బిగ్బాస్లో బూతులు తిట్టి.. కొట్టారు: సోఫియా హయత్ | Sofia Hayat files FIR against 'Big Boss' contestant Armaan Kohli | Sakshi
Sakshi News home page

బిగ్బాస్లో బూతులు తిట్టి.. కొట్టారు: సోఫియా హయత్

Published Thu, Dec 12 2013 6:39 PM | Last Updated on Thu, Jul 18 2019 1:41 PM

బిగ్బాస్లో బూతులు తిట్టి.. కొట్టారు: సోఫియా హయత్ - Sakshi

బిగ్బాస్లో బూతులు తిట్టి.. కొట్టారు: సోఫియా హయత్

బిగ్ బాస్ గేమ్షోలో సహ భాగస్వామిపై సోఫియా హయత్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బిగ్ బాస్ 7 షో నుంచి ఇటీవలే బయటకు పంపేసిన సోఫియా హయత్.. తనను అర్మాన్ కోహ్లీ అనే సహ భాగస్వామి బూతులు తిట్టేవాడని, కొట్టేవాడని పోలీసులకు తెలిపింది. ఈ మేరకు ఫిర్యాదు కూడా దాఖలుచేసింది. దాంతో పోలీసులు అర్మాన్ కోహ్లీపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు శాంతాక్రజ్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ అరుణ్ చవాన్ తెలిపారు.

సోఫియా హయత్ వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాత, కోహ్లీపై ఐపీసీ సెక్షన్లు 323, 324 కింద కేసులు నమోదు చేశారు. బిగ్ బాస్ హౌస్లో ఉండగా అర్మాన్ తనను తరచు బూతులు తిట్టేవాడని సోఫియా వాపోయింది. బిగ్ బాస్ హౌస్ లోనావాలాలో ఉన్నందున దర్యాప్తు నిమిత్తం కేసును అక్కడకు పంపినట్లు పోలీసులు తెలిపారు.  ఈ మొత్తం వ్యవహారం గురించి సోఫియా హయత్ ట్విట్టర్ ద్వారా కూడా పలు విషయాలు వెల్లడించింది. శాంతాక్రజ్ పోలీసులు చాలా ప్రొఫెషనల్గా, మర్యాదగా వ్యవహరించారని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement