Armaan Kohli
-
డ్రగ్స్ కేసు : నటుడు అర్మాన్ కోహ్లీకి షాక్ ఇచ్చిన కోర్టు
Armaan Kohli Bail Denied In Drugs Case: నటుడు అర్మాన్ కోహ్లీకి ముంబై కోర్టు షాకిచ్చింది. అతను పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. వివరాల ప్రకారం.. డ్రగ్స్ కేసులో నటుడు అర్మాన్ కోహ్లీని గత నెల28న ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అర్మాన్ నివాసంలో జరిపిన సోదాల్లో 1.2 గ్రాముల కొకైన్ లభ్యం కావడంతో ఎన్సీబీ అతడ్ని అదుపులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో మేజిస్ట్రేట్ కోర్టు అర్మాన్‌కు 14రోజల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీనిని సవాలు చేస్తూ తనకు డ్రగ్ సప్లయర్స్‌తో సంబంధాలు ఉన్నాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని అర్మాన్ పేర్కొన్నాడు. తనకు వెంటనే బెయిల్ ముంజూరు చేయాలని కోరుతూ ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కాగా ఈ కేసులో అర్మాన్తో పాటు ఏడుగురు నిందితులు ఉన్నారని, వీరికి ఒకరితో మరొకరికి సంబంధాలు ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అద్వైత్ సేథ్నా కోర్టుకు వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో అర్మాన్‌కు బెయిల్ మంజూరు చేయరాదంటూ కోర్టుకు విన్నవించారు. దీనిపై ఏకీభవించిన అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్ఎమ్ నెర్లికర్ అర్మాన్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. చదవండి : సిద్ధార్థ్ శుక్లాకు నివాళులు అర్పించిన హాలీవుడ్ నటుడు జయలలిత సమాధి వద్ద నివాళులు అర్పించిన కంగనా రనౌత్ -
‘కోహ్లి’ని అరెస్ట్ చేసిన పోలీసులు
ముంబై : వివాదాస్పద నటుడు, బిగ్‌బాస్ మాజీ పోటీదారు అర్మాన్ కోహ్లిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అతని గర్ల్ ఫ్రెండ్, ఫ్యాషన్ స్టెలిస్ట్ నీరూ రాంధవాను దారుణంగా కొట్టి, హింసించిన కేసుల్లో ముంబైలో పోలీసులు అర్మాన్ కోహ్లిని అదుపులోకి తీసుకున్నారు. గత వారమే శాంతాక్రజ్ పోలీసు స్టేషన్లో ఇతనిపై కేసు నమోదైంది. స్టెలిస్ట్ నీరూ, నటుడు అర్మాన్ కోహ్లి మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య ఆర్థిక సంబంధమైన విషయాల్లో తరచూ గొడవ జరుగుతూ వస్తోంది. ఈ గొడవ జూన్ 3 మరింత తారాస్థాయికి చేరింది. గొడప పడే క్రమంలో ఉన్మాదిలా మారిన కోహ్లి.. నీరూను బలంగా నెట్టేయడంతో ఆమె మెట్లపైనుంచి దొర్లుకుంటూ కిందపడిపోయిందని రిపోర్టులు పేర్కొన్నాయి. అంతటితో ఆగకుండా ఆమె జుట్టుపట్టుకుని తలను నేలకేసి గట్టిగా బాదాడని, తీవ్రంగా గాయపడ్డ ఆమె.. తనను ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఎంత వేడుకున్నా అతను వినలేదని తెలిసింది. కోహ్లి చేతిలో చావుదెబ్బలు తిన్న చాలా సేపటి తర్వాత అతికష్టం మీద ఆస్పత్రికి వెళ్లగలిగిన బాధితురాలు.. చివరికి పోలీసులను ఆశ్రయించింది. అప్పటికే కోహ్లి అజ్ఞాతంలోకి పారిపోయాడు. ఐపీసీ 323, 326, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం ముమ్మరంగా పోలీసులు గాలించి, ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. తనను కోహ్లి, బయట తిరగనీయకుండా చేస్తానన్నడని నీరూ తన ఫిర్యాదులో పేర్కొంది. అతను ఎలాంటి వాడో ప్రతి ఒక్కరికీ తెలుసని, ఎవరికీ తాను బయటపడనని పేర్కొంది. -
కోహ్లి చేతిలో చావుదెబ్బలు తిని..
ముంబై: వివాదాస్పద నటుడు, బిగ్‌బాస్ మాజీ పోటీదారు అర్మాన్ కోహ్లిపై కేసు నమోదైంది. ఫ్యాషన్ స్టైలిస్ట్ నీరూ రాంధవాను దారుణంగా కొట్టి, పారిపోయిన అతని కోసం ముంబై పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. శాంతాక్రజ్ పోలీసుల కథనం ప్రకారం... ప్రాధేయపడ్డా వినిపించుకోకుండా ఉన్మాదిలా..: స్టైలిస్ట్ నీరూ, నటుడు అర్మాన్ కోహ్లిలు గడిచిన మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఇద్దరూ తరచూ కీచులాడుకునేవారు. ఇటీవల గోవాలోని ఓ విల్లా విక్రయానికి సంబంధించి గొడవ తారాస్థాయికి చేరింది. ఇదే విషయమై ఆదివారం రాత్రి కూడా వాగ్వాదం జరిగింది. ఒకదశలో ఉన్మాదిలా మారిన కోహ్లి.. నీరూను బలంగా నెట్టేయడంతో ఆమె మెట్లపైనుంచి దొర్లుకుంటూ కిందపడిపోయింది. అంతటితో ఆగకుండా ఆమె జుట్టుపట్టుకుని తలను నేలకేసి గట్టిగా బాదాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమె.. తనను ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఎంత వేడుకున్నా అతను వినలేదు. కోహ్లి చేతిలో చావుదెబ్బలు తిన్న చాలా సేపటి తర్వాత అతికష్టం మీద ఆస్పత్రికి వెళ్లగలిగిన బాధితురాలు.. చివరికి పోలీసులను ఆశ్రయించింది. కాగా, కోహ్లి అప్పటికే అజ్ఞాతంలోకి పారిపోయాడు. ఐపీసీ 323, 326, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. బడా దర్శకుడి సుపుత్రుడు: బాలీవుడ్లో 70,80వ దశకాల్లో ‘నాగిన్’, ‘జానీ దుష్మన్’, ‘రాజ్ తిలక్’, లాంటి బ్లాక్‌బస్టర్స్‌ను అందించిన దర్శకుడు రాజ్‌కుమార్ కోహ్లి తనయుడే అర్మాన్ కోహ్లి. కొడుకును హీరోగా నిలబెట్టేందుకు చేసిన విశ్వప్రయత్నాలన్నీ విఫలం కావడంతో రాజ్‌కుమార్ మిన్నకుండిపోయారు. మొదట్లో హీరోగా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగిన అర్మాన్.. బిగ్‌బాస్ షోతో ఒక్కసారే బడా సెలబ్రిటీ అయిపోయాడు. బిగ్‌బాస్-7 షో జరుగుతుండగానే కో-పార్టిసిపెంట్ తనీషా ముఖర్జీతో అర్మాన్ రొమాన్స్ చేయడం, మరో నటి సోఫియాతో గొడవపడటం, పోలీసులు ఏకంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిమరీ అర్మాన్‌ను అరెస్టు చేయడం అప్పట్లో పెనుదుమారం రేపింది. -
సోఫియా.. ప్చ్!
చూస్తుంటే సెక్సీ తార సోఫియా హయత్‌తో ఎవరికీ పొసగనట్టుంది. గతంలో ఆర్మాన్ కోహ్లీ తనను బిగ్‌బాస్ షోలో కొట్టాడంటూ రోడ్డెక్కిన అమ్మడు.. తాజాగా దర్శకుడు అనిల్ గోయల్ చీప్‌గా బిహేవ్ చేస్తున్నాడంటూ ఆరోపించింది. ‘మూడేళ్ల కిందట భాయి కా మాల్ హై చిత్రంలో నటించేందుకు అనిల్ నాతో ఒప్పందం చేసుకున్నాడు. ఇంత వరకు సినిమా స్టార్ట్ అవ్వలేదు. తాజాగా మళ్లీ నా డేట్స్ అడిగితే కుదరదన్నా. దాంతో నన్ను వ్యభిచారివని దూషించాడు’ అంటూ చెప్పుకొచ్చింది సోఫియా. -
బిగ్‌బాస్ నటుడు అర్మాన్‌కు బెయిల్
పింప్రి, న్యూస్‌లైన్: బిగ్‌బాస్ నటుడు అర్మాన్ కోహ్లికి మంగళవారం బెయిల్ లభించింది. బిగ్‌బాస్ రియాల్టీ షోలో నటిస్తున్న సమయంలో తనను కర్రతో కొట్టాడని, అసభ్యపదజాలంతో దూషించాడని సహనటి సోఫియా ఈ నెల 12న ఫిర్యాదుచేసిన నేపథ్యంలో అర్మాన్‌ను సోమవారం రాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా మంగళవారం ఉదయం అతడికి రూ.50 వేల నగదును జమానత్ కింద వసూలుచేసి బెయిల్ మంజూరు చేశారు. ఈ విషయమై కోహ్లి తండ్రి రాజ్‌కుమార్ మాట్లాడుతూ పబ్లిసిటీ కోసమే అర్మాన్‌పై సోఫియా ఆరోపణలు చేసిందని ఆరోపించారు. కాగా ప్రమోటర్ సల్మాన్‌ఖాన్ స్పందిస్తూ ఇదంతా షోలో భాగమై ఉంటుందని అభిప్రాయపడ్డారు. -
'బిగ్ బాస్7' హౌజ్ ను చేరుకున్న అర్మాన్ కోహ్లీ
బ్రిటీష్ నటి, గాయని సోఫియా హయత్ పై దాడి కేసులో అరెస్టైన బాలీవుడ్ నటుడు ఆర్మాన్ కోహ్లీ 'బిగ్ బాస్ 7' హౌజ్ కి చేరుకున్నారని కలర్స్ ఛానెల్ అధికార ప్రతినిధి మంగళవారం రాత్రి వెల్లడించారు. తనపై నమోదైన కేసులో విచారణకు సహకరించేందుకు సోమవారం రాత్రి ఆర్మాన్ బిగ్ బాస్ 7 హౌజ్ ను వదిలి వెళ్లారని కలర్స్ ప్రతినిధి తెలిపారు. అన్ని లీగల్ వ్యవహారాలు పూర్తి చేసుకుని ఆర్మాన్ మళ్లీ షోలో చేరారని వెల్లడించారు. గత సెప్టెంబర్ 15 తేదిన కలర్స్ ఛానెల్ లో ప్రారంభమైన షోలో మొత్తం 14 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. తనపై అర్మాన్ కోహ్లీ దాడి చేశారని... ఆ దాడిలో తనకు గాయలైనట్టు లోన్ వాలా పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
అర్మాన్ కోహ్లీ అరెస్టు.. బెయిలు
బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లీని పోలీసులు అరెస్టు చేశారు. బ్రిటిష్-పాకిస్థానీ నటి సోఫియా హయత్ ఫిర్యాదు మేరకు లోనావాలా పోలీసులు సోమవారం రాత్రి 11 గంటల సమయంలో అతడిని బిగ్ బాస్ హౌస్‌లోంచి తీసుకెళ్లారు. తనను బూతులు తిట్టి, కొట్టాడంటూ అర్మాన్ కోహ్లీపై సోఫియా హయత్ ముంబైలోని శాంతాక్రజ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వాళ్లు దర్యాప్తు నిమిత్తం లోనావాలా పోలీసులకు బదిలీ చేయగా, అక్కడి పోలీసులు.. కేసును దర్యాప్తు చేసి, కోహ్లీని అరెస్టు చేశారు. అనంతరం అర్మాన్ కోహ్లీకి బెయిల్ మంజూరైంది. స్థానిక కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. సోఫియా హయత్ ఫిర్యాదుతో అర్మాన్ కోహ్లీపై ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్లు శాంతాక్రజ్ సీనియర్ ఇన్స్పెక్టర్ అరుణ్ చవాన్ తెలిపారు. కోహ్లీపై ఐపీసీ సెక్షన్లు 324, 504, 509, 506, 354ల కింద కేసులు నమోదయ్యాయి. ఇందులో లైంగిక వేధింపుల దగ్గర్నుంచి ప్రమాదకర ఆయుధాలతో గాయపర్చడం లాంటి నేరాలున్నాయి. పోలీసులు చాలా బాగా స్పందించారని, మర్యాదగా వ్యవహరించారని అన్నారు. అంతకుముందు బిగ్‌బాస్‌లోని తనీషా, అజాజ్ ఖాన్ తదితరులతో కూడా సోఫియాకు గొడవలయ్యాయి. అర్మాన్ కోహ్లీతో గొడవే హింసాత్మకంగా మారింది. -
బిగ్ బాస్7లో సోఫియా హయత్ పై దాడి చేసిన కోహ్లీ అరెస్ట్!
బిగ్ బాస్7 కార్యక్రమంలో పాల్గొన్న పాకిస్థాన్ కు చెందిన బ్రిటీన్ నటి సోఫియా హయత్ పై దాడి చేశారనే అరోపణలపై బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో 'బిగ్ బాస్ 7' కార్యక్రమం మరోసారి వివాదస్పదంగా మారింది. హయత్ చేసిన ఫిర్యాదు మేరకే లోనావాలా లోని బిగ్ బాస్ హౌజ్ నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు. బిగ్ బాస్ కార్యక్రమం నుంచి డిసెంబర్ 11 తేదిన హయత్ బయటకు వచ్చింది. ఆతర్వాత కోహ్లీపై శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ హౌజ్ లో తనను అసభ్య పదజాలంతో దూషించి.. కోహ్లీ తనపై చేయి చేసుకున్నాడని ఫిర్యాదులో హయత్ పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. హయత్ ఫిర్యాదు మేరకు అర్మాన్ కోహ్లీ, అరుణ్ చవాన్ లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, ఆతర్వాత ఫిర్యాదును లోనావాల పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ ఫర్ చేశామని పోలీసులు వెల్లడించారు. కోహ్లీపై 324, 504, 509, 506, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బిగ్ బాస్ 7 కార్యక్రమంలో నాకు తనిషా, ఎజాజ్ ఖాన్ ల మధ్య గొడవ జరిగింది. అయితే ఆర్మాన్ కోహ్లీతో జరిగిన వాదన హింసాత్మకంగా మారింది. పోలీసులకు ఫిర్యాదు చేశాను. పోలీసుల స్పందించిన తీరు అమోఘం అని ట్విటర్ లో హయత్ పేర్కొన్నారు. -
బిగ్‌బాస్‌లో బూతులు తిట్టి.. కొట్టారు: సోఫియా హయత్
బిగ్ బాస్ గేమ్‌షోలో సహ భాగస్వామిపై సోఫియా హయత్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బిగ్ బాస్ 7 షో నుంచి ఇటీవలే బయటకు పంపేసిన సోఫియా హయత్.. తనను అర్మాన్ కోహ్లీ అనే సహ భాగస్వామి బూతులు తిట్టేవాడని, కొట్టేవాడని పోలీసులకు తెలిపింది. ఈ మేరకు ఫిర్యాదు కూడా దాఖలుచేసింది. దాంతో పోలీసులు అర్మాన్ కోహ్లీపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు శాంతాక్రజ్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ అరుణ్ చవాన్ తెలిపారు. సోఫియా హయత్ వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాత, కోహ్లీపై ఐపీసీ సెక్షన్లు 323, 324 కింద కేసులు నమోదు చేశారు. బిగ్ బాస్ హౌస్‌లో ఉండగా అర్మాన్ తనను తరచు బూతులు తిట్టేవాడని సోఫియా వాపోయింది. బిగ్ బాస్ హౌస్ లోనావాలాలో ఉన్నందున దర్యాప్తు నిమిత్తం కేసును అక్కడకు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారం గురించి సోఫియా హయత్ ట్విట్టర్ ద్వారా కూడా పలు విషయాలు వెల్లడించింది. శాంతాక్రజ్ పోలీసులు చాలా ప్రొఫెషనల్‌గా, మర్యాదగా వ్యవహరించారని చెప్పింది.