జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టే క్రమంలో పాత బడ్జెట్ ప్రతులను అసెంబ్లీకి తీసుకొచ్చారు. అది కూడా ఎవరో కాదు.. సీఎం స్థానంలో ఉన్న అశోక్ గెహ్లాట్. 2023-24 బడ్జెట్‌ను చదివే క్రమంలో గత బడ్జెట్‌ను సీఎం గెహ్లాట్ చదవడంతో అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులకు ఏమీ అర్థం కాలేదు. కాసేపటికి తప్పు తెలుసుకున్న సీఎం అశోక్ గెహ్లాట్ నాలుక కరుచుకున్నారు. తాను ఎంత పొరపాటు చేశానో తెలుసుకుని కొత్త బడ్జెట్‌ను చదివారు. ఏడు నిమిషాల పాటు పాత బడ్జెట్‌ను చదువుతూ ఉండటంతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
ఆఫీసర్స్ గ్యాలరీ నుంచి సందేశం
సీఎం అశోక్ గెహ్లాట్ పాత బడ్జెట్‌ను చదువుతున్నారనే విషయాన్ని హౌజ్ గ్యాలరీలో కూర్చొని ఉన్న ఫైనాన్స్ ఆఫీసర్లు చీఫ్ విప్ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీన్ని ఆసరాగా తీసుకున్న బీజేపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. బడ్జెట్ ముందుగానే లీక్ అయ్యిందంటూ స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చారు. దాంతో స్పీకర్ సీపీ జోషి సభను 30 నిమిషాల పాటు వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment