
నటుడు సల్మాన్ ఖాన్
న్యూఢిల్లీ : కృష్ణ జింకల వేట కేసులో నిందితులుగా ఉన్న బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ తదితరులపై జోధ్‌పూర్ న్యాయస్థానం గురువారం తీర్పు చెప్పనుంది. కేసుకు సంబంధించి తుది వాదనలు గత నెల 28న పూర్తి అయ్యాయి.
కేసును విచారిస్తున్న న్యాయమూర్తి తీర్పును గురువారం(ఏప్రిల్ 5)కు వాయిదా వేశారు. తీర్పు నేపథ్యంలో సల్మాన్ ఖాన్ సహా నిందితులుగా ఉన్నబాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్, టబు, సోనాలీ బింద్రే, నీలమ్‌లు ఇప్పటికే జోధ్‌పూర్ చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment