జర్నలిస్టుపై సల్మాన్‌ ఖాన్‌ ఫైర్‌..! | Salman Khan Answer To Journalist On Blackbuck Poaching Case | Sakshi
Sakshi News home page

జర్నలిస్టుపై సల్మాన్‌ ఖాన్‌ ఫైర్‌..!

Published Wed, May 16 2018 10:54 AM | Last Updated on Wed, May 16 2018 12:42 PM

Salman Khan Answer To Journalist On Blackbuck Poaching Case - Sakshi

సల్మాన్‌ ఖాన్‌ (ఫైల్‌ ఫొటో)

ముంబై : బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రేస్‌- 3 ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా సల్మాన్‌ మీడియాతో మాట్లాడారు. అయితే కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్‌ ఖాన్‌కు ఐదు సంవత్సరాల శిక్ష విధిస్తూ కొన్ని రోజుల క్రితం జోధ్‌పూర్‌ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్న సల్మాన్‌కు కోపం తెప్పించింది. ‘కృష్ణజింకల కేసులో మీరు దోషిగా తేలిన సమయంలో.. మీ సినిమా నిర్మాతలు, వారి డబ్బు గురించి మీరు బాధపడ్డారా’  అంటూ జర్నలిస్టు ప్రశ్నించాడు.

అయితే అతడు ప్రశ్న ముగించేలోగానే సల్మాన్‌ కౌంటర్‌ ఇచ్చాడు. ‘నేను జీవితాంతం అక్కడే(జైలు లోపలే) ఉంటాననుకున్నావా’ అంటూ సమాధానమిచ్చాడు. ఊహించని ఈ సమాధానానికి అవాక్కైన జర్నలిస్టు ‘అదేం లేదం’టూ సల్మాన్‌కు బదులిచ్చాడు. ‘థ్యాంక్యూ.. దాని గురించి నేనేం బాధ పడలేదం’టూ సల్మాన్‌ తిరిగి సమాధానమిచ్చాడు. కాగా కృష్ణ జింకలను వేటాడిన కేసులో ప్రస్తుతం బెయిలుపై విడుదలైన సల్మాన్‌ సినిమా షూటింగ్‌లలో పాల్గొంటున్నాడు. రెమో డిసౌజా దర్శకత్వంలో రూపొందుతున్న రేస్‌ 3 సినిమాలో సల్మాన్‌తో పాటు అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌, జాక్వలిన్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జూన్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement