అలా చెప్పగానే నా భార్య నాపైకి చెప్పు విసిరింది: శిల్పా శెట్టి భర్త | Raj Kundra: Shilpa Shetty Threw her Chappal On Me | Sakshi
Sakshi News home page

ఆరోజు నా భార్య నా మీదకు చెప్పు విసిరింది.. శిల్పా శెట్టి భర్త ఎమోషనల్‌

Published Thu, Oct 19 2023 3:38 PM | Last Updated on Thu, Oct 19 2023 3:57 PM

Raj Kundra: Shilpa Shetty Threw her Chappal On Me - Sakshi

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రా చాలాకాలంగా తన ముఖాన్ని జనాలకు చూపించకుండా జాగ్రత్తపడుతున్నారు. ఎప్పుడు చూసినా ఏదో ఒక మాస్క్‌తోనే కనిపిస్తూ వస్తున్నారు. అయితే చాలాకాలం తర్వాత బుధవారం జరిగిన ఓ వేడుకలో తన మాస్క్‌ తీసేసి కనిపించాడు. ఇంతకీ ఆ వేడుక ఏంటనుకుంటున్నారా? తనకు సంబంధించినదే! రాజ్‌ కుంద్రా.. తన జీవితంలో ఎదుర్కొన్న చేదు సంఘటనల సమాహారాన్ని సినిమాగా తీసుకువస్తున్నాడు. ఇందులో అతడే హీరోగా నటించాడు. దీనికి యూటీ 69 అనే టైటిల్‌ ఖరారు చేశారు. ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లోనే తన ముఖాన్ని చూపించాడు.

ఈ సందర్భంగా రాజ్‌కుంద్రా ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. 'నా జీవితకథను బయోపిక్‌గా తీయాలనుకున్నాను. ఈ విషయాన్ని నా భార్యకు చెప్పినప్పుడు తను నాకు కొంత దూరంలో నిలబడి ఉంది. సినిమా చేస్తానని చెప్పానో లేదో.. తను నా మీదకు చెప్పు విసిరింది. నేను సినిమా తీయాలన్న ఆలోచన తనకు నచ్చలేదు. మొదట్లో ఇష్టపడలేదు కానీ తర్వాత తన మనసు మార్చుకుని నాకు అండగా నిలబడింది' అని చెప్పుకొచ్చాడు.

కాగా నీలిచిత్రాల కేసులో రాజ్‌కుంద్రాను ముంబై పోలీసులు 2021లో అరెస్ట్‌ చేశారు. కొంతకాలంపాటు జైలు జీవితం అనుభవించిన తర్వాత ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. తన సినిమాలో జైలు జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను కూడా చూపించనున్నాడు రాజ్‌ కుంద్రా. షహ్నావజ్‌ అలీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నవంబర్‌ 3న విడుదల కానుంది.

చదవండి: నామినేషన్స్‌.. మా రక్తం ఉడికిపోయింది.. థూ అనేంత తప్పు ఏం చేశాడంటూ భోలె చెల్లి ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement