బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్కు కృష్ణ జింక కష్టాలు వీడేలా కనిపించడం లేదు. కృష్ణజింకను వేటాడిన కేసులో సల్మాన్పై రాజస్తాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ఏడాది జూలై 25న ఆ రాష్ట్ర హైకోర్టు సల్మాన్ నిర్ధోషి అంటూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. కాగా 1998లో జోధ్‌పూర్‌కు సమీపంలోని భావద్, మథానియా ప్రాంతాల్లో ఓ కృష్ణజింకను, ఓ మామూలు జింకను వేటాడి చంపినట్టు సల్మాన్ తోపాటు మరో ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి. సల్మాన్‌పై వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్ 51 ప్రకారం ఈ కేసులు నమోదు చేశారు.
Published Wed, Oct 19 2016 11:11 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement