Raj Thakre
-
‘ఆ ఎంపీ ముఖ్యమంత్రినే ధిక్కరించడం ఆశ్చర్యంగా ఉంది’
సాక్షి, ముంబై: తన అయోధ్య పర్యటనపై కావాలనే కొందరు పనిగట్టుకుని వాతావరణాన్ని వేడెక్కించే ప్రయత్నం చేశారని, లేదంటే ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక బీజేపీ ఎంపీకి ఏకంగా ఆ పార్టీ ముఖ్యమంత్రిని వ్యతిరేకించే ధైర్యం ఎక్కడి నుంచి, ఎలా వచ్చిందని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే నిలదీశారు. పుణేలో ఆదివారం ఉదయం గణేశ్ కళా క్రీడామంచ్ సభాగృహంలో జరిగిన సభలో ఆయన మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాగా, రాజ్ ఠాక్రే సభకు అనుమతిచ్చే ముందు పుణే సిటీ పోలీసులు 13 షరతులు విధించారు. అందులో ఎన్ని ఉల్లంఘనలు జరిగాయనేది త్వరలో పోలీసులు వెల్లడించనున్నారు. ఈ నెల ఒకటో తేదీన ఔరంగాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తానని ఎమ్మెన్నెస్ చీఫ్ ప్రకటించారు. ఆ మేరకు ఆదివారం పుణేలో సభ నిర్వహించారు. సభకు ముందు పోలీసులు అనుమతిస్తారా..లేదా.. ముఖ్యంగా ఈ సభలో రాజ్ ఎవరిని లక్ష్యంగా చేసుకుని వ్యంగాస్త్రాలు సంధిస్తారు...? ఎవరిపై ఆరోపణలు చేస్తారనేది ఇటు అధికార పార్టీ మంత్రులు, రాజకీయ నాయకులతోపాటు అటు సామాన్య ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు సభ ప్రశాంతంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎవరు రాజకీయం చేస్తున్నారో నాకుతెలుసు... ఉత్తర భారతీయులకు క్షమాపణలు చెప్పేవరకు అయోధ్యకు రానివ్వబోమని యూపీలో ఒక బీజేపీ ఎంపీ ఎమ్మెన్నెస్‌కు సవాలు విసరడం ఆశ్చర్యంగా ఉందని రాజ్ ఠాక్రే అన్నారు. వ్యతిరేక గాలులు, విధానాలు మహారాష్ట్ర నుంచి ఎవరో ఆయనకు నూరిపోశారని ఆయన ఆరోపించారు. లేదంటే ఒక ఎంపీకి ఇంత ధైర్యమెక్కడిదని నిలదీశారు. తన అయోధ్య పర్యటనను వ్యతిరేకించడం వెనక రాష్ట్రం నుంచే కొన్ని దుష్టశక్తులు పనిచేసినట్లు తనకు తెలిసిందన్నారు. ముంబై, ఉత్తరప్రదేశ్ నుంచి లభించిన సమాచారం ప్రకారం ఒక వ్యూహం ప్రకారం తనని ట్రాప్ చేశారని తెలిసింది. ఒకవేళ నేను బలవంతంగా అయోధ్య పర్యటనకు వచ్చినట్లైతే నా వెనకాల వచ్చే వేలాది మంది ఎమ్మెన్నెస్ పదాధికారులపై, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేసేవారని, ఘర్షణలు జరిగితే వారిని జైలులో పెట్టేవారని రాజ్ ఠాక్రే పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారమే తన పర్యటనను అడ్డుకునే ప్రయత్నం జరిగిందని ఎవరి పేరూ ఉచ్ఛరించకుండా ఆరోపణలు చేశారు. దాదాపు 15 ఏళ్ల కిందట ఉత్తర భారతీయులపై దాడి చేసినందుకు క్షమాపణలు అడగాలని లేని పక్షంలో అయోధ్యలో అడుగు పెట్టనివ్వబోమని యూపీకి చెందిన బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్ హెచ్చరించారు. దీనిపై రాజ్ ఠాక్రే గుజరాత్లో జరిగిన ఒక సంఘటనను సింగ్‌కు గుర్తు చేశారు. కొద్ది సంవత్సరాల కిందట గుజరాత్లో ఓ బాలికపై అత్యాచారం జరిగిన తరువాత వందలాది యూíపీ, బిహార్ కార్మికులను, కూలీలను హతమార్చారు. అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చిన కొందరు ముంబైకి చేరుకున్నారు. మరి ఈ ఘటనపై సింగ్ ఎవరి నుంచి క్షమాపణలు కోరుతారని ప్రశ్నించారు. కాగా ఉత్తరభారతీయులపై 15 ఏళ్ల కిందట జరిగిన దాడి సంఘటన ఆకస్మాత్తుగా ఇప్పుడెలా గుర్తుకు వచ్చిందని నిలదీశారు. దీనివెనకాల ఉన్న రాజకీయమేంటో అర్ధం చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. తన అయోధ్య పర్యటనలో భాగంగా శ్రీరామున్ని దర్శించుకోవడంతోపాటు అప్పట్లో బాబ్రీ మసీదు కూల్చివేసిన సంఘటనలో అనేక మంది కరసేవకులను హతమార్చారని, ఆ స్థలాన్ని సందర్శించాలని అనుకున్నానన్నారు. అయితే తన పర్యటనను వ్యతిరేకించడం వల్ల హిందుత్వానికే నష్టం జరిగిందని రాజ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. చదవండి: మేము వచ్చాకే రోడ్లపై నమాజ్ చేయడం ఆగిపోయింది: సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు -
సచిన్ పోస్ట్: ఠాక్రే ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, ముంబై : మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, గాయని లతా మంగేష్కర్‌ల ప్రతిష్టను వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం çపణంగా పెట్టిందని ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్‌ఠాక్రే మండిపడ్డారు. ఇరువురితో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించాల్సి ఉండకూడదని అభిప్రాయపడ్డారు. సచిన్, లతా మంగేష్కర్లు వారివారి వృత్తిలో గొప్ప పేరు, ప్రఖ్యాతలు సంపాదించారని, కానీ, కొద్దిరోజుల కిందట వారు పెట్టిన పోస్టుల కారణంగా సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతుల ఆందోళనకు మద్దతుగా ప్రముఖ గాయని రిహానా పోస్టుపెట్టినపుడు కనీసం ఆమె గురించి భారతీయుల్లో చాలామందికి తెలియదని, అక్కడితో వదిలేస్తే బాగుండేదని కానీ, కేంద్రం భారత్‌లోని పలువురు సెలబ్రెటీలతో రిహానాకు కౌంటర్‌గా ప్రత్యేక హ్యాష్‌ట్యాగ్‌లతో పోస్టులు పెట్టించారని విమర్శించారు. అయితే రిహానా, గ్రెటా థన్‌బెర్గ్‌లను భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోందని, కానీ, అమెరికాలోని హోస్టన్‌లో డోనాల్డ్ ట్రంప్ కు మద్దతుగా మోదీ అగ్‌లీబార్ ట్రంప్ సర్కార్ ర్యాలీ ఎంతవరకు సమంజసమని చురకలంటించారు. ఈ గొడవల్లోకి అనవసరంగా అక్షయ్‌కుమార్ లాంటి సెలబ్రెటీలనూ లాగారని రాజ్‌ఠాక్రే అభిప్రాయపడ్డారు. ఇపుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారంతా విమర్శలు ఎదుర్కొనే స్టేజిలో ఉన్నారని రాజ్‌ఠాక్రే వ్యాఖ్యానించారు. రైతుల వద్ద అంతమంది పోలీసులెందుకు? ఢిల్లీలో రైతుల ఆందోళన వద్ద బందోబస్తు చూస్తుంటే.. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల వద్ద కూడా ఇంత పెద్ద ఎత్తున ఉండదంటూ కేంద్ర ప్రభుత్వంపై ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్‌ఠాక్రే మండిపడ్డారు. టోల్‌నాకా కేసుపై వాషీ కోర్టులో శనివారం హాజరైన ఆయన బెయిల్ లభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన రైతు చట్టాలపై రాజ్‌ఠాక్రే మాట్లాడుతూ.. ‘‘ఈ చట్టాలలో తప్పులేమీ లేవు. కానీ, వాటిలో కొన్ని లోపాలు ఉండి ఉంటాయి. దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రులతో చర్చలు జరిపి కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించాలి. చట్టాలను అమలు చేయాల్సింది’’ అని పేర్కొన్నారు. ఇక రైతుల ఆందోళనపై మాట్లాడుతూ.. ఈ ఆందోళన అవసరంకంటే అధికంగా తీవ్రమైందన్నారు. ఇండియా–పాకిస్తాన్, ఇండియా–చైనా సరిహద్దులలో ఉండే భద్రతకంటే అధికంగా రైతుల ఆందోళన వద్ద పోలీసులను మొహరించడంపై కేంద్రాన్ని విమర్శించారు. అయోధ్య పర్యటపై ఇంకా తేదీ ఖరారు కాలేదని రాజ్‌ఠాక్రే మీడియాకు బదులిచ్చారు. -
