బిగ్‌బాస్ నటుడు అర్మాన్ కోహ్లికి మంగళవారం బెయిల్ లభించింది.
పింప్రి, న్యూస్‌లైన్: బిగ్‌బాస్ నటుడు అర్మాన్ కోహ్లికి మంగళవారం బెయిల్ లభించింది. బిగ్‌బాస్ రియాల్టీ షోలో నటిస్తున్న సమయంలో తనను కర్రతో కొట్టాడని, అసభ్యపదజాలంతో దూషించాడని సహనటి సోఫియా ఈ నెల 12న ఫిర్యాదుచేసిన నేపథ్యంలో అర్మాన్‌ను సోమవారం రాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా మంగళవారం ఉదయం అతడికి రూ.50 వేల నగదును జమానత్ కింద వసూలుచేసి బెయిల్ మంజూరు చేశారు. ఈ విషయమై కోహ్లి తండ్రి రాజ్‌కుమార్ మాట్లాడుతూ పబ్లిసిటీ కోసమే అర్మాన్‌పై సోఫియా ఆరోపణలు చేసిందని ఆరోపించారు. కాగా ప్రమోటర్ సల్మాన్‌ఖాన్ స్పందిస్తూ ఇదంతా షోలో భాగమై ఉంటుందని అభిప్రాయపడ్డారు.