
Shilpa Shettys Reaction After Husband Raj Kundra Gets Bail: పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన రాజ్‌కుంద్రా దాదాపు రెండు నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారు. రూ.50వేల పూచికత్తుతో ఆయనకు ముంబై కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భర్తకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో శిల్పాశెట్టి తొలిసారిగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించారు. 'భీబత్సమైన తుఫాను తర్వాత కూడా అందమైన విషయాలు జరుగుతాయని నిరూపించడానికి ఇంద్రధనస్సు(రెయిన్‌బో) ఏర్పడుతుంది' అంటూ ప్రముఖ చైనీస్ అమెరికన్ అర్కిటెక్ట్ రోగర్ లీ కొటేషన్‌ను ఆమె పోస్ట్ చేశారు.
చదవండి: 'నేను చాలా బిజీ.. నా భర్త ఏం చేస్తుండేవాడో నాకు తెలియదు'
కాగా 2009లో రాజ్‌కుంద్రాను రెండో వివాహం చేసుకున్న శిల్పాశెట్టి పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పింది. ప్రస్తుతం రియాలిటీ షోలతో అలరిస్తున్న ఆమె ఇటీవలె సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అశ్లీల చిత్రాల కేసులో రాజ్‌కుంద్రా అరెస్ట్ అనంతరం ఆర్థికంగా నష్టపోయిన శిల్పాశెట్టి అవమానంతో కొన్ని రోజుల పాటు షూటింగ్‌కు గైర్హాజరు అయిన సంగతి తెలిసిందే.
ఈ మధ్యే తిరిగి షూటింగ్‌లో పాల్గొంటున్న శిల్పా కుంద్రాతో తెగదెంపులు చేసుకోవాలని భావిస్తున్నట్లు బీటౌన్‌లో చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా ఆమె చేసిన ఇన్‌స్టా పోస్ట్‌తో ఆ రూమర్స్ పటాపంచలైనట్లేనా లేక కుంద్రాకు విడాకులు ఇవ్వనుందా అన్నది చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment