సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తాం! | Salman Khan Threatened on Facebook Post | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తాం!

Published Wed, Sep 25 2019 11:06 AM | Last Updated on Wed, Sep 25 2019 11:06 AM

Salman Khan Threatened on Facebook Post - Sakshi

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తాం అంటూ సోషల్‌ మీడియాలో బెదిరింపు పోస్ట్‌ దర్శనమివ్వటం కలకలం రేపుతోంది. ఈ నెల 27న సల్మాన్‌ కృష్ణ జింకలను చంపిన కేసులో జోథ్‌పూర్‌ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సల్మాన్‌ను చంపేస్తామంటూ కొందరు దుండగులు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

‘సల్మాన్‌.. భారతీయ చట్టాల నుంచి నిన్ను నువ్వు కాపాడుకోగలవేమో. కానీ మా కోర్టులో నువ్వు నేరస్థుడివి. నీకు మేం మరణశిక్ష విధించాం’ అంటూ పంజాబ్‌ యూనివర్సిటీ స్టూడెంట్ ఆర్గనైజేషన్‌ ఫేస్‌ బుక్‌ పేజ్‌లో ఈ నెల 16న పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

హమ్‌ సాథ్‌ సాథ్‌ హై సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్‌ కృష్ణ జింకలను వేటాడి చంపినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సల్మాన్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థాయం ఐదేళ్ల శిక్ష విధించింది. అయితే తీర్పును సవాల్ చేసిన సల్మాన్‌కు కోర్టు బెయిల్ మంజురూ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement