జోధ్‌పూర్/ముంబై: కృష్ణ జింకల వేట కేసులో దోషి సల్మాన్ ఖాన్‌కు బెయిల్ లభించడంతో ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. బెయిల్ పిటిషన్‌పై తీర్పు సందర్భంగా శనివారం జోధ్‌పూర్ కోర్టు హాలు, పరిసరాలు హీరో అభిమానులతో కిక్కిరిసిపోయింది. పెద్ద సంఖ్యలో గుమ్మికూడిన అభిమానులెవరూ సెల్ఫీల పేరుతో సల్మాన్ దగ్గరికి రాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. తీర్పు వచ్చిన మరుక్షణమే కోర్టు బయట అభిమానులు హడావిడి చేశారు.
అటు ముంబైలోని సల్మాన్ ఇంటి వద్దా దాదాపు ఇదే పరిస్థితి. శనివారమే సల్మాన్ ముంబైకి వచ్చేస్తారన్న వార్తల నేపథ్యంలో ముంబైలోని ఆయన ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. సల్మాన్ ఫ్లెక్సీలను చేతబట్టి.. హీరోకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రచ్చ చేశారు. రోడ్లపై వెళ్లేవారికి మిఠాయిలు తినిపించి ఆనందాన్ని పంచుకున్నారు. ఖాన్ నిర్వహిస్తోన్న ‘బీయింగ్ సల్మాన్ ఫౌండేషన్’ ద్వారా సాయం పొందిన చాలా మంది తమ అభిమాన నటుడు క్షేమంగా ఇంటికి తిరిగిరావాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఈమేరకు సంబంధిత ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు సల్మాన్‌కు బెయిల్ దక్కడంపై హర్షం వ్యక్తంచేశారు.
20ఏళ్ల నాటి కేసు: 1998లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ కోసం జోధ్‌పూర్ వెళ్లిన చిత్రబృందం.. విరామ సమయంలో ఆటవిడుపుగా వేటకు వెళ్లి అరుదైన కృష్ణ జింకలు రెండిటిని చంపేశారని అభియోగాలు నమోదయ్యాయి. 20 ఏళ్ల విచారణ అనంతరం జోధ్‌పూర్ సెషన్స్ కోర్టు గురువారం(ఏప్రిల్ 5న) తుది తీర్పు చెప్పింది. సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్లు జైలు పడగా, మిగతా నిందితులైన సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలీ బిద్రేలను నిర్దోషులుగా కోర్టు పేర్కొంది.
Bihar: Rakhi sisters of #SalmanKhan Saba and Farah celebrate in Patna after he was granted bail by Jodhpur Court in #BlackBuckPaochingCase pic.twitter.com/9A9slOeHWy
— ANI (@ANI) 7 April 2018
Fans of #SalmanKhan gather outside his residence in Mumbai and celebrate following Jodhpur Court's verdict in #BlackBuckPaochingCase. The Court granted him bail in the case. pic.twitter.com/STrcQuihjY
— ANI (@ANI) 7 April 2018
Comments
Please login to add a commentAdd a comment