రెండు కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను జోధ్‌పూర్ న్యాయస్థానం దోషిగా పేర్కొంది. ఈ కేసులో సల్మాన్‌తో పాటు ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్, సోనాలీ బ్రిందే, టబు, నీలంలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
1998లో వచ్చిన ‘హమ్ సాథ్ సాథ్ హై’ చిత్రీకరణ సమయంలో రాజస్థాన్ అడవుల్లో సల్మాన్ కృష్ణ జింకలను వేటాడినట్లు కేసు నమోదైంది. మూగజీవుల ప్రాణాలను బలిగొన్నందుకు వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 లోని 9/51 ప్రకారం సల్మాన్ ఖాన్‌కు గరిష్టంగా ఆరేళ్ల నుంచి కనిష్టంగా మూడేళ్ల వరకూ శిక్ష పడే అవకాశం ఉంది.