'బిగ్ బాస్7' హౌజ్ ను చేరుకున్న అర్మాన్ కోహ్లీ
Published Tue, Dec 17 2013 11:11 PM | Last Updated on Thu, Jul 18 2019 1:41 PM
బ్రిటీష్ నటి, గాయని సోఫియా హయత్ పై దాడి కేసులో అరెస్టైన బాలీవుడ్ నటుడు ఆర్మాన్ కోహ్లీ 'బిగ్ బాస్ 7' హౌజ్ కి చేరుకున్నారని కలర్స్ ఛానెల్ అధికార ప్రతినిధి మంగళవారం రాత్రి వెల్లడించారు. తనపై నమోదైన కేసులో విచారణకు సహకరించేందుకు సోమవారం రాత్రి ఆర్మాన్ బిగ్ బాస్ 7 హౌజ్ ను వదిలి వెళ్లారని కలర్స్ ప్రతినిధి తెలిపారు.
అన్ని లీగల్ వ్యవహారాలు పూర్తి చేసుకుని ఆర్మాన్ మళ్లీ షోలో చేరారని వెల్లడించారు. గత సెప్టెంబర్ 15 తేదిన కలర్స్ ఛానెల్ లో ప్రారంభమైన షోలో మొత్తం 14 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. తనపై అర్మాన్ కోహ్లీ దాడి చేశారని... ఆ దాడిలో తనకు గాయలైనట్టు లోన్ వాలా పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Advertisement
Advertisement