వలస కూలీలతో మహా చెలగాటం
ముంబై : వలస కూలీల విషయంలో యూపీ సీఎం తీసుకున్న నిర్ణయం సరికొత్త వివాదాలకు దారితీస్తోంది. వలస కూలీలను ఎవరైనా పనిలోకి తీసుకునే ముందు తమ ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ చేసిన వ్యాఖ్యలకు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే దీటుగా బదులిచ్చారు. యూపీ వాసులతో పనిచేయించుకోవాలంటే అనుమతి కోరాలని యోగి ఆదిత్యానాథ్ పేర్కొంటే ఇక్కడ పనిచేయాలనుకునే వారు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరాల్సిందేనని అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి విషయాలపై తీవ్రంగా దృష్టిసారించాలని, పనిచేసేందుకు ఇక్కడకు వచ్చే ప్రతి కార్మికుడు ప్రభుత్వంతో పాటు స్ధానిక పోలీసుల వద్ద తమ పేర్లను నమోదు చేయించుకోవాలని, వారంతా డాక్యుమెంట్లను, ఫోటోలను సమర్పించాలని ఠాక్రే ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను కట్టుదిట్టంగా చేపట్టాలని సూచించారు. కాగా వలస కూలీల సంక్షేమం కోసం మైగ్రేంట్స్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ అధికారులను ఆదేశించారు. యూపీ నుంచి మానవ వనరులను ఇతర రాష్ట్రాలు కోరుకుంటే నేరుగా పంపడం సాధ్యం కాదని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో వలస కూలీల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. యూపీ ప్రభుత్వం వలస కార్మికులకు బీమా, సామాజిక సంక్షేమం కల్పించే బాధ్యతను చేపడుతుందని చెప్పారు. వారు ఎక్కడ పనిచేసినా వారికి యూపీ ప్రభుత్వం భరోసాగా నిలుస్తుందని అన్నారు. చదవండి : ఏడు మృతదేహాల్లో పాయిజన్ ఆనవాళ్లు! -
న్యాప్కిన్స్పై ఠాక్రే ఫోటో : సేనపై ఎంఎన్ఎస్ ఫైర్
ముంబై : శివసేన పార్టీ కార్యకర్తలు ఆదిత్య ఠాక్రే ఫోటో ముద్రించిన శానిటరీ న్యాప్కిన్స్ను పంపిణీ చేయడం పట్ల పాలక పార్టీపై రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అభ్యంతరం వ్యక్తం చేసింది. మహా వికాస్ అఘది ప్రభుత్వంలో శివసేన చీఫ్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే పర్యావరణ, పర్యాటక శాఖ మంత్రిగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. శివసేన కార్యకర్తలు ఆదిత్య ఠాక్రే ఫోటో ముద్రించిన 500 ప్యాకెట్ల శానిటరీ న్యాప్కిన్స్ను కొలబా అసెంబ్లీ నియోజకవర్గంలోని మహిళలకు పంచారని సీనియర్ ఎంఎన్ఎస్ నేత సందీప్ దేశ్‌పాండే ఆరోపించారు. శివసేన యువజన విభాగం యువతి, యువసేన కార్యకర్తలు వీటిని పంపిణీ చేశారని దేశ్‌పాండే ట్వీట్ చేశారు. ఆదిత్య ఠాక్రే యువ సేన అధ్యక్షుడిగానూ వ్యహరిస్తుండటం గమనార్హం. కాగా కరోనా వైరస్‌తో ముంబై నగరం విలవిలలాడుతోంది. దేశ ఆర్థిక, వినోద రాజధానిలో ఇప్పటివరకూ 23,935 కోవిడ్-19 కేసులు నమోదవగా 841 మంది మరణించారు. చదవండి : మండలికి ఠాక్రే: ఎన్నిక ఏకగ్రీవం..! -
ఈడీ ఎదుటకు రాజ్ ఠాక్రే
సాక్షి, ముంబై: మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించింది. రాత్రి 8.15 గంటల వరకు కూడా విచారణ కొనసాగింది. మరోసారి ఆయన్ను విచారణకు పిలిచేదీ లేనిదీ ఈడీ వెల్లడించలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్(ఐఎల్ అండ్ ఎఫ్ఎస్) నుంచి కోహినూర్ సీటీఎన్ఎల్ కంపెనీకి రూ.450 కోట్ల రుణాలు ఇప్పించడంలో రాజ్‌ఠాక్రే అవకతవకలకు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తోంది. -
బీజేపీ ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్స్
సాక్షి, ముంబై: బీజేపీ ఎమ్మెల్యే ప్రసాద్ లాడ్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్లు వచ్చాయి. కేసు నమోదుచేసిన స్థానిక సైన్ పోలీసులు అజ్ఞాత వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే భారీ మెజార్టీ రావడంతో ముంబైకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రసాద్ లాడ్ సోమవారం సాయంత్రం సైన్ ప్రాంతంలో విజయోత్సవాలు నిర్వహించారు. అందుకు భారీ వేదిక, ప్లెక్సీలు, బ్యానర్లు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. కాగా, లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే తమ పార్టీ తరఫున అభ్యర్థులను బరిలోకి దింపకపోయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పది ప్రచార సభలు నిర్వహించారు. ప్రచారం చేసిన చోట మధ్య మధ్యలో వేదికపై ఏర్పాటు చేసిన స్క్రీన్‌పై మోదీ వైఫల్యాలను ఎండగట్టే వీడియో క్లిప్పింగులను ప్రదర్శించారు. అప్పట్లో రాజ్ ఠాక్రే చెప్పిన ‘లావ్రే తో వీడియో’ (ఆ వీడియో ప్రదర్శించండి) అనే డైలాగ్ ఫేమస్ అయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రసాద్ లాడ్ మద్దతుదారులు వేదిక వద్ద ఏర్పాటు చేసిన ప్లెక్సీలపై ఎమ్మెన్నెస్‌ను పరోక్షంగా కించపరిచాలనే ఉద్ధేశంతో ‘లావ్రే తో ఫటాకే, వాజవ్రే ఢోల్’ అనే వ్యాఖ్యలు రాశారు. ఈ విషయాన్ని గమనించిన ఎమ్మెన్నెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. వారు వెళ్లిపోయిన తరువాత కొద్దిసేపటికే లాడ్‌కు బెదిరింపు ఫోన్లు రావడం మొదలయ్యాయి. దీంతో ఆ ఫోన్లు ఎమ్మెన్నెస్ కార్యకర్తలే చేసి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఆరో రోజుకు హజారే దీక్ష
రాలెగావ్ సిద్ధి (మహారాష్ట్ర): లోక్‌పాల్, లోకాయుక్తాల నియామకాలు చేపట్టాలని, రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త అన్నా హజారే చేపట్టిన దీక్ష సోమవారం ఆరో రోజుకు చేరింది. దీక్ష కారణంగా అన్నాహజారే 4.25 కేజీల బరువు తగ్గారని, బీపీ పెరిగిందని డాక్టర్ ధనంజయ్ పొటే తెలిపారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ అన్నా హజారే ప్రాణాలను కాపాడాలని శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్ఎన్ఎస్) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఎమ్ఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే,, సామాజిక కార్యకర్త రాజేంద్ర సింగ్ సోమవారం హజారేను కలిశారు. ‘హజారే 2013లో చేసిన దీక్ష కారణంగానే బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చింది. హజారే వల్లే కేజ్రీవాల్ ఎవరో దేశానికి తెలిసింది. అలాంటి వ్యక్తి కనీసం ధర్నాకు మద్దతు తెలియజేయలేదు’ అని ఠాక్రే అన్నారు. -
మంత్రాలయ కాదది ఆత్మహత్యాలయం
సాక్షి, ముంబై : మంత్రాలయ భవనం వద్ద ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ‘‘ముంబైలో ఉంది మంత్రాలయ భవనం కాదు.. ఆత్మహత్యాలయ భవనం’’ అని ఎమ్మెన్నెస్ అధినేత రాజ్ ఠాక్రే వ్యాఖ్యానించిన రోజే మంత్రాలయలో మరో ఆత్మహత్య చోటుచేసుకుంది. ఔరంగాబాద్ జిల్లా పైఠణ్ ప్రాంతానికి చెందిన హర్షల్ రావుతే (45) గురువారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో మంత్రాలయ భవనం ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భద్రతా సిబ్బంది వెంటనే అతణ్ని అంబులెన్స్‌లో సీఎస్ఎంటీ సమీపంలో ఉన్న సెయింట్ జార్జ్ ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సామాన్య పరిపాలనా విభాగంలో.. పైఠణ్ ప్రాంతానికి చెందిన హర్షల్ రావుతే కొద్ది రోజులుగా ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో ఉంటున్నట్లు తెలిసింది. కాగా, గురువారం మధ్యాహ్నం మంత్రాలయ భవనానికి వచ్చాడు. సామాన్య పరిపాలన విభాగం కార్యకలాపాలు నిర్వహించే ఐదో అంతస్తులోకి వెళ్లినట్లు ప్రవేశ ద్వారం వద్ద ఎంట్రీ పాస్ జారీచేసే కౌంటర్లో నమోదైన వివరాలను బట్టి తెలిసింది. కాగా, అతడు సామాన్య పరిపాలన విభాగంలో ఎవరితో భేటీ అయ్యాడు, అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడో వివరాలు మాత్రం తెలియరాలేదు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రతిపక్ష నాయకులు రాధాకృష్ణ విఖే పాటిల్, ధనంజయ్ ముండే అజీత్ పవార్, జయంత్ పాటిల్ తదతర ప్రముఖులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికే మంత్రాలయకు..: రాజ్ ఠాక్రే ఒకప్పుడు రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి వ్యవసాయ భూములకు వెళ్లే వారని.. కానీ, ఇప్పుడు మంత్రాలయకు వస్తున్నారని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధినేత రాజ్ ఠాక్రే ధ్వజమెత్తారు. 2014లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి కంటే బీజేపీ ప్రభుత్వం మెరుగ్గా పనిచేస్తుందని బీజేపీ నాయకులు ప్రగాల్భాలు పలికారని, కానీ, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని మండిపడ్డారు. మూడేళ్లలో పెరిగిపోయింది.. వరుసగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న ఆత్మహత్యా ఘటనలపై రాజ్ ఠాక్రే బీజేపీ, శివసేన కూటమి ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి పాలన కంటే బీజేపీ కూటమి పాలన భిన్నంగా ఉందని రాజ్ ఠాక్రే విమర్శించారు. గడచిన మూడేళ్లలో మంత్రాలయ ప్రవేశ ద్వారం వద్ద ఆత్మహత్య, ఆత్మహత్యా యత్నం చేసుకునే వారి సంఖ్య పెరిగిపోయిందన్నారు. దీన్ని బట్టి కాంగ్రెస్–ఎన్సీపీ పాలనతో పోలిస్తే బీజేపీ ప్రభుత్వం ఎంతో భయానకంగా ఉందని చెప్పాల్సి వస్తోందని ఎద్దేవాచేశారు. మూడేళ్ల కాలంలో నిరుద్యోగ యువకులు, రైతులు, అన్యాయం జరిగిన బాధితులు మంత్రాలయ చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారని, కానీ, న్యాయం లభించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో ఇక తమకు న్యాయం జరగదని తెలుసుకున్న బాధితులు విసుగెత్తి ఆత్మహత్య చేసుకునేందుకు మంత్రాలయ ప్రవేశ ద్వారాన్ని ఎంచుకుంటున్నట్లు తెలుస్తోందన్నారు. ధర్మ పాటిల్ ఆత్మహత్య చేసుకున్న తరువాత ధర్మ పాటిల్ కోల్పోయిన భూముల నష్టపరిహార వివాదం కాంగ్రెస్–ఎన్సీపీ హాయాంలోదని బీజేపీ మంత్రులు వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయిందని, మేరెందుకు సరైన నష్టపరిహారం ఇవ్వదలేని నిలదీశారు. ధర్మ పాటిల్ ఆత్మహత్యకు ముందు 2016 మార్చిలో మాధవ్ కదం అనే వ్యక్తి అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మంత్రాలయ ప్రవేశ ద్వారం వద్ద విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తుచేశారు. అదే సంవత్సరం రాజు ఆంగ్లే అనే యువకుడు ఉద్యోగం దొరక్కపోవడంతో ఆత్మహత్య యత్నం చేశాడని తెలిపారు. ఇటీవల కాలంలో ఓ వ్యక్తి మంత్రాలయ భవనం ఆరో అంతస్తు నుంచి దూకే ప్రయత్నం చేస్తే.. ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న ఆరో అంతస్తులో జాలీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారని ఎద్దేవాచేశారు. కానీ, ఇలా జాలీలు ఏర్పాటు చేసి.. నిధులు వృథా చేసే బదులుగా బాధితుల సమస్యలు పరిష్కరిస్తే ఆత్మహత్య చేసుకునే అవసరమే రాదని హితవు పలికారు. పెరోల్‌పై రాక.. హర్షల్ రావుతేకు తన మరదలు హత్యకేసులో 14 ఏళ్ల శిక్ష పడింది. ఇటీవల పైఠణ్ జైలు నుంచి పెరోల్‌పై విడుదలైనట్లు తెలిసింది. దీంతో హర్షల్ రావుతే ఆత్మహత్య కథ మరో మలుపు తిరిగింది. మంత్రాలయకు వచ్చి ఎందుకు ఆత్మహత్య చేసుకోవల్సి వచ్చిందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పక్షం రోజుల్లో ఇది మూడో సంఘటన కావడంతో ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడానికి ప్రతిపక్షాలకు మంచి అవకాశం లభించినట్లైంది. మంత్రాలయం భవనం వద్ద నెల రోజుల కింద ధుళే జిల్లాకు చెందిన ధర్మ పాటిల్, తాజాగా బుధవారం అహ్మద్‌నగర్ జిల్లాకు చెందిన అవినాశ్ శేటే (25) ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకునే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు ఘటనలు తాజాగా ఉండగానే గురువారం హర్షల్ రావుతే ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. -
ఎమ్మెన్నెస్ నుంచి తగ్గని వలసలు
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) పార్టీ నుంచి వలసల పరంపర కొనసాగతూనే ఉంది. ఈ పార్టీకి అనుబంధంగా ఉన్న ముంబై వర్సిటీలోని విద్యార్థి సేనలో అసంతృప్తులు ఎక్కువయ్యారు. అంతర్గత కలహాలు, లుకలుకలు మొదలయ్యాయి. దీంతో విద్యార్థి సేనలో చీలికలు, పార్టీ ఫిరాయింపులు ఖాయమని స్పష్టమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఎమ్మెన్నెస్‌లో ఫిరాయింపులు మొదలయ్యాయి. వాటిని నివారించేందుకు పార్టీ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టినా కొన్ని రోజుల తర్వాత దాన్ని నిలిపివేశారు. కాగా, ఇప్పటికే చాలామంది మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు పార్టీని విడిచిపెట్టారు. త్వరలో మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. తాజాగా ముంబై వర్సిటీకి చెందిన విద్యార్థి సేన నాయకులు సైతం వలస బాట పట్టినట్లు తెలుస్తోంది. తమను విశ్వాసంలోకి తీసుకోకుండానే రాజ్ ఠాక్రే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని విద్యార్థి సేన నాయకులు అంటున్నారు. యూనివర్సిటికీ కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అందుకు చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రత్యర్థులను ఓడించేందుకు ఎత్తుగడలు, వ్యూహాత్మకంగా పావులు కదడం లాంటి విషయాలపై రాజ్ ఠాక్రే ఒంటెద్దు పోకడలకు పోతున్నారని, ఏ విషయంలోనూ తమను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. కాగా, ఇలా అన్ని విభాగాలకు చెందిన నాయకులు, కార్యకర్తలూ విడిచిపెట్టి పోతుంటే పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయే అవకాశముందని పార్టీ సీనియర్ నాయకులు ఆవేదన చెందుతున్నారు. -
తెరపైకి మళ్లీ భూమిపుత్రుల నినాదం
పార్లమెంట్లో మరాఠీయుల ఆత్మగౌరవం వినిపించే ఎంపీనే లేరన్న రాజ్‌ఠాక్రే సాక్షి, ముంబై: పార్టీ స్థాపించిన తొలినాళ్లలో వినిపించిన భూమి పుత్రుల నినాదాన్ని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. మరాఠీయుల ఆత్మగౌరవం గురించి పార్లమెంట్లో మాట్లాడేందుకు ఏ ఒక్క ఎంపీ కూడా లేరని అన్నారు. కల్యాణ్ లోక్‌సభ నియోజకవర్గం ఎమ్మెన్నెస్ అభ్యర్థి రాజు పాటిల్‌కు మద్దతుగా కల్వాలోని మనీష్‌నగర్‌లో ఆదివారం సాయంత్రం ఏర్పాటుచేసిన ప్రచారసభలో రాజ్‌ఠాక్రే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...వలసవాదులు తలదాచుకునేందుకు ఎంపిక చేసుకుంటున్న ప్రాంతాల్లో ఠాణే జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. ఇక్కడ విచ్చలవిడిగా వెలుస్తున్న అక్రమ కట్టడాలు ఠాణే పేరు పూర్తిగా చెడగొట్టాయని, తమ పార్టీ అధికారంలోకి వస్తే ఒక్క బిల్డర్‌ను కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా పూర్తిగా అడ్డుకట్టవేస్తామని హామీ ఇచ్చారు.ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు ఇక్కడ చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో మరాఠీయులు ఆత్మగౌరవం వినిపించేందుకు ఎమ్మెన్నెస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చాటింపు చేస్తున్న ప్రభుత్వం ఆచరణలో విఫలమవుతోందని రాజ్‌ఠాక్రే ఆరోపించారు. ఒక్క పుణేలోనే 1.25 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయని, దీన్ని ప్రజాస్వామ్యమంటారా..? అని ఆయన నిలదీశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలను గొరంతలు, కొండంతలుగా చూపిస్తున్న హిందీ, ఇంగ్లీష్ చానళ్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా టీఆర్పీని పెంచుకునేందుకు తన ఇంటర్వ్యూని ఇతర భాషల్లోకి అనువధించి తప్పుగా ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు. గుజరాత్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన మోడీ దేశానికి కూడా సుపరిపాలన అందించగలరన్న ధీమాను వ్యక్తం చేశారు. అందుకే ఆయన ప్రధాని అయ్యేందుకు మద్దతు పలికామన్నారు. మహారాష్ట్ర గురించి సమగ్ర సమాచారం తెలిసిన మోడీ వస్తే రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకెళుతుందన్నారు. మోడీకి మద్దతు తన వ్యక్తిగత విషయమని, ఇతరులెందుకు జోక్యం చేసుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. ‘పీడబ్ల్యూడీ మంత్రి ఛగన్ భుజబల్ పదవీ కాంక్ష ఉంది. అప్పట్లో శరద్ పవార్ పదవి ఎర చూపగానే శివసేన నుంచి ఎన్సీపీకి వెళ్లారు. బాల్‌ఠాక్రేకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హోంమంత్రి పదవి రాగానే బాల్‌ఠాక్రేను అరెస్టు చేయాలనుకున్నారు. ఇలాంటి వ్యక్తిని మాతోశ్రీ బంగ్లాకు ఉద్ధవ్‌ఠాక్రే విందుకు ఆహ్వానిం చార’ని అన్నారు. అదే తాను పార్టీని వీడితే బాల్‌ఠాక్రేకు వెన్నుపోటు పొడిచానని ఉద్ధవ్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. -
తొలి దశ ప్రచారం పూర్తి
పింప్రి, న్యూస్‌లైన్: లోక్‌సభ ఎన్నికల ప్రచార తొలి దశ పూర్తయింది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు బహిరంగ సభలకు సన్నద్ధమవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల ప్రచారం మొదటి దశను ఆయా పార్టీలు పాదయాత్రలు, వీధి సభలతో పూర్తి చేశాయి. ఇప్పుడు ప్రచారంలో రెండో దశ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. పుణేలో రాహుల్ గాంధీ, నరేంద్రమోడీ శరద్‌పవార్ రాజ్‌ఠాక్రే, నితిన్ గడ్కరీ, యోగేంద్ర యాదవ్, గోపీనాథ్ ముండే తదితర అగ్రనేతలు ఈ సభల్లో పాల్గొననున్నారు. దీంతో ప్రచారం తారస్థాయికి చేరుకోనుంది. పుణే, పింప్రి, చించ్‌వడ్‌లతో పాటు జిల్లాలోని నాలుగు లోక్‌సభ నియోజక వర్గాల్లో ఈ నెల 17వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇందులోభాగంగా ముందుగా రాజ్‌ఠాక్రే ఉగాదిని పురస్కరించుకొని పుణేలో బహిరంగ సభను నిర్వహించారు. ఈ నెల తొమ్మిదో తేదీన నిర్వహించనున్న సభలో కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ మరో సభలో పాల్గొననున్నారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ నాలుగు లోక్‌సభ నియోజక వర్గాల పరిధిలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. బీజేపీ ప్రచారానికి ఆ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఈ నెల 14వ తేదీన బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అదేవిధంగా నితిన్ గడ్కరీ, గోపీనాథ్ ముండేలు కూడా బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఎమ్మెన్నెస్ తరఫున రాజ్‌ఠాక్రే ‘వన్ మెన్ ఆర్మీ’లా అభ్యర్థుల ప్రచారం చేయనున్నారు. ఆదివారం హడస్పర్, వడగావ్శేరిలో ఆ మరుసటి రోజు కోత్రోడ్, పర్వతిలలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఆమ్ ఆద్మీ తరఫున యోగేంద్ర యాదవ్ ఈ నెల 12వ తేదీన బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. -
కూతకు ‘రైలింజన్’ సిద్ధం
సాక్షి, ముంబై: లోకసభ ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే ప్రముఖ పార్టీలన్నీ ఎన్నికలు ప్రచారం ప్రారంభించగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) ఉగాది నుంచి ప్రచారాన్ని ప్రారంభించనుంది. మార్చి 31వ తేదీ సోమవారం నుంచి లాంఛనంగా ప్రచారం ప్రారంభిస్తున్నా ప్రత్యక్షంగా మాత్రం ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఏప్రిల్ ఒకటవ తేదీ మంగళవారం నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందుగా మార్చి 31వ తేదీ పుణే జిల్లా కార్లేలోని ఏక్వీరా దేవి మాతాను దర్శించుకోనున్నారు. ఏప్రిల్ ఒకటవ తేదీ పుణే జిల్లా జున్నర్ నుంచి తన ప్రచారాన్ని ప్రారంభిస్తారు. శంకరపూరాలో జరగనున్న బహిరంగ సభలో ఎమ్మెన్నెస్ అభ్యర్థి అశోక్ ఖండెభరాడ్ కోసం ప్రచారం చేస్తారు. అనంతరం ఏప్రిల్ రెండున డోంబివలిలో, మూడవ తేదీ ముంబై గోరేగావ్, నాలుగవ తేదీ నవీ ముంబై, అయిద న నాసిక్, ఆరున పుణే, ఏడవ తేదీన యావత్మాల్లో తమ అభ్యర్థుల కోసం ప్రచారం చేయనున్నారు. గత లోకసభ ఎన్నికల్లో 13 మందిని బరిలోకి దింపిన ఎమ్మెన్నెస్ ఈసారి కేవలం 10 మందిని బరిలోకి దింపింది. దీంతో ప్రణాళికాబద్ధంగా ప్రచారాన్ని ప్రారంభించింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లోని స్థానిక నేతలు ప్రచారాలు ప్రారంభించారు. ప్రచార రథాలు సిద్ధం... ఎన్నికల ప్రచారాల కోసం అందరి మాదిరిగానే ఎమ్మెన్నెస్ కూడా ప్రచార రథాలను సిద్ధం చేసుకుంది. బీజేపీ కమలంతో రథాన్ని రూపొందించుకోగా కాంగ్రెస్ చేతిగుర్తుతో ఉన్న రథాన్ని రూపొందించుకుంది. ఎమ్మెన్నెస్ కూడా తన పార్టీ గుర్తు అయిన రైలు ఇంజిన్‌తో అనేక ప్రచార రథాలను సిద్ధం చేసుకుంది. ఇప్పటికే అనేక రథాలు సిద్ధమైనప్పటికీ చివరి విడతలో కానున్న ఠాణే, ముంబై లాంటి ప్రాంతాల కోసం ఇంకా ప్రచార రథాలు సిద్ధం చేస్తూనే ఉన్నారు. -
లోక్‌సభ ఎన్నికలు ‘కల్యాణ్’ నుంచి రమేశ్?
సాక్షి, ముంబై: కల్యాణ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే రమేశ్ పాటిల్‌ను బరిలోకి దింపాలని ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే నిర్ణయిం చినట్టు తెలియవచ్చింది. ఈ స్థానం నుంచి ఎన్సీపీ తరఫున ఆనంద్ పరాంజపే, శివసేన తరఫున శ్రీకాంత్ షిండే పేర్లు ఖరారైన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో శివసేనకు దూకుడుకు కళ్లెం వేసేందుకుగాను రాజ్... ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో సుమారు 20 నుంచి 25 స్థానాల్లో మాత్రమే తమ పార్టీ పోటీ చేస్తుందని రాజ్‌ఠాక్రే ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే తొలి విడత అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ ప్రకటించే అవకాశముంది. ఇదిలాఉండగా 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో శివసేన ఠాణే, ముంబై స్థానాల్లో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. అయితే కల్యాణ్ స్థానం నుంచి ఆనంద్ పరాంజపే విజయఢంకా మోగించడంతో కొంత పరువు దక్కింది. అయితే అధిష్టానం తీరుతో విసిగిపోయిన ఆనంద్... ఆ పార్టీతో తెగతెంపులు చేసుకుని ఎన్సీపీలో చేరారు. దీంతో ఈ నియోజక వర్గంలో సమర్థుడైన నాయకుణ్ణి ఎంపిక చేయడం శివసేనకు సంక్లిష్టంగా మారింది. దీంతో పార్టీ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే తనయుడు శ్రీకాంత్ షిండేను అభ్యర్థిగా ప్రకటించాల్సి వచ్చింది. కల్యాణ్ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయఢంకా మోగించాలని అటు ఎన్సీపీ, అటు శివసేన ప్రతిష్టగా భావిస్తున్నాయి. కాగా గోపాల్ లాండ్గే, దీపేశ్ మాత్రే, సునీల్ చౌదరి లాంటి దిగ్గజాలను పక్కనబెట్టి రాజకీయాల్లో అంత అనుభవంలేని శ్రీకాంత్ షిండేకు అభ్యర్థిత్వం ఇవ్వడంపై సహచర నాయకులు అసంతృప్తితో ఉన్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కల్యాణ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెన్నెస్ తరఫున పోటీ చేసిన వైశాలి దరేకర్‌కు లక్షకుపైగా ఓట్లు వచ్చినప్పటికీ మూడో స్థానంలో నిలిచారు. ఆ సమయంలో ఎన్సీపీ పరాజయాన్ని చవిచూసినప్పటికీ శివసేన ఓట్లు కూడా తగ్గాయి. కాగా ఈ ఎన్నికల్లో కూడా ఎమ్మెన్నెస్ తమ అభ్యర్థిని బరిలో దింపడంవల్ల శివసేనకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కల్యాణ్ గ్రామీణ ప్రాంత ఎమ్మెల్యే రమేశ్ పాటిల్, అడ్వొకేట్ సుహాస్ తెలంగ్ పేర్లు చర్చల్లో ఉన్నాయి. అయితే కాంగ్రెస్ నుంచి బయటపడి ఎమ్మెన్నెస్‌లో చేరిన రమేశ్ పాటిల్ శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో 20 ఏళ్ల రాజకీయ అనుభవమున్న రమేశ్ పాటిల్ వైపే ఎమ్మెన్నెస్ అధిష్టానం మొగ్గుచూపే అవకాశం ఎక్కువగా ఉంది. ఆనంద్ పరాంజపే సిట్టింగ్ ఎంపీ కావడంతో ఎన్సీపీ కూడా తన శక్తినంతా కూడగట్టుకుని ఈ ఎన్నికల బరిలో దిగనుంది. అయితే ఎమ్మెన్నెస్ దీటైన అభ్యర్థిని బరిలో దింపితే ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంది. దీంతో కల్యాణ్ లోక్‌సభ నియోజక వర్గంలో ఏ ఒక్క పార్టీ తామే గెలవగలమని గట్టిగా చెప్పగలిగే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది. -
గెలుపుగుర్రాల కోసం ఎమ్మెన్నెస్ వేట..
సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు కొత్త అభ్యర్థులకే ప్రాధ్యాన్యత ఇవ్వాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే యోచిస్తున్నారు. దీంతో లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదల చేయడంలో జాప్యం జరుగుతోందని ఆ పార్టీ సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. లోక్‌సభ ఎన్నికల్లో విజయావకాశాలు ఎక్కువ ఉన్న కొత్త అభ్యర్థులతోపాటు సామాజిక రంగంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న అభ్యర్థుల వేటలో పడ్డారు. అందులో భాగంగా రాజ్ ఠాక్రే జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించడం ప్రారంభించారు. అక్కడి రాజకీయ వాస్తవ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ప్రత్యర్థి ఎవరూ, తమ పార్టీ నుంచి ఎవరికి అభ్యర్థిత్వం ఇస్తే ఫలితాలెలా ఉంటాయనేది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాగా ఉత్తర ముంబై నుంచి ఎమ్మెల్యే ప్రవీణ్ దరేకర్, ఈశాన్య ముంబై, దక్షిణ ముంబై నుంచి రామ్ కదం, బాలానాంద్గావ్కర్ను పోటీ చేయాలని రాజ్ ఠాక్రే చెప్పనున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో సుమారు 16 నుంచి 18 స్థానాల్లో ఎమ్మెన్నెస్ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో అత్యధిక శాతం కొత్త వారికే ప్రాధాన్యత ఇవ్వాలని రాజ్ యోచిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ జాబితాయే తరువాయి.. నాగపూర్: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు గాను రాష్ట్రంలో బీజేపీ, ఎన్సీపీ, ఆప్ వంటి పార్టీలు విదర్భలో తమ అభ్యర్థుల పేర్లను ఇప్పటికే ప్రకటించినా కాంగ్రెస్ మాత్రం ఇంకా జాబితా విడుదలలో ఊగిసలాడుతోంది. ఈ రీజియన్‌లో ఉన్న 10 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించడం ద్వారా ఆయా పార్టీలు ప్రచారంలో ముందుకు దూసుకుపోతుండగా కాంగ్రెస్ కార్యకర్తల్లో మాత్రం నైరాశ్యం కనిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి ఈ ప్రాంతంలో ఇప్పటికే గుర్తింపు పొందిన నాయకులే అభ్యర్థులుగా ఉంటారనేది తెలిసిందే అయినా ఆ పార్టీ జాబితా విడుదల చేస్తేనే వారు ఎవరనేది స్పష్టమవుతుందని కార్యకర్తలు అంటున్నారు. ఇతర పార్టీల విషయానికి వస్తే.. బీజేపీ నుంచి ఆ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, ఎన్సీపీ నుంచి కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్ ఇప్పటికే మంచి గుర్తింపు ఉన్న వ్యక్తులు కాగా బీజేపీ నుంచి నవ్‌నీత్ కౌర్ రాణా (అమరావతి), కృష్ణారావు ఇంగిల్ (బుల్ధానా) పేర్లు వినిపించడం చాలామందికి ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా, గోండియా- భండారా నుంచి ఎన్సీపీ అభ్యర్థిగా పోటీచేయనున్న ప్రఫుల్ పాటిల్‌కు బీజేపీ అభ్యర్థి నానా పటోల్, ఆమ్ఆద్మీ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ మిశ్రా రూపంలో ప్రమాదం పొంచి ఉంది. నాగపూర్‌లో నితిన్ గడ్కరీకి సైతం విజయం అంత సులభం కాకపోవచ్చు. ఇక్కడ నుంచి గత ఏడు పర్యాయాలుగా ఎంపీగా కొనసాగుతున్న విలాస్ముత్తెంవార్తోపాటు ఆప్ అభ్యర్థి అంజలీ దమనియా నుంచి గట్టిపోటీ ఎదుర్కోక తప్పదు. శివసేనకు పెట్టనికోటగా ఉన్న బుల్ధానా నియోజకవర్గంలో పాగా వేసేందుకు కృష్ణారావు ఇంగిల్కు ఎన్సీపీ ఇక్కడ టికెట్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా చంద్రపూర్నుంచి ఆప్ అభ్యర్థిగా నిలబడుతున్న సమాజ సేవకుడు వామన్‌రావు చాతప్ విదర్భ ఉద్యమంలో భాగంగా నగరంలో గత ఏడాది నిర్వహించిన విదర్భ మాక్ అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా పాత్ర పోషించాడు. అలాగే ఆప్ అమరావతి అభ్యర్థిగా ప్రకటించిన భావ్నా వాస్నిక్ స్థానిక కళాశాలలో ప్రొఫెసర్గాపనిచేస్తున్నారు. -
అందరి దృష్టి రాజ్‌ఠాక్రే ప్రసంగంపైనే
సాక్షి ముంబై: వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రేపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇటీవల టోల్ చెల్లించొద్దని, ఎవరైనా సిబ్బంది ఒత్తిడి తీసుకొస్తే నిలువరించాలని ఆయన ఇచ్చిన పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెన్నెస్ పార్టీ కార్యకర్తలు టోల్‌ప్లాజాలపై దాడులకు దిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరుగుతున్న తొలిసభ కావడంతో ఏమి మాట్లాడతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆది వారం పుణేలో జరగనున్న బహిరంగ సభలో రాజ్‌ఠాక్రే ఎవరిని లక్ష్యంగా చేసుకొని ప్రసంగిస్తారనే విషయంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. త్వరలో లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలు ప్రచార ప్రక్రియకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా పుణేలో మహా రాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) ఆదివారం బహిరంగ సభ నిర్వహించనుంది. సభ నిర్వహణకు స్థలం పెద్ద సమస్యగా ఉండేది. శుక్రవారం వరకు స్థలం దొరక్క ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందా రు. ఎట్టకేలకు మైదానం లభించింది. నగరంలోని ఎస్పీ కళాశాల యాజమాన్యం కాలేజీ మైదానంలో సభ నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చింది. అంతకుముందు పెద్ద తతంగమే నడిచినట్లు సమాచారం. తొలుత సభ నిర్వహణకు కళాశాల యాజ మాన్యం అంగీకరించలేదు. దీంతో ప్రభుత్వంలోని కొందరు సీనియర్ అధికారులతోపాటు మంత్రులు కళాశాల యాజమాన్యంతో చర్చించి సభ నిర్వహణకు అనుమతి ఇప్పించినట్లు సమాచారం. ఆలస్యమైనా సభకు మంచి స్థలం లభించడంపై ఎమ్మెన్నెస్ కార్యకర్తల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అయితే రాజ్‌ఠాక్రే పుణే సభలో ఎలాంటి ప్రసంగం చేస్తారన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కార్యకర్తలు కూడా ఆయన ప్రసంగం కోసం వేచి చూస్తున్నారు. ఈ సారి రాజ్‌ఠాక్రే ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారోనని -
రాజ్‌ఠాక్రేపై కేసు
ముంబై: హింసను ప్రేరేపించేలా ప్రయత్నించిన మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) పార్టీ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రేపై పుణే రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. టోల్ రుసుం కట్టొద్దంటూ, బలవంతం చేస్తే వారిని ఎదురించాలంటూ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా రాజ్‌ఠాక్రే ప్రసగించడం, ఆ వెంటనే రాష్ట్రవ్యాప్తంగా టోల్‌ప్లాజాలపై దాడులు జరగడం చకచక జరిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర సర్కార్రాజ్ఠాక్రేపై చర్యలు తీసుకోవాలన్న ఆలోచనతో ఉంది. ఇప్పటికే సీఎం పృథ్వీరాజ్ చవాన్, హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ ఈ మేరకు సంకేతాలను కూడా ఇచ్చారు. టోల్ రుసుం కట్టని రాజ్‌ఠాక్రే: ముంబై నుంచిcకు వచ్చే రహదారుల్లో ఉన్న వాషి, ఉర్సే, తలేగావ్ టోల్‌ప్లాజాల వద్ద రాజ్‌ఠాక్రే టోల్‌రుసుం కట్టలేదు. అక్కడి టోల్ సిబ్బంది కొన్ని నిమిషాల పాటు ఆపినా తాను అన్నమాటకే రాజ్‌ఠాక్రే కట్డుబడ్డారు. టోల్ రుసుం కట్టకుండానే తన వాహనంలో పుణే చేరుకున్నారు. శుక్రవారం నుంచి ఇక్కడ జరగనున్న పార్టీ రాష్ట్రస్థాయి సదస్సులో నాయకులు, కార్యకర్తలనుద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ‘టోల్ ఎత్తివేత గుజరాత్లో చేసి చూపండి’: అధికారంలోకి వస్తే రాష్ట్రంలో టోల్ రుసుం ఎత్తివేస్తామని చెబుతున్న బీజేపీ, శివసేన కూటమి మొదటగా పొరుగు రాష్ట్రమైన గుజరాత్లో ఆ పని చేసి చూపించాలని ఎన్సీపీ పార్టీ సవాల్ విసిరింది. ఇంకా ఎన్నికల కోడ్ అమల్లోకి రాలేదని, ఆ లోపే గుజరాత్లో అమలు చేసి చూపించాలని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ గురువారం డిమాండ్ చేశారు. టోల్‌ప్లాజాలో జరుగుతున్న అక్రమాలపై కఠిన చర్యలు తీసుకునేలా తమ పార్టీ సర్కార్‌పై ఒత్తిడి తెస్తుందన్నారు. -
పొలిటి‘కలరింగ్’
సాక్షి, ముంబై: ‘గత అనేక సంవత్సరాల నుంచి టోల్ రుసుం వసూలు చేస్తున్నారు. ఇన్నాళ్లు పెద్దగా పట్టించుకొని రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) పార్టీ ఆకస్మాత్తుగా ఈ టోల్ ఏంటి బాబో అని మొత్తుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలను ఆకర్షించేందుకు రాజకీయ స్టంట్లు రాజ్‌ఠాక్రే ప్రారంభించార’ని స్వాభిమాన్ సంఘటన అధ్యక్షుడు నీలేష్ రాణే ఆరోపించారు. ఇన్నాళ్లు గప్‌చుప్‌గా ఉన్న రాజ్‌ఠాక్రే ఒక్కసారి పూనకమొచ్చినట్టు మాట్లాడి ఎమ్మెన్నెస్ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి టోల్‌ప్లాజాలపై దాడులకు దిగేట్లు చేయడాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. కేవలం 12 మంది ఎమ్మెల్యేలున్న పార్టీకి ఇలా చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ అంశాన్ని విధాన సభలో లేవనె త్తడానికి కూడా అవకాశముండేదని, అయితే ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇంత నాటకం ఆడాల్సిన అవసరమేమొచ్చిందని నీలేశ్ రాణే ప్రశ్నించారు. లోక్‌సత్తా డాట్‌కామ్‌కు పోస్టుల వెల్లువ... మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే ఇచ్చిన పిలుపు మేరకు కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా టోల్ ప్లాజాలపై దాడులకు దిగారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ కొందరు, తగిన శాస్తి చేశారని మెచ్చుకుంటూ మరికొందరు వెబ్సైట్లలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. దాడుల ఘటన తర్వాత లోక్‌సత్తా డాట్ కామ్‌లో మరాఠీలో అనేక మంది తమతమ అభిప్రాయలు వ్యక్తం చేశారు. లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజ్ ఇలా దూకుడుగా వ్యవహరించడం ఎన్నికల స్టంట్ అని కొంతమంది వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. మరికొందరు వాహనదారుల నుంచి అడ్డూ అదుపులేకుండా డబ్బులు వసూలు చేస్తున్న టోల్ ప్లాజాల ఆగడాలకు కళ్లెం వేయాలంటే ఇలాంటి రాజకీయ పార్టీలు అవసరమని, అందుకు ధన్యవాదాలంటూ మరికొంత మంది పోస్ట్ చేశారు. రోడ్ల నిర్వహణకు అయ్యే ఖర్చులు రాజ్‌ఠాక్రే సొంతంగా భరించి రాష్ట్ర ప్రజలకు టోల్ నుంచి విముక్తి కల్పించాలని, ముంబైలోని సేనా భవన్ ఎదురుగా నిర్మిస్తున్న టవర్‌ను ప్రజలకు ఉచితంగా వాడుకునేందుకు ఇవ్వాలని మరికొందరు రాశారు. ఎమ్మెన్నెస్ ఇలాంటి చిల్లర వేషాలు వేయడం మానుకోవాలని హితవు పలికారు. ‘అవినీతిలో కూరుకుపోయిన అధికార డీఎఫ్ కూటమి ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో టోల్‌ప్లాజాలను మూసివేయదు. ఈ ప్రభుత్వాలకు బుద్దిచెప్పాలంటే ఎమ్మెన్నెస్ లాంటి దూకుడు పార్టీలు ఉండాల్సిన అవసరం ఉంద’ని హేమంత్ అభిప్రాయపడ్డారు. ‘ఒక విధంగా ఇది మంచికే జరిగింది. టోల్ పేరుతో కోట్ల రూపాయలు వసూలుచేస్తున్న కాంట్రాక్టర్లు ఈ మొత్తాన్ని దేనికి వినియోగిస్తున్నారో లెక్కలు చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. చట్టం కేవలం కాంగ్రెస్ సొత్తు కాదని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేదా..?’ అని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘టోల్’ తీసిన ఎంఎన్ఎస్
టోల్ కట్టొద్దంటూ రాజ్ ఠాక్రే పిలుపు అడ్డొస్తే ఉతికి ఆరేయాలంటూ రెచ్చగొట్టిన అధినేత ఆ వెంటనే టోల్ ప్లాజాలపై కార్యకర్తల దండయాత్ర.. సాక్షి, ముంబై: ‘‘రాష్ట్రంలో ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లో టోల్ చెల్లించవద్దు.. ట్రాఫిక్ జామ్ అయినా ఫర్వాలేదు.. ఎవరైనా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే వారిని ఉతికి ఆరేయండి’’ అంటూ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి నవీ ముంబైలోని ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో రెచ్చిపోయిన కార్యకర్తలు తమ ప్రతాపాన్ని చూపించారు. ముంబై సహా థానే, కల్యాణ్, సాంగ్లీ, నాగపూర్ ప్రాంతాల్లోని టోల్ ప్లాజాలపై దాడులు చేశారు. సోమవారం తెల్లవారుజామువరకు దాడులు కొనసాగాయి. పోలీసు బలగాలను రంగంలోకి దింపడంతో సోమవారం ఉదయానికి పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ముంబై పక్కనే ఉన్న ఒక్క థానే జిల్లాలోనే అరడజను టోల్ బూత్‌లను, బారికేడ్లను ఎంఎన్ఎస్ శ్రేణులు ధ్వంసం చేశాయి. మరాఠ్వాడలోని పలు టోల్ ప్లాజాలపై దాడులు చేసి మూసివేయించాయి. దాడులకు పాల్పడిన కార్యకర్తలను, ఎంఎన్ఎస్ ఎమ్మెల్యేలైన ప్రవీణ్, షాలిని ఠాక్రే, విజయ్ ఘాడి, టోంబరే తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. శివసేన, బీజేపీ నాయకులు కూడా టోల్‌కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. కొల్హాపూర్ ఘటనతో మొదలు.. కొద్ది రోజుల కిందట ఎంఎన్ఎస్.. టోల్‌కు వ్యతిరేకంగా కొల్హాపూర్‌లో చేపట్టిన ఆందోళనకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఆ తరువాత శివసేన కూడా టోల్ వసూళ్లను వ్యతిరేకిస్తున్నామని ప్రైవేటు కంపెనీలను హెచ్చరించింది. మరోపక్క ఎన్నికలు సమీపించడంతో ఎక్కడ ఓటర్లు శివసేనవైపు ఆకర్షితులవుతారోనని ఎంఎన్ఎస్కు దిగులు పట్టుకుంది. ఈ నేపథ్యంలోనే రాజ్ ఠాక్రే కార్యకర్తలను ఉసిగొల్పారని భావిస్తున్నారు. ‘‘అసలు టోల్ ఎందుకు వసూలు చేస్తున్నారు? ఆ డబ్బును దేనికి వాడుతున్నారో వెల్లడించేంతవరకు డబ్బులు చెల్లించవద్దు. భాగస్వాములైన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు టోల్ రూపంలో ఏటా కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాయి. కానీ రోడ్ల దుస్థితి మాత్రం అలాగే ఉంది. కొద్ది పాటి వర్షం కురిసినా రహదారులన్నీ పూర్తిగా గుంతలమయమవుతున్నాయి. ఇలాంటి సమయంలో టోల్ డబ్బులు వసూలుచేసి ప్రయోజనమేంటి?’’ - రాజ్ ఠాక్రే -
టోల్ లేకపోతే రోడ్ల నిర్మాణం ఆగినట్టే :పృథ్వీరాజ్ చవాన్
ముంబై: టోల్ రుసుం వసూలు నిలిపివేస్తే కొత్త రోడ్ల నిర్మాణం నిలిచిపోతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అన్నారు. బిడ్డింగ్ విధానం, టోల్ నగదు లెక్కింపుల్లో అవినీతి చోటుచేసుకుంటోందన్న సీఎం రెగ్యులేటరీ ఆథారిటీని ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. టోల్ ప్రక్రియ పారదర్శకంగా లేదని, దీనిపై ప్రజలు కొంత అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమేని ఆదివారం సాయంత్రం మీడియాకు తెలిపారు. ఒకవేళ టోల్ పన్ను వసూలుచేయకపోతే హైవేలను నిర్మించడం సాధ్యం కాదని చెప్పారు. దీనికోసం రెగ్యులేటరీ ఆథారిటీని నెలకొల్పుతామని వివరించారు. నగర శివారుల్లో ప్రవేశ ద్వారాల వద్ద టోల్ రుసుం కట్టేందుకు కొల్హాపూర్ వాసులు నిరాకరిస్తుండటంపై ఆయన స్పందించారు. ఒప్పందం ప్రకారం టోల్ రుసుం వసూళ్లలో కంపెనీకి ఇబ్బందులు ఏర్పడితే ప్రభుత్వం ఆ నష్టపరిహారాన్ని చెల్లిస్తుందన్నారు. అయితే ప్రస్తుతం సర్కార్ వద్ద డబ్బు లేదని వివరించారు. టోల్రుసుంను చెల్లించవద్దంటూ మహారాష్ట్ర నవనిర్మా సేన అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే ఆదేశాల మేరకు ఆ పార్టీకి చెందిన కొంత మంది కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లోని టోల్‌నాకాల వద్ద సోమవారం హాల్చల్ సృష్టించారు. ధ్వంసం చేశారు. ‘రాజ్‌ఠాక్రేపై చర్యలు తీసుకోండి’ సాక్షి, ముంబై: టోల్ వసూళ్లపై ఎమ్మెన్నెస్ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగించిన ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాక్రేపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే డిమాండ్ చేశారు. టోల్ చెల్లించకండి, డబ్బులు అడిగినవారిని ఉతికి ఆరే యండని రాజ్ రెచ్చగొట్టేలా మాట్లాడటం వల్ల సోమవారం వివిధ ప్రాంతాల్లో వారి పార్టీ కార్యకర్తలు దాడులకు దిగారని అన్నారు. రాష్ట్రంలో శాంతి, భద్రతలకు భంగం వాటిల్లేలా వ్యవహరించిన రాజ్‌పై చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు. టోల్‌ప్లాజాలను ఎత్తేయండి: శివసేన, బీజేపీ షోలాపూర్, న్యూస్‌లైన్: రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శివసేన, బీజేపీ సోమవారం ఆందోళనకు దిగాయి. అక్కల్కోట్ రహదారిపై ఉన్న టోల్‌నాకా వద్ద కాషాయకూటమి నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో గుమిగూడారు. దీంతో ముందుజాగ్రత్త చర్యగా పోలీసు బలగాలను పెద్ద మొత్తంలో మోహరించారు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న టోల్‌నాకా సిబ్బంది ఉదయం నుంచి కౌంటర్లను మూసివేశారు. దీంతో ఆస్తులకు నష్టం వాటిల్లలేదు. అయితే ఇరుపార్టీల నాయకులు టోల్ ఎత్తివేయాలని డిమాండ్‌చేశారు. ఆ తర్వాత కొంతసేపటికి ఆందోళన విరమించారు. బీజేపీ ఎమ్మెల్యేలు విజయ్ దేశ్‌ముఖ్, సిద్రామప్ప పాటిల్, శివసేనకు చెందిన ప్రతాప్ చవాన్, విష్ణు కారంపూరి తదితరులు పాల్గొన్నారు. ఈ ఆందోళనలో ఎమ్మెన్నెస్ కార్యకర్తలు పాల్గొనలేదు. ఆందోళనకారులు వెళ్లిపోయిన తర్వాత మళ్లీ టోల్ వసూళ్లు యథాతధంగా కొనసాగించారు. -
రాజ్‌పై బీజేపీ కన్నెర్ర
నాసిక్: వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధిపతి రాజ్‌ఠాక్రే నాసిక్‌లో శనివారం నిర్వహించిన భూమిపూజను బీజేపీ బహిష్కరించింది. నాసిక్‌లో 2015లో నిర్వహించే కుంభమేళా కోసం చేపట్టిన రోడ్డు నిర్మాణం/వెడల్పు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నాసిక్ మేయర్ యతిన్ వాఘ్, ఎమ్మెన్నెస్ శాసనసబ్యులు వసంత్ గిటే, ఉత్తమ్ ధిక్లే, నితిన్ భోసాలే, పార్టీ కార్పొరేటర్లు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఎమ్మెన్నెస్ బీజేపీ కూటమి నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్ఎంసీ) అధికార ంలో ఉంది. గుజరాత్ ముఖ్యమంత్రి, తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీని రాజ్ తీవ్రంగా విమర్శించడంతో స్థానిక బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. నాసిక్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజ్ మాట్లాడుతూ ‘బీజేపీ తన పార్టీ ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించగానే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసుంటే బాగుండేది. ప్రధాని అభ్యర్థిగా మారిన తరువాత ఆయన కేవలం గుజరాత్‌కే పరిమితం కాకుండా యావత్ దేశ హితవు గురించి ఆలోచించాలి. ప్రధాని అంటే దేశ హితవు గురించి ఆలోచించాలి. కేవలం తన రాష్ట్రానికే పరిమితం కాకూడదు. ఇటీవల ముంబైలో సభ నిర్వహించిన మోడీ గుజరాత్ ప్రజల గొప్పదనం, సర్దార్ వల్లబాయి పటేల్ త్యాగాలను కొనియాడుతూ ప్రసంగించారు. మరి ఛత్రపతి శివాజీ ప్రాధాన్యం గురించి ఎందుకు మాట్లాడలేదు ?’ అని అన్నారు. రాజ్ విమర్శలపై బీజేపీ నాసిక్ విభాగం అధ్యక్షుడు లక్ష్మణ్ సవాజీ మాట్లాడుతూ ‘ఏకపక్ష నిర్ణయాలు, విమర్శలతో ఇబ్బందిపెడుతున్న ఎమ్మెన్నెస్‌కు మద్దతు ఉపసంహరించుకోవాలని కోరుతూ మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్‌కు ప్రతిపాదన పంపించాం. నాసిక్ కార్పొరేషన్‌లోనూ ఎమ్మెన్నెస్ ఎవరినీ సంప్రదించకుం డానే నిర్ణయాలు తీసుకుంటోంది. అభివృద్ధి ప్రాజెక్టుల విషయాల్లో అది మా అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. అందుకే భూమి పూజను బహిష్కరించాం’ అని సవాజీ వివరించారు. -
లోక్‌సభ ఎన్నికలపై ఎమ్మెన్నెస్ దృష్టి
సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికలకు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇటీవల రాజ్‌ఠాక్రే నివాసం కృష్ణకుంజ్లో ఎమ్మెన్నెస్ నాయకులతో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. లోక్‌సభ ఎన్నికల్లో మహాకూటమితో చేతులు కలపాలా?, ఒంటరిగా పోటీ చేయాలా అనే అంశంపై కూడా చర్చలు జరిగినట్టు సమాచారం. అయితే ఒంటరిగానే బరిలోకి దిగేందుకు అధిక మంది నేతలు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో 48 లోక్‌సభ సీట్లున్నాయి. బీజేపీ 26, శివసేన కోటాలో ఉన్న 22 సీట్లలో నుంచి ఆర్పీఐ పార్టీకి కొన్ని సీట్లు కేటాయించనుంది. ఈ పరిస్థితుల్లో ఎమ్మెన్నెస్ మహకూటమిలోకి చేరితే ఎమ్మెన్నెస్‌కు సీట్లు చాలా తక్కువగా లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, రాజ్ ఠాక్రే మధ్య ఉన్న స్నేహసంబంధాన్ని దృష్టిలో ఉంచుకుని పలు విధాల చర్చించినట్టు తెలిసింది. అయితే ఒంటరిగా పోటీ చేసేందుకే అందరు మొగ్గు చూపారు. కొన్ని స్థానాల్లో మాత్రం వారితో సమన్వయం చేసుకుని పోటీ చేయాలని ఎమ్మెన్నెస్ నాయకులు సూచించారు. ఈ సమావేశంలో బాలానందగావ్కర్, ప్రవీణ్ దరేకర్, నితిన్ సర్దేశాయి, శిశీర్ శిందే తదితర ప్రముఖులతోపాటు రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల నుంచి నాయకులు పాల్గొన్నారు. అనంతరం బాలానందగావ్కర్ మీడియాతో మాట్లాడుతూ అన్ని విషయాలపై రాజ్‌ఠాక్రే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అందరి దృష్టి రాజ్ ఠాక్రే వైపు... రాబోయే లోక్‌సభతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ ఒంటరిగా పోటీ చేస్తుందా? లేకపోతే మరెవరితోనైనా జతకడుతుందా? అన్న అంశంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ విషయంలో ఆ పార్టీ అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ కీలకపాత్ర పోషించనుందని వస్తున్న వార్తల నేపథ్యంలో రాజ్ ఎటువైపు అడుగులు వేస్తారోనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే ఆ పార్టీ నాయకులతో రాజ్‌ఠాక్రే సమావేశమవడం, భవిష్యత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడం చకచక జరిగిపోయాయి. అయితే మహాకూటమిలో చేరతామా? లేదా ఒంటరిగా పోటీ చేస్తుందా? అన్న దానిపై రాజ్‌ఠాక్రే స్పష్టత ఇవ్వలేదు. దీంతో రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎలా ఉండనున్నాయనే దానిపై అందరిలో ఉత్కంఠత కన్పిస్తోంది. చివరి వరకు బీజేపీ ప్రయత్నం... మహాకూటమిలో ఎమ్మెన్నెస్‌ను చేర్చుకునేందుకు బీజేపీ చివరివరకు ప్రయత్నించనున్నట్టు తెలుస్తోంది. ఈసారి ఎలాగైనా కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. దీంతో రాష్ట్రంలో అధిక స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంతో పావులు కదుపుతోంది. ఇటీవలే మిత్రపక్షమైన శివసేన, ఆర్పీఐలు లేకుండానే ఒంటరిగా ముంబైలో మహాగర్జన పేరుతో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు విశేష స్పందన లభించిన విషయం విదితమే. దీంతోపాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పర్యటిస్తున్న నరేంద్ర మోడీకి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెన్నెస్‌ను కూడా చేర్చుకుంటే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మంచి ఫలితాలుంటాయని బీజేపీ భావిస్తోంది. అయితే శివసేన మాత్రం ఎమ్మెన్నెస్ విషయంలో సుముఖంగా కన్పించడం లేదు. గతంలో శివసేన ఒక అడుగు ముందుకు వేసినా, అనంతరం జరిగిన పరిణామాల వల్ల వెనక్కి తగ్గింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెన్నెస్ చేర్చుకునే ప్రసక్తేలేదని శివసేన నేత సంజయ్ రావుత్ అన్నారు. అయినా బీజేపీ మాత్రం ఇంకా ఎమ్మెన్నెస్‌ను చేర్చుకోవడంపై చివరి వరకు ప్రయత్నించాలని భావిస్తోంది. -
23న ఒకే వేదికపై రాజ్, అమితాబ్ !
సాక్షి, ముంబై: బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేలిద్దరూ సోమవారం ఒకే వేదికపై దర్శనమివ్వనున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా వీరి మధ్య నెలకొన్న వివాదాలకు తెరపడి సయోధ్య కుదిరిందని భావిస్తున్నారు. 2008లో జరిగిన ఓ కార్యక్రమంలో అమితాబ్ సతీమణి, బాలీవుడ్ నటి అయిన జయా బచ్చన్ మాట్లాడుతూ ‘నాది యూపీ.. నేను హిందీలోనే మాట్లాడతానని’ ప్రకటించింది. ఆమె వ్యాఖ్యల అనంతరం మరాఠీ ప్రజలకోసం పోరాడుతున్న రాజ్ ఠాక్రే, బచ్చన్ కుటుంబీకుల మధ్య వివాదాలు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో జయా బచ్చన్ తరఫున అమితాబ్ క్షమాపణ కూడా చెప్పారు. అయినప్పటికీ ఆ సంఘటన అనంతరం రాజ్, అమితాబ్‌ల మధ్య దూరం ఏర్పడింది. అయితే తాజాగా సోమవారం జరగనున్న ఓ కార్యక్రమం కోసం ఎమ్మెన్నెస్ తరఫున అమితాబ్‌కు స్వాగత పోస్టర్లు ఏర్పాటు చేశారు. ‘ఎమ్మెన్నెస్ చిత్రపట్ (చలనచిత్ర) సేన’ ఆధ్వర్యంలో చలనచిత్ర పరిశ్రమ 100 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మాటుంగా షణ్ముఖానంద్ హాల్లో సోమవారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమితాబ్ బచ్చన్ హాజరుకానున్నారు. మరోవైపు ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అంతకుముందు వీరిద్దరూ 2008లో జరిగిన శివసేన అధినేత బాల్ ఠాక్రే ఫొటో బయోగ్రఫీ విడుదల కార్యక్రమంలో కలసి పాల్గొన్న విషయం తెలిసిందే.