జగ్గారెడ్డికి బెయిల్‌ ..! | Congress Leader Jagga Reddy Grants Bail | Sakshi
Sakshi News home page

జగ్గారెడ్డికి బెయిల్‌ మంజూరు..!

Published Mon, Sep 24 2018 2:03 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress Leader Jagga Reddy Grants Bail - Sakshi

జగ్గారెడ్డి (ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌ : మానవ అక్రమ రవాణా కేసులో ఇటీవల అరెస్ట్‌యిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి బెయిల్‌ మంజూరైంది. సికింద్రాబాద్‌ కోర్టు ఆయనకు సోమవారం బెయిల్‌ మంజూరు చేసింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న ఆయన నేడు సాయంత్రం విడుదలైయే అవకాశం ఉంది. 2004లో నకిలీ పత్రాలు, పాస్‌పోర్ట్‌తో మానవ అక్రమ రవాణా చేసిన కేసులో అరెస్ట్అయిన జగ్గారెడ్డిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎనిమిది సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జగ్గారెడ్డి అరెస్ట్‌ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయనకు ఒకవేళ బెయిల్‌ రాకపోయినట్లయితే చివరకి మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు, ఆయన సతీమని నిర్మలను పార్టీ అభ్యర్థిగా ప్రకటించాలని కూడా అధిష్టానం చర్చించింది. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డికి బెయిల్‌ రావడంతో ఆయన అభ్యర్థిత్వంపై కాంగ్రెస్‌ ఏవిధంగా నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తిగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement