
న్యూఢిల్లీ: కేసులో విచారణ ప్రారంభించకుండా నిందితుడిని కస్టడీలో సుదీర్ఘకాలం ఎలా కొనసాగిస్తారని ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేయడం నిందితుడి స్వేచ్ఛను హరించడమే అవుతుందని తేలి్చచెప్పింది. అనుబంధ చార్జిïÙట్లు దాఖలు చేస్తూ నిందితులకు డిఫాల్ట్ బెయిల్ లభించకుండా చేయడం సమంజసం కాదని పేర్కొంది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అనుచరుడైన ప్రేమ్ ప్రకాశ్ నివాసంలో 2022 ఆగస్టులో ఈడీ సోదాలు చేసింది.
రెండు ఏకే–47 తుపాకులు, 60 బల్లెట్లు లభించాయి. దీంతో అతడిపై ఆయుధాల చట్టంతోపాటు మనీ లాండరింగ్ నేరం కింద ఈడీ కేసులు నమోదు చేసింది. అప్పటి నుంచి నిందితుడి ఈడీ కస్టడీలోనే ఉంటున్నాడు. అతడికి బెయిల్ లభించకుండా ఈడీ ఇప్పటిదాకా కోర్టులో నాలుగు అనుబంధ చార్జిïÙట్లు దాఖలు చేసింది. తనకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ ప్రేమ్‌ప్రకాశ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. డిఫాల్ట్ బెయిల్ పొందడం నిందితుడి హక్కు అని స్పష్టం చేసింది. అతడిని ఎందుకు కస్టడీలో కొనసాగిస్తున్నారనో చెప్పాలని ఈడీని ప్రశ్నించింది. విచారణను ఏప్రిల్ 29కు వాయిదా వేసింది.
సుప్రీంకోర్టు ధర్మాసనం స్పషీ్టకరణ