సల్మాన్ ఖాన్ కృష్ణజింకలను వేటాడిన కేసులో జోధ్‌పూర్ కోర్టు ఊహించని తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో అభిమానులు కంగుతిన్నారు. అయితే సల్మాన్‌కు జైలు శిక్ష విషయంలో అందరికంటే ఎక్కువగా బాధకు గురైంది సల్మాన్ చెల్లెల్లు అల్విరా, అర్పితా ఖాన్. తీర్పు వెలివడిన వెంటనే వీరు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
కోర్టు విరామ సమయంలో కూడా వారు బయటకు వెళ్లకుండా అక్కడే కూర్చున్నారు. జడ్జి ఐదేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. సల్మాన్ మాత్రం నేను నిర్దోషినంటూ జడ్జికి పదేపదే విన్నవించుకున్నారు. సల్మాన్ తరుపు లాయర్‌కూడా ఈ తీర్పుపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఐదేళ్లు శిక్ష విధిస్తారని తాము ఊహించలేదని తెలిపారు. ఇప్పటికే బెయిల్ కోసం కోర్టు ను ఆశ్రయించినట్టుగా తెలిపారు. ఈ పిటిషన్‌పై ఈ రోజు(శుక్రవారం) విచారణ జరగనుంది.
ప‍్రస్తుతం సల్మాన్ మీద వందల కోట్ల రూపాయల బిజినెస్ ఆధారపడి ఉంది. ఇటీవల రేస్ 3 షూటింగ్ ను పూర్తి చేసిన సల్లూభాయ్ భరత్, దబాంగ్ 3లలో నటించేందుకు అంగీకరించాడు. ఈ సినిమాలకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. సల్మాన్‌కు శిక్ష పడటంతో ఈ చిత్రాల భవిష్యత్తు సందిగ్థంలో పడింది. సల్మాన్‌కు బెయిల్ రాకపోతే నిర్మాతలు వందల కోట్ల నష్ట కలుగుతుందంటున్నారు విశ్లేషకులు.
Comments
Please login to add a commentAdd a comment