
జోధ్‌పూర్ : సల్మాన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కృష్ణ జింకల వేటాడిన కేసులో సల్మాన్‌కు శిక్షలు ఖరారు చేసిన సెషన్స్ జడ్జి రవీంద్ర కుమార్ జోషిని బదిలీ చేస్తూ రాజస్థాన్ హైకోర్టు ఆదేశాలు వెలువరించింది. అయితే తన బదిలీ కంటే ముందుగానే ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణకు ముందుకు వచ్చారు. దీంతో బెయిల్ పిటిషన్‌పై నెలకొన్న అనిశ్చితి వీడిపోయింది.
శనివారం ఉదయం హడావిడిగా కోర్టుకు హాజరైన జోషి.. బెయిల్ పిటిషన్‌పై దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు వాదనలు ముగియగా.. సల్మాన్ తరపు న్యాయవాది హస్తిమల్ సరస్వత్ వివరాలను మీడియాకు వివరించారు. బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తిగా వినిపించామని.. భోజన విరామ సమయం తర్వాత పిటిషన్‌పై జడ్జి తీర్పు వెలువరిస్తారని హస్తిమల్ మీడియాకు వివరించారు. దీంతో ఇప్పుడు మీడియా ఫోకస్ అంతా సల్మాన్‌కు బెయిల్ లభిస్తుందా? లేదా? అన్న దాని వైపు మళ్లింది .
Comments
Please login to add a commentAdd a comment