పట్టణ మౌలిక రంగ పురోగతిపై దృష్టి: ఏఐఐబీ సదస్సులో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
గాందీనగర్: ఆర్థిక నేరాలు, మనీలాండరింగ్, క్రిప్టో కరెన్సీలతో సహా వివిధ అసెట్ క్లాస్‌ల గురించి సమాచారాన్ని పంచుకోవడం, ఆయా సవాళ్లను నిరోధించడం కోసం గ్లోబల్ ఆర్కిటెక్చర్‌ను మరింత బలోపేతం చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ఇందుకు అనుగుణంగా చట్ట అమలు సామర్థ్యం పెరగాలని ఉద్ఘాటించారు. పన్ను ఎగవేతలు, అవినీతి, అక్రమ ధనార్జన నిరోధంపై ఇక్కడ జరిగిన జీ20 అత్యున్నత స్థాయి సమావేశంలో ఆమె ప్రసంగించారు. జీ20 ప్రెసిడెన్సీ కింద, ఓఈసీడీ సహకారంతో దక్షిణాసియా ప్రాంతంలో పన్ను, ఆర్థిక నేర పరిశోధనలో సామర్థ్యాన్ని పెంపొందించడంలో భారతదేశం ముందుందని సీతారామన్ అన్నారు.
కీలక భేటీలు..
ఇండోనేíÙయా ఆర్థిక మంత్రి శ్రీ ముల్యాని ఇంద్రావతి, కెనడా డిప్యూటీ ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్‌లతో కూడా ఆమె ఈ సందర్భంగా సమావేశమై, ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య అంశాలపై చర్చించారు. 3వ జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం సందర్భంగా ఆసియాన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ)ప్రెసిడెంట్ జిన్ లిక్వెన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశం నిర్వహించారు. జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల భేటీలో పాల్గొనడానికిగాను అమెరికా ఆర్థికమంత్రి జానెత్ యెల్లెన్, ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా తదితరులు కూడా గాంధీనగర్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు ఇరువురూ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫెసిలిటీని సందర్శించారు.
పట్టణ మౌలిక రంగంపై పెట్టుబడులు
కాగా, జీ20 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్‌పై జరిగిన మరో కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక రంగం అభివృద్ధికి ప్రైవేటు పె ట్టుబడులను ఆకర్షించడం అవసరమని పేర్కొన్నా రు. అభివృద్ధి చెందుతున్న పలుదేశాల్లో కఠిన ద్రవ్య విధానాలు అవలంభిస్తున్న నేపథ్యంలో పట్టణాభివృద్ధి కీలక సవాలుగా మారిందని కూడా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment