జైపూర్: రాజస్థాన్‌లో పొలిటికల్ హైడ్రామా క్లైమాక్స్‌కు చేరుకుంటోంది. అనేక నాటకీయ పరిణామాల తర్వాత అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జైపూర్‌లోని పైర్‌మౌంట్ రిసార్ట్‌లో గురువారం మధ్యాహ్నం కాంగ్రెస్ శాసన సభాపక్షం సమావేశమయ్యింది. ఈ భేటీలో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే వరకు ఎమ్మెల్యేలందరూ ఎట్టి పరిస్థితుల్లోనూ రిసార్ట్‌లో ఉండాలన్నారు. (ముచ్చటగా మూడోసారి)
అయితే మంత్రులు వారి పనులు నిర్వర్తించుకునేందుకు సచివాలయానికి వెళ్లొచ్చని తెలిపారు. కాగా ఆగస్టు 14 నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించేందుకు గవర్నర్ అనుమతించారు. ఇదిలా వుండగా 2018లో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన ఆరుగురు.. ఆ తరువాత 2019 సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌లో చేరారు. ఈ విలీనాన్ని సవాలు చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ బుధవారం రాజస్తాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం స్పీకర్ సహా ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 11 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. (రాజస్తాన్ డ్రామాకు తెర)
Comments
Please login to add a commentAdd a comment