సాక్షి ముంబై: వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రేపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇటీవల టోల్ చెల్లించొద్దని, ఎవరైనా సిబ్బంది ఒత్తిడి తీసుకొస్తే నిలువరించాలని ఆయన ఇచ్చిన పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెన్నెస్ పార్టీ కార్యకర్తలు టోల్‌ప్లాజాలపై దాడులకు దిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరుగుతున్న తొలిసభ కావడంతో ఏమి మాట్లాడతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆది వారం పుణేలో జరగనున్న బహిరంగ సభలో రాజ్‌ఠాక్రే ఎవరిని లక్ష్యంగా చేసుకొని ప్రసంగిస్తారనే విషయంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
త్వరలో లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలు ప్రచార ప్రక్రియకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా పుణేలో మహా రాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) ఆదివారం బహిరంగ సభ నిర్వహించనుంది. సభ నిర్వహణకు స్థలం పెద్ద సమస్యగా ఉండేది. శుక్రవారం వరకు స్థలం దొరక్క ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందా రు. ఎట్టకేలకు మైదానం లభించింది. నగరంలోని ఎస్‌పీ కళాశాల యాజమాన్యం కాలేజీ మైదానంలో సభ నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చింది.
అంతకుముందు పెద్ద తతంగమే నడిచినట్లు సమాచారం. తొలుత సభ నిర్వహణకు కళాశాల యాజ మాన్యం అంగీకరించలేదు. దీంతో ప్రభుత్వంలోని కొందరు సీనియర్ అధికారులతోపాటు మంత్రులు కళాశాల యాజమాన్యంతో చర్చించి సభ నిర్వహణకు అనుమతి ఇప్పించినట్లు సమాచారం. ఆలస్యమైనా సభకు మంచి స్థలం లభించడంపై ఎమ్మెన్నెస్ కార్యకర్తల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అయితే రాజ్‌ఠాక్రే పుణే సభలో ఎలాంటి ప్రసంగం చేస్తారన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కార్యకర్తలు కూడా ఆయన ప్రసంగం కోసం వేచి చూస్తున్నారు. ఈ సారి రాజ్‌ఠాక్రే ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారోనని
అందరి దృష్టి రాజ్‌ఠాక్రే ప్రసంగంపైనే
Published Sat, Feb 8 2014 11:45 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement