![Judicial Remand Extended For Rhea Chakraborty - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/23/Rhea.jpg.webp?itok=Lk240VZJ)
ముంబై: నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి ఇరువురూ బాంబే హైకోర్టులో మంగళవారం బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. వీరి బెయిలు విచారణ బుధవారం జస్టిస్ సారంగ్ కొత్వాల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుందని వారి తరఫు న్యాయవాది సతీష్ మనేషిండే తెలిపారు. సెప్టెంబర్ 9న రియాచక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసింది. రియా చక్రవర్తి తాను ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్న వ్యక్తులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ, ఆ రోజు వీరు పెట్టుకున్న బెయిలు పిటిషన్లను స్పెషల్ ఎన్‌డీపీఎస్ కోర్టు తిరస్కరించింది. స్పెషల్ కోర్టు వీరి జ్యూడీషియల్ రిమాండ్‌ని అక్టోబర్ 6 వరకు మరో పద్నాలుగు రోజులు పొడిగించింది. శామ్యూల్ మిరాండాతో సహా రియా సోదరుడు షోవిక్ చక్రవర్తిని ఎన్‌సీబీ సెప్టెంబర్ 5న అరెస్టు చేసింది. వీరి బెయిలు పిటిషన్లను సైతం ప్రత్యేక కోర్టు సెప్టెంబర్ 11న తిరస్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment