Jodhpur District Court
-
జోథ్‌పూర్ కోర్టుకు హాజరైన సల్మాన్
సాక్షి, న్యూఢిల్లీ : కృష్ణజింకలను వేటాడిన కేసులో తనకు విధించిన శిక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణకు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోమవారం జోథ్‌పూర్ సెషన్స్ కోర్టు ఎదుట హాజరయ్యారు. అయితే విచారణను జిల్లా సెషన్స్ కోర్టు జులై 17కు వాయిదా వేసింది. భారీ భద్రత నడుమ కోర్టుకు హాజరైన సల్మాన్ కేసు విచారణ వాయిదా పడటంతో తిరుగుముఖం పట్టారు. కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్‌ను గత నెలలో కోర్టు దోషిగా ప్రకటించడంతో జోథ్‌పూర్ సెంట్రల్ జైలులో కొద్దిరోజులు గడిపిన విషయం తెలిసిందే. సల్మాన్‌కు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించగా ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. సల్మాన్ విదేశాలకు వెళ్లాలంటే తమ అనుమతి అవసరమని కోర్టు స్పష్టం చేసింది. కాగా, ఇదే కేసులో సల్మాన్ సహ నటులు సైఫ్ అలీఖాన్, టబు, నీలం, సోనాలి బింద్రేలకు కోర్టు విముక్తి కల్పించింది. హమ్ సాథ్ సాథ్ హై చిత్ర షూటింగ్ నేపథ్యంలో సల్మాన్ జోథ్‌పూర్‌కు సమీపంలోని కంకణి గ్రామం వద్ద 1998 అక్టోబర్ 1న కృష్ణజింకలను వేటాడి హతమార్చిన కేసులో ఆయనను కోర్టు దోషిగా నిర్ధారించింది. -
సల్మాన్‌కు కోర్టు గ్రీన్ సిగ్నల్
జోధ్‌పూర్ : కృష్ణ జింకల వేట కేసులో బెయిల్‌పై ఉన్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు మరో ఊరట లభించింది. జోధ్‌పూర్ జిల్లా సెషన్స్ కోర్టు రూ.25 వేల విలువైన రెండు బాండ్లు, కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లొద్దనే నిబంధనలపై ఆయనకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సల్మాన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని కోర్టుని ఆశ్రయించారు. దీనిపై మంగళవారం కోర్టు తన తీర్పును వెలువరించింది. మే 25 నుంచి జూలై 10 మధ్యకాలంలో కెనడా, నేపాల్, అమెరికా వెళ్లేందుకు సల్మాన్‌కు అనుమతినిచ్చింది. అయితే సల్మాన్ ఎందుకు విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నాడనేది మాత్రం తెలియరాలేదు. ఈ కేసులో సల్మాన్ దోషిగా తెలడంతో కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. రెండు రోజులు జైల్లో గడిపిన అనంతరం సల్మాన్ బెయిల్‌పై బయటకొచ్చిన విషయం విదితమే. -
అనూహ్యం.. సల్మాన్ బెయిల్‌పై రంగంలోకి జడ్జి
జోధ్‌పూర్ : సల్మాన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కృష్ణ జింకల వేటాడిన కేసులో సల్మాన్‌కు శిక్షలు ఖరారు చేసిన సెషన్స్ జడ్జి రవీంద్ర కుమార్ జోషిని బదిలీ చేస్తూ రాజస్థాన్ హైకోర్టు ఆదేశాలు వెలువరించింది. అయితే తన బదిలీ కంటే ముందుగానే ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణకు ముందుకు వచ్చారు. దీంతో బెయిల్ పిటిషన్‌పై నెలకొన్న అనిశ్చితి వీడిపోయింది. శనివారం ఉదయం హడావిడిగా కోర్టుకు హాజరైన జోషి.. బెయిల్ పిటిషన్‌పై దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు వాదనలు ముగియగా.. సల్మాన్ తరపు న్యాయవాది హస్తిమల్ సరస్వత్ వివరాలను మీడియాకు వివరించారు. బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తిగా వినిపించామని.. భోజన విరామ సమయం తర్వాత పిటిషన్‌పై జడ్జి తీర్పు వెలువరిస్తారని హస్తిమల్ మీడియాకు వివరించారు. దీంతో ఇప్పుడు మీడియా ఫోకస్ అంతా సల్మాన్‌కు బెయిల్ లభిస్తుందా? లేదా? అన్న దాని వైపు మళ్లింది . -
సల్మాన్ కోర్టుకు రావాలి
జోధ్‌పూర్:కృష్ణజింకల వేట కేసుకు సంబంధించి ఈనెల 29న కోర్టులో హాజరు కావాలంటూ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్ జిల్లా కోర్టు ఆదేశించింది. ప్రాసిక్యూషన్ సాక్ష్యాలన్నింటినీ పరిశీలించిన చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. సల్మాన్‌కు ఇప్పటి వరకు వ్యక్తిగత హాజరు నుంచి కోర్టు మినహాయింపు ఉంది.