ముంబై: హింసను ప్రేరేపించేలా ప్రయత్నించిన మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) పార్టీ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రేపై పుణే రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. టోల్ రుసుం కట్టొద్దంటూ, బలవంతం చేస్తే వారిని ఎదురించాలంటూ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా రాజ్‌ఠాక్రే ప్రసగించడం, ఆ వెంటనే రాష్ట్రవ్యాప్తంగా టోల్‌ప్లాజాలపై దాడులు జరగడం చకచక జరిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర సర్కార్‌రాజ్‌ఠాక్రేపై చర్యలు తీసుకోవాలన్న ఆలోచనతో ఉంది. ఇప్పటికే సీఎం పృథ్వీరాజ్ చవాన్, హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ ఈ మేరకు సంకేతాలను కూడా ఇచ్చారు.
టోల్ రుసుం కట్టని రాజ్‌ఠాక్రే: ముంబై నుంచిcకు వచ్చే రహదారుల్లో ఉన్న వాషి, ఉర్సే, తలేగావ్ టోల్‌ప్లాజాల వద్ద రాజ్‌ఠాక్రే టోల్‌రుసుం కట్టలేదు. అక్కడి టోల్ సిబ్బంది కొన్ని నిమిషాల పాటు ఆపినా తాను అన్నమాటకే రాజ్‌ఠాక్రే కట్డుబడ్డారు. టోల్ రుసుం కట్టకుండానే తన వాహనంలో పుణే చేరుకున్నారు. శుక్రవారం నుంచి ఇక్కడ జరగనున్న పార్టీ రాష్ట్రస్థాయి సదస్సులో నాయకులు, కార్యకర్తలనుద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.
‘టోల్ ఎత్తివేత గుజరాత్‌లో చేసి చూపండి’: అధికారంలోకి వస్తే రాష్ట్రంలో టోల్ రుసుం ఎత్తివేస్తామని చెబుతున్న బీజేపీ, శివసేన కూటమి మొదటగా పొరుగు రాష్ట్రమైన గుజరాత్‌లో ఆ పని చేసి చూపించాలని ఎన్సీపీ పార్టీ సవాల్ విసిరింది. ఇంకా ఎన్నికల కోడ్ అమల్లోకి రాలేదని, ఆ లోపే గుజరాత్‌లో అమలు చేసి చూపించాలని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ గురువారం డిమాండ్ చేశారు. టోల్‌ప్లాజాలో జరుగుతున్న అక్రమాలపై కఠిన చర్యలు తీసుకునేలా తమ పార్టీ సర్కార్‌పై ఒత్తిడి తెస్తుందన్నారు.
రాజ్‌ఠాక్రేపై కేసు
Published Fri, Jan 31 2014 5:43 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM
Advertisement
Advertisement