Aryan Khan Drug Case: Malayalam Actor Tovino Thomas Sensational Comments On Aryan Khan Case - Sakshi
Sakshi News home page

Aryan Khan Drug Case: మరోసారి తెరపైకి ఆర్యన్‌ డ్రగ్‌ కేసు, ఆ సౌత్‌ హీరో ఏమన్నాడంటే..

Published Sat, Mar 5 2022 1:22 PM | Last Updated on Sat, Mar 5 2022 1:50 PM

Malayalam Actor Tovino Thomas Sensational Comments On Aryan Khan Drug Case - Sakshi

Hero Tovino Finally Open Up On Aryan Khan Drug Case: గతేడాది బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్‌ సంచలనం సృష్టించింది. 2021 అక్టోబర్‌ 3న క్రూయిజ్‌ నౌకలో డ్రగ్స్‌ స్వాధీనం కేసులో అరెస్టయిన ఆర్యన్‌ అక్టోబర్‌ 30న బెయిల్‌పై బయటకు వచ్చాడు. అప్పట్లో ఈ కేసు బాలీవుడ్‌తో పాటు, టాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండల్‌వుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ కేసులో ఎంతో బాలీవుడ్‌ నటీనటులు, ప్రముఖులు ఆర్యన్‌, షారుక్‌లకు మద్ధతుగా నిలిచారు.

చదవండి: నన్ను నమ్మినందుకు థ్యాంక్స్‌, నాకింకా గుర్తుంది.. అది 2012: సమంత

​​​కానీ సౌత్‌ ఇండస్ట్రీలకు చెందిన ఏ ఒక్కరు ఈ కేసుపై నోరు విప్పలేదు. ఈ క్రమంలో తాజాగా ఆర్యన్‌ కేసుపై మలయాళ హీరో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వివాదం సద్దుమణిగాక, ఈకేసు గురించి సెలబ్రెటీలతో పాటు ప్రజలు కూడా మరిచిపోయారు. ఈ తరుణంగా సౌత్‌ హీరో టోవినో థామస్‌ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. దీంతో ఆర్యన్‌ డ్రగ్స్‌ కేసు వ్యవహరం మరోసారి వార్తల్లో నిలిచింది. అసలు ఏం జరిగిందంటే.. మలయాళ స్టార్‌ హీరో టోవినో థామస్‌ ఇటీవల నటించిన మిన్నాళ్‌ మురళి చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది.

చదవండి: సుధీర్‌ ఎంగేజ్‌మెంట్‌!, ఇంతకీ ఎవరా అమ్మాయి? పేరేంటి..

ఈ మూవీ సక్సెస్‌ నేపథ్యంలో చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో టోవినో థామస్‌ ఆర్యన్‌ డ్రగ్‌ కేసుపై స్పందించాడు. ఈ సందర్భంగా టోవినో మాట్లాడుతూ.. ఈ కేసు సమంయలో షారుక్‌ ఖాన్‌ పేరును డ్యామేజ్‌ చేయడానికి రాజకీయంగా కుట్ర జరిగిందని, దీనిని కొంతమంది ప్రజలు కూడా విశ్వసిస్తున్నారంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. కాగా ఈ కేసులో ముంబై హైకోర్టు ఆర్యన్‌కు మూడు సార్లు బెయిల్‌ రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏకంగా బాలీవుడ్‌ బడా హీరో షారుక్‌ ఖాన్‌ కుమారుడికి బెయిల్‌ దొరక్కపోవడం ఏంటని అంతా షాక్‌కు గురయ్యారు. అంటే దీని వెనక ఎదైన కుట్ర జరుగుతుందా? అంటూ నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement