నీలిచిత్రాల కేసు.. దేశం వదిలి వెళ్లిపోదామనుకున్న శిల్పా శెట్టి! | Raj Kundra Reveals That Shilpa Shetty Suggested They Should Leave India And Settle In Abroad, Deets Inside - Sakshi
Sakshi News home page

Raj Kundra: జీవితానికి ముగింపు పలకాలనుకున్నా.. శిల్పా శెట్టి దేశం వదిలేసి పోదామంది

Published Wed, Oct 25 2023 5:01 PM | Last Updated on Wed, Oct 25 2023 7:09 PM

Raj Kundra Reveals Shilpa Shetty Suggested They Should Leave India - Sakshi

బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. 2021లో నీలి చిత్రాల కేసులో కొంతకాలం పాటు జైలు శిక్ష అనుభవించిన అతడు తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి మీడియాకు తన ముఖం చూపించడానికి కూడా ఇష్టపడలేదు. ఇటీవలే తన జీవిత కథ ఆధారంగా యూటీ 69 అనే బయోపిక్‌ తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించాడు. ఇందులో రాజ్‌ కుంద్రాయే ప్రధాన పాత్రలో నటించాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో తన జైలు జీవితం గురించి చెప్పుకొచ్చాడు.

వారానికి ఒకసారి ఫోన్‌ కాల్‌..
రాజ్‌ కుంద్రా మాట్లాడుతూ.. 'జైల్లో ఉన్నప్పుడు వారానికి ఒకసారే ఫోన్‌ మాట్లాడనిచ్చేవాళ్లు. అది కూడా కొద్ది నిమిషాలే! అందుకే శిల్పా, నేను ఒకరికి ఒకరం ఉత్తరాలు రాసుకునేవాళ్లం. ఆమె రాసే ఉత్తరాలు చదువుకుని బయట ఏం జరుగుతుందో తెలుసుకునేవాడిని. శిల్పాకు నా గురించి బాగా తెలుసు. నేను నా బిజినెస్‌లో, నా జీవితంలో ఎంత నిజాయితీగా ఉండేవాడిని, ఎలాంటి విధివిధానాలు పాటిస్తానో అన్నీ తెలుసు. అందుకే, నాకెంతో సపోర్ట్‌ చేసింది.  జైల్లో ఉన్న సమయంలో తను మొదటి సారి ఫోన్‌ చేసి ఏమందంటే.. రాజ్‌.. ఇప్పుడు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మనం ఏ నిర్ణయమైనా ఆచితూచి తీసుకోవాలి. నా మీద నమ్మకముంచు అని చెప్పింది. ఆమె మాటలు విన్నాకే జీవితాన్ని కొనసాగించాలనుకున్నాను.

అవమానభారంతో కుంగిపోయా..
నిజానికి నేను కుంగిపోయి ఉన్నాను. జైలు లోపలే నా జీవితం ముగించేయాలనుకున్నాను. ఎందుకంటే అప్పటికే నా పేరుప్రతిష్టలు దెబ్బతిన్నాయి. ఎంతో అవమానంగా ఉంది. నా వల్ల మీడియా నా భార్యాపిల్లలు, తల్లిదండ్రుల వెంటపడుతూనే ఉంటుంది. అదంతా ఆలోచిస్తేనే చాలా భయమేసింది, బాధేసింది. బయట ఏం జరుగుతుందనేది నేను అంచనా వేయగలను. కానీ అంతకు మించి ఏమీ చేయలేను. జీవితంలో ఇది నాకు సంక్లిష్ట సమయం. నిజమేంటనేది నాకు తెలుసు, అది ఏదో ఒక రోజు బయటకు రాక తప్పదు అని నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను.

దేశం వదిలేసి వెళ్లిపోదామంది
నా భార్య అయితే దేశం వదిలేసి వెళ్లిపోదామంది. నువ్వు లండన్‌లో పుట్టి పెరిగావు. అక్కడంతా వదిలేసి నాకోసం ఇండియా వచ్చావు, ఇక్కడే సెటిలయ్యావు. విదేశాల్లో ఉండాలనుందంటే చెప్పు.. అక్కడికే వెళ్లిపోదాం అని అడిగింది. కానీ నాకు భారత్‌ అంటే ఇష్టమని, ఈ దేశాన్ని వదిలేయలేనని చెప్పాను. వేలకోట్ల స్కామ్‌లు చేసి తప్పు చేసిన వారు దేశం విడిచి వెళ్తారు. నేనే తప్పూ చేయలేదు, నేను ఎక్కడికీ వెళ్లనని చెప్పాను' అని తెలిపాడు రాజ్‌ కుంద్రా.

చదవండి: ఒకప్పుడు క్రేజీ హీరోయిన్‌.. తర్వాత భిక్షగత్తెగా మారి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement