మానవ అక్రమ రవాణా కేసులో ఇటీవల అరెస్ట్‌యిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి బెయిల్ మంజూరైంది. సికింద్రాబాద్ కోర్టు ఆయనకు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న ఆయన నేడు సాయంత్రం విడుదలైయే అవకాశం ఉంది. 2004లో నకిలీ పత్రాలు, పాస్‌పోర్ట్‌తో మానవ అక్రమ రవాణా చేసిన కేసులో అరెస్ట్అయిన జగ్గారెడ్డిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎనిమిది సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.