షారుఖ్, సల్మాన్
ముంబై: కృష్ణజింకలను వేటాడిన కేసులో ఐదేళ్ల శిక్షకు గురైన సల్మాన్ ఖాన్‌కు అతని ఆప్తమిత్రుడు షారుఖ్ ఖాన్ బాసటగా నిలిచాడు. కొన్నేళ్ల క్రితం సల్మాన్‌కు మద్దతుగా షారుఖ్ ఖాన్ చేసిన పలు వ్యాఖ్యలు వారి స్నేహ బంధాన్ని వెల్లడించాయి. ‘కొన్నిసార్లు సెలబ్రిటీ హోదాతో చాలా బాధలుపడాల్సి వస్తుంది. మాపై ఏవైనా ఆరోపణలు వచ్చిన వెంటనే ఇబ్బందులు మొదలైతాయి. అవి నిజమైనా, అబద్ధమైనా మా కీర్తి మసకబారడం ప్రారంభమవుతుంది. సల్మాన్ విషయంలోనూ ఇదే జరిగింది.. అతను సెలబ్రిటీగా ఎంత ఎత్తుకు ఎదిగాడో... ఆరోపణల ఫలితంగా అన్ని కష్టాలు పడ్డాడు.
సల్మాన్ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించే వ్యాఖ్యలు, ఆరోపణలు చాలానే వచ్చాయి. వాటన్నింటిపై ప్రజలు, అభిమానులకు మేం వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. వాటివల్ల సెలబ్రిటీలకు తిప్పలు తప్పవు. నేను చెప్పింది నిజమో కాదో..! ఇది నా అభిప్రాయం. నా వ్యాఖ్యలు ఏ ఒక్కరినో ఉద్దేశించినవి కావు. న్యాయ వ్యవస్థను మనమంతా నమ్మాలి. నమ్ముదాం. కానీ, వ్యక్తిగతంగా సల్మాన్ నాకు బాగా తెలుసు. ఇవన్నీ అతనికి జరగకుండా ఉంటే బాగుండేది’ అని గతంలో సల్మాన్‌కు మద్దతుగా షారుఖ్ మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment