కృష్ణ జింకల వేట కేసు మరో ట్విస్ట్
జైపూర్: సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల వేట కేసు మరో మలుపు తిరిగింది. జింకలను చంపింది సల్మానేనని ఆనాడు జీపు డ్రైవర్‌గా ఉన్న హరీష్ దులానీ చెప్పడంతో కేసు మళ్లీ మొదటి వచ్చేలా కనబడుతోంది. 2002 నుంచి కనిపించకుండా పోయిన హరీష్ హఠాత్తుగా తెరపైకి వచ్చాడు. 'నన్ను చంపుతామని మా నాన్నను బెదిరించారు. దీంతో భయపడి జైపూర్ వదిలి పారిపోయాన'ని హరీష్ దులానీ చెప్పాడు. తనకు రక్షణ కల్పించివుంటే కోర్టులో సాక్ష్య చెప్పేవాడినని అన్నాడు.
లిఖితపూర్వకంగా కోరితే అతడికి భద్రత కల్పిస్తామని రాజస్థాన్ హోంమంత్రి గులాబ్ చంద్ కటారియా తెలిపారు. సల్మాన్ ఖాన్ నిర్దోషని రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని న్యాయశాఖ మంత్రి రాజేంద్ర రాథోడ్ వెల్లడించారు. 1998లో జోధ్‌పూర్‌కు సమీపంలోని భావద్, మథానియా ప్రాంతాల్లో సల్మాన్, అతని సహ నటులు కలసి కృష్ణజింకలను వేటాడిన కేసులో సరైన సాక్షాలు లేవని 'సుల్తాన్' స్టార్ ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.