Armaan Kohli Bail Denied In Drugs Case: నటుడు అర్మాన్ కోహ్లీకి ముంబై కోర్టు షాకిచ్చింది. అతను పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. వివరాల ప్రకారం.. డ్రగ్స్ కేసులో నటుడు అర్మాన్ కోహ్లీని గత నెల28న ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అర్మాన్ నివాసంలో జరిపిన సోదాల్లో 1.2 గ్రాముల కొకైన్ లభ్యం కావడంతో ఎన్‌సీబీ అతడ్ని అదుపులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో మేజిస్ట్రేట్ కోర్టు అర్మాన్‌కు 14రోజల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
దీనిని సవాలు చేస్తూ తనకు డ్రగ్ సప్లయర్స్‌తో సంబంధాలు ఉన్నాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని అర్మాన్ పేర్కొన్నాడు. తనకు వెంటనే బెయిల్ ముంజూరు చేయాలని కోరుతూ ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
కాగా ఈ కేసులో అర్మాన్‌తో పాటు ఏడుగురు నిందితులు ఉన్నారని, వీరికి ఒకరితో మరొకరికి సంబంధాలు ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అద్వైత్ సేథ్నా కోర్టుకు వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో అర్మాన్‌కు బెయిల్ మంజూరు చేయరాదంటూ కోర్టుకు విన్నవించారు. దీనిపై ఏకీభవించిన అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్‌ఎమ్ నెర్లికర్ అర్మాన్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.
చదవండి : సిద్ధార్థ్ శుక్లాకు నివాళులు అర్పించిన హాలీవుడ్ నటుడు
జయలలిత సమాధి వద్ద నివాళులు అర్పించిన కంగనా రనౌత్
Comments
Please login to add a commentAdd a comment