రాజ్‌పై బీజేపీ కన్నెర్ర | BJP serious on raj thakre | Sakshi
Sakshi News home page

రాజ్‌పై బీజేపీ కన్నెర్ర

Published Sat, Jan 11 2014 11:29 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

BJP serious on raj thakre

నాసిక్: వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధిపతి రాజ్‌ఠాక్రే నాసిక్‌లో శనివారం నిర్వహించిన భూమిపూజను బీజేపీ బహిష్కరించింది. నాసిక్‌లో 2015లో నిర్వహించే కుంభమేళా కోసం చేపట్టిన రోడ్డు నిర్మాణం/వెడల్పు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నాసిక్ మేయర్ యతిన్ వాఘ్, ఎమ్మెన్నెస్ శాసనసబ్యులు వసంత్ గిటే, ఉత్తమ్ ధిక్లే, నితిన్ భోసాలే, పార్టీ కార్పొరేటర్లు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఎమ్మెన్నెస్ బీజేపీ కూటమి నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌ఎంసీ) అధికార ంలో ఉంది. గుజరాత్ ముఖ్యమంత్రి, తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీని రాజ్ తీవ్రంగా విమర్శించడంతో స్థానిక బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది.

నాసిక్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజ్ మాట్లాడుతూ ‘బీజేపీ తన పార్టీ ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించగానే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసుంటే బాగుండేది. ప్రధాని అభ్యర్థిగా మారిన తరువాత ఆయన కేవలం గుజరాత్‌కే పరిమితం కాకుండా యావత్ దేశ హితవు గురించి ఆలోచించాలి. ప్రధాని అంటే దేశ హితవు గురించి ఆలోచించాలి. కేవలం తన రాష్ట్రానికే పరిమితం కాకూడదు. ఇటీవల ముంబైలో సభ నిర్వహించిన మోడీ గుజరాత్ ప్రజల గొప్పదనం, సర్దార్ వల్లబాయి పటేల్ త్యాగాలను కొనియాడుతూ ప్రసంగించారు.

మరి ఛత్రపతి శివాజీ ప్రాధాన్యం గురించి ఎందుకు మాట్లాడలేదు ?’ అని అన్నారు. రాజ్ విమర్శలపై బీజేపీ నాసిక్ విభాగం అధ్యక్షుడు లక్ష్మణ్ సవాజీ మాట్లాడుతూ ‘ఏకపక్ష నిర్ణయాలు, విమర్శలతో ఇబ్బందిపెడుతున్న ఎమ్మెన్నెస్‌కు మద్దతు ఉపసంహరించుకోవాలని కోరుతూ మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్‌కు ప్రతిపాదన పంపించాం. నాసిక్ కార్పొరేషన్‌లోనూ ఎమ్మెన్నెస్ ఎవరినీ సంప్రదించకుం డానే నిర్ణయాలు తీసుకుంటోంది. అభివృద్ధి ప్రాజెక్టుల విషయాల్లో అది మా అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. అందుకే భూమి పూజను బహిష్కరించాం’ అని సవాజీ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement