ముంబై: విద్వేషపూరిత ప్రసంగంతో సంబంధముందనే ఆరోపణలతో ఎంఐఎం నేత, తెలంగాణ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి కుర్లా సబర్బన్ మెజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. సమన్లను ఆయనకు అందించాలని కుర్లా పోలీసులను ఆదేశించింది. గతంలో ఇచ్చిన సమన్లు అందిచడంలో హైదరాబాద్ పోలీసులు విఫలమయ్యారని పిటిషనర్ గుల్హమ్ హుస్సేన్ ఖాన్ తెలపడంతో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. 2012లో మత సామరస్యాన్ని బలహీనపర్చేలా అక్బరుద్దీన్ ప్రసంగించారని 2013లో కేసు వేశారు. ఈ ప్రసంగం ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. మహారాష్ట్ర పోలీసులు, హోం మంత్రిత్వ శాఖ తన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవడానికి నిరాకరించినట్లు హుస్సేన్ కోర్టుకు నివేదించారు.
అక్బరుద్దీన్‌కు సమన్లు జారీ చేసిన ముంబై కోర్టు
Published Sun, Feb 8 2015 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM
Advertisement
Advertisement