువారం(ఏప్రిల్ 5న) తుది తీర్పు చెప్పింది. సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్లు జైలు పడగా, మిగతా నిందితులైన సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలీ బిద్రేలను నిర్దోషులుగా కోర్టు పేర్కొంది. Bihar: Rakhi sisters of #SalmanKhan Saba and Farah celebrate in Patna after he was granted bail by Jodhpur Court in #BlackBuckPaochingCase pic.twitter.com/9A9slOeHWy — ANI (@ANI) 7 April 2018 Fans of #SalmanKhan gather outside his residence in Mumbai and celebrate following Jodhpur Court's verdict in #BlackBuckPaochingCase. The Court granted him bail in the case. pic.twitter.com/STrcQuihjY — ANI (@ANI) 7 April 2018 -
కరుణించిన న్యాయదేవత; సల్మాన్‌కు బెయిల్
జోధ్‌పూర్: ఒక రోజు ఆలస్యమైనా న్యాయదేవత కరుణించింది. కృష్ణ జింకల వేట కేసులో దోషి బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు బెయిల్ మంజూరైంది. నాటకీయ పరిణామాల నడుమ.. రూ.50 వేల పూచీకత్తుపై సల్మాన్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు జోధ్‌పూర్ కోర్టు శనివారం మధ్యాహ్నం తీర్పు చెప్పింది. ఉత్తర్వుల కాపీ అందిన వెంటనే జోధ్‌పూర్ జైలు నుంచి హీరో విడుదలయ్యే అవకాశంఉంది. హైడ్రామా: గురువారం నాటి తీర్పుతో జైలుపాలైన సల్మాన్.. శుక్రవారమే బెయిల్ కోరుతూ పిటిషన్ పెట్టుకున్నారు. అయితే న్యాయమూర్తుల బదీలల కారణంగా ఆ రోజు విచారణలేవీ జరగలేదు. కృష్ణ జింకల వేట కేసును విచారిస్తోన్న జడ్జి రవీంద్ర కుమార్ జోషి కూడా బదిలీ కావడంతో శనివారం కోర్టు పనిచేస్తుందా, లేదా అనే సంశయం నెలకొంది. కానీ అనూహ్యంగా జడ్జి జోషి కోర్టుకు వచ్చి విధులు నిర్వర్తించారు. రూ.25 వేల విలువైన రెండు బాండ్లు, కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లొద్దనే నిబంధనలపై సల్మాన్‌కు బెయిల్ మంజూరుచేశారు. సూపర్ స్టార్‌కు బెయిల్ వచ్చిందన్న వార్తపై అటు బాలీవుడ్‌తోపాటు ఇటు టాలీవుడ్‌లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 20ఏళ్ల నాటి కేసు: 1998లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ కోసం జోధ్‌పూర్ వెళ్లిన చిత్రబృందం.. విరామ సమయంలో ఆటవిడుపుగా వేటకు వెళ్లి అరుదైన కృష్ణ జింకలు రెండిటిని చంపేశారని అభియోగాలు నమోదయ్యాయి. 20 ఏళ్ల విచారణ అనంతరం జోధ్‌పూర్ సెషన్స్ కోర్టు గురువారం(ఏప్రిల్ 5న) తుది తీర్పు చెప్పింది. సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్లు జైలు పడగా, మిగతా నిందితులైన సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలీ బిద్రేలను నిర్దోషులుగా కోర్టు పేర్కొంది. -
టబు, సోనాలీలు తప్పించుకోవడానికి కారణమిదే!
సాక్షి, జైపూర్ : రాజస్థాన్ అడవుల్లో కృష్ణజింకలను వేటాడిన కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ జోధ్‌పూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో సల్మాన్‌తో పాటు ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్, సోనాలీ బ్రిందే, టబు, నీలంలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కానీ ఆ రోజు సల్మాన్‌తో పాటు జీపులో సైఫ్, టబు, సోనాలీ, నీలంలు కూడా వున్నారని, వారే సల్మాన్‌ను తుపాకీతో కాల్చమని ప్రోత్సహించారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. అయితే వారికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు దొరకలేదు. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన పూనమ్ బిష్ణోయ్.. జీపులో ఉన్నది వారేనా? అన్నది కచ్చితంగా చెప్పలేకపోయారు. దీంతో సైఫ్ అలీ ఖాన్, నీలమ్, టబు, సొనాలీ బింద్రేలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. వారితో పాటు ఈ క్రైమ్‌లో కీలక పాత్ర పోషించిన దుష్యంత్ సింగ్‌ను కూడా నిర్దోషిగానే కోర్టు ప్రకటించింది. క్రాస్ ఎగ్జామినేషన్ కోసం టబు, సోనాలీలను ఒక రోజు కోర్టు ముందుకు తీసుకొచ్చినప్పటికీ, పూనమ్ బిష్ణోయ్ వారిని గుర్తుపట్టలేకపోయారు. ఫిర్యాదులో వారి పేర్లను పేర్కొని, ఎందుకు అతను గుర్తుపట్టలేకపోతున్నారని కోర్టు ప్రశ్నించింది. అయితే ఘటన జరిగిన రోజు అందరూ తెలుపు రంగ సల్వార్ సూట్స్ ధరించారని, ఆ కారణంతో వారిని గుర్తించలేపోతున్నానని బిష్ణోయ్ తెలిపారు. దీంతో ఇక వారిని ధ్రువీకరించే ఆధారాలు లేనందున.. నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. వారు సల్మాన్ వెంట ఉన్నారే తప్పితే కృష్ణ జింకలను చంపడంలో పాత్ర ఏమీ లేదని వారి తరఫు న్యాయవాది వాదించడం కూడా టబు, సోనమ్, నీలమ్, సైఫ్ అలీ ఖాన్లకు కలిసి వచ్చింది. -
సల్మాన్‌కు షారుఖ్ మద్దతు..వీడియో వైరల్
ముంబై: కృష్ణజింకలను వేటాడిన కేసులో ఐదేళ్ల శిక్షకు గురైన సల్మాన్ ఖాన్‌కు అతని ఆప్తమిత్రుడు షారుఖ్ ఖాన్ బాసటగా నిలిచాడు. కొన్నేళ్ల క్రితం సల్మాన్‌కు మద్దతుగా షారుఖ్ ఖాన్ చేసిన పలు వ్యాఖ్యలు వారి స్నేహ బంధాన్ని వెల్లడించాయి. ‘కొన్నిసార్లు సెలబ్రిటీ హోదాతో చాలా బాధలుపడాల్సి వస్తుంది. మాపై ఏవైనా ఆరోపణలు వచ్చిన వెంటనే ఇబ్బందులు మొదలైతాయి. అవి నిజమైనా, అబద్ధమైనా మా కీర్తి మసకబారడం ప్రారంభమవుతుంది. సల్మాన్ విషయంలోనూ ఇదే జరిగింది.. అతను సెలబ్రిటీగా ఎంత ఎత్తుకు ఎదిగాడో... ఆరోపణల ఫలితంగా అన్ని కష్టాలు పడ్డాడు. సల్మాన్ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించే వ్యాఖ్యలు, ఆరోపణలు చాలానే వచ్చాయి. వాటన్నింటిపై ప్రజలు, అభిమానులకు మేం వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. వాటివల్ల సెలబ్రిటీలకు తిప్పలు తప్పవు. నేను చెప్పింది నిజమో కాదో..! ఇది నా అభిప్రాయం. నా వ్యాఖ్యలు ఏ ఒక్కరినో ఉద్దేశించినవి కావు. న్యాయ వ్యవస్థను మనమంతా నమ్మాలి. నమ్ముదాం. కానీ, వ్యక్తిగతంగా సల్మాన్ నాకు బాగా తెలుసు. ఇవన్నీ అతనికి జరగకుండా ఉంటే బాగుండేది’ అని గతంలో సల్మాన్‌కు మద్దతుగా షారుఖ్ మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. -
సల్మాన్‌కు శిక్ష.. ఆ బాధ వారికే ఎక్కువ
సల్మాన్ ఖాన్ కృష్ణజింకలను వేటాడిన కేసులో జోధ్‌పూర్ కోర్టు ఊహించని తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో అభిమానులు కంగుతిన్నారు. అయితే సల్మాన్‌కు జైలు శిక్ష విషయంలో అందరికంటే ఎక్కువగా బాధకు గురైంది సల్మాన్ చెల్లెల్లు అల్విరా, అర్పితా ఖాన్. తీర్పు వెలివడిన వెంటనే వీరు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కోర్టు విరామ సమయంలో కూడా వారు బయటకు వెళ్లకుండా అక్కడే కూర్చున్నారు. జడ్జి ఐదేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. సల్మాన్ మాత్రం నేను నిర్దోషినంటూ జడ్జికి పదేపదే విన్నవించుకున్నారు. సల్మాన్ తరుపు లాయర్కూడా ఈ తీర్పుపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఐదేళ్లు శిక్ష విధిస్తారని తాము ఊహించలేదని తెలిపారు. ఇప్పటికే బెయిల్ కోసం కోర్టు ను ఆశ్రయించినట్టుగా తెలిపారు. ఈ పిటిషన్‌పై ఈ రోజు(శుక్రవారం) విచారణ జరగనుంది. ప్రస్తుతం సల్మాన్ మీద వందల కోట్ల రూపాయల బిజినెస్ ఆధారపడి ఉంది. ఇటీవల రేస్ 3 షూటింగ్ ను పూర్తి చేసిన సల్లూభాయ్ భరత్, దబాంగ్ 3లలో నటించేందుకు అంగీకరించాడు. ఈ సినిమాలకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. సల్మాన్‌కు శిక్ష పడటంతో ఈ చిత్రాల భవిష్యత్తు సందిగ్థంలో పడింది. సల్మాన్‌కు బెయిల్ రాకపోతే నిర్మాతలు వందల కోట్ల నష్ట కలుగుతుందంటున్నారు విశ్లేషకులు. -
సల్మాన్‌ను దోషిగా తేల్చిన జోధ్‌పూర్ కోర్టు
-
కృష్ణ జింకల వేట కేసు : సల్మాన్ దోషి
జోధ్‌పూర్, రాజస్థాన్ : రెండు కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను జోధ్‌పూర్ న్యాయస్థానం దోషిగా పేర్కొంది. ఈ కేసులో సల్మాన్‌తో పాటు ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్, సోనాలీ బ్రిందే, టబు, నీలంలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 1998లో వచ్చిన ‘హమ్ సాథ్ సాథ్ హై’ చిత్రీకరణ సమయంలో రాజస్థాన్ అడవుల్లో సల్మాన్ కృష్ణ జింకలను వేటాడినట్లు కేసు నమోదైంది. మూగజీవుల ప్రాణాలను బలిగొన్నందుకు వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 లోని 9/51 ప్రకారం సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్లు జైలు శిక్ష విధించారు. జింకలను క్రూరంగా వేటాడిన సల్మాన్‌కు గరిష్టంగా శిక్ష విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో వాదనలు వినిపించారు. కాగా, జోధ్‌పూర్ కోర్టు తీర్పును సల్మాన్ ఖాన్ హైకోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది. సల్మాన్ దోషిగా తేలడంతో ప్రస్తుతం షూటింగ్లో ఉన్న ఆయన సినిమాల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. -
కృష్ణ జింకల వేట కేసులో నేడే తీర్పు
న్యూఢిల్లీ : కృష్ణ జింకల వేట కేసులో నిందితులుగా ఉన్న బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ తదితరులపై జోధ్‌పూర్ న్యాయస్థానం గురువారం తీర్పు చెప్పనుంది. కేసుకు సంబంధించి తుది వాదనలు గత నెల 28న పూర్తి అయ్యాయి. కేసును విచారిస్తున్న న్యాయమూర్తి తీర్పును గురువారం(ఏప్రిల్ 5)కు వాయిదా వేశారు. తీర్పు నేపథ్యంలో సల్మాన్ ఖాన్ సహా నిందితులుగా ఉన్నబాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్, టబు, సోనాలీ బింద్రే, నీలమ్‌లు ఇప్పటికే జోధ్‌పూర్ చేరుకున్నారు. -
కృష్ణ జింకల వేట కేసు మరో ట్విస్ట్
జైపూర్: సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల వేట కేసు మరో మలుపు తిరిగింది. జింకలను చంపింది సల్మానేనని ఆనాడు జీపు డ్రైవర్‌గా ఉన్న హరీష్ దులానీ చెప్పడంతో కేసు మళ్లీ మొదటి వచ్చేలా కనబడుతోంది. 2002 నుంచి కనిపించకుండా పోయిన హరీష్ హఠాత్తుగా తెరపైకి వచ్చాడు. 'నన్ను చంపుతామని మా నాన్నను బెదిరించారు. దీంతో భయపడి జైపూర్ వదిలి పారిపోయాన'ని హరీష్ దులానీ చెప్పాడు. తనకు రక్షణ కల్పించివుంటే కోర్టులో సాక్ష్య చెప్పేవాడినని అన్నాడు. లిఖితపూర్వకంగా కోరితే అతడికి భద్రత కల్పిస్తామని రాజస్థాన్ హోంమంత్రి గులాబ్ చంద్ కటారియా తెలిపారు. సల్మాన్ ఖాన్ నిర్దోషని రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని న్యాయశాఖ మంత్రి రాజేంద్ర రాథోడ్ వెల్లడించారు. 1998లో జోధ్‌పూర్‌కు సమీపంలోని భావద్, మథానియా ప్రాంతాల్లో సల్మాన్, అతని సహ నటులు కలసి కృష్ణజింకలను వేటాడిన కేసులో సరైన సాక్షాలు లేవని 'సుల్తాన్' స్టార్ ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.