
Raj Kundra Got Bail: పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త, శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 50వేల రూపాయల పూచీకత్తుపై కోర్టు సోమవారం రాజ్‌కుంద్రాకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కుంద్రాతో పాటు ఆయన దగ్గర ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న ర్యాన్ థోర్పేకి సైతం బెయిల్ మంజూరు అయ్యింది. చదవండి: 'నేను చాలా బిజీ.. నా భర్త ఏం చేస్తుండేవాడో నాకు తెలియదు'
కాగా అశ్లీల చిత్రాల కేసులో జులై19న రాజ్‌కుంద్రాను ముంబై క్రైం బ్రాం పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. నటనపై ఆసక్తితో వచ్చిన వారిని బెదిరించి అశ్లీల చిత్రాలను తీసి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో విడుదల చేసేవాడని రాజ్ కుంద్రాపై ఆరోపణలు. ఇటీవలె శిల్పాశెట్టి స్టేట్‌మెంట్‌ను కూడా పోలీసులు రికార్డు చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రెండు నెలల తర్వాత రాజ్‌కుంద్రాకు బెయిల్ వచ్చింది.
చదవండి : దర్శనానికి గుర్రంపై వచ్చిన శిల్పాశెట్టి.. ఫోటోలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment