
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో నటుడి పీఆర్ మేనేజర్ సిద్ధార్థ్ పితానిని ఎన్‌సీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా సిద్దార్థ్ అరెస్ట్‌పై తాజాగా ఎన్‌సీబీ ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది. '' ఈ నెల 26న సిద్థార్ధ్‌ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశాం. విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినా .. సిద్థార్ధ్ స్పందించలేదు. దీంతో సిద్ధార్థ్‌ను అరెస్ట్ చేసి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశాం. హైదరాబాద్ నుంచి ట్రాన్సిట్ వారెంట్‌పై ముంబైకి తరలించి ముంబై కోర్టులో సిద్థార్ధ్‌ను హాజరుపరిచాం. కోర్టు జూన్ 1 వరకు సిద్ధార్థ్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు అనుమతి ఇచ్చింది.'' అని తెలిపింది.
కాగా అతడు గతంలో సుశాంత్ నివసించిన ఫ్లాట్‌లోనే మూడేళ్లపాటు ఉన్నాడు. జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకునే ముందు చివరిసారిగా సిద్ధార్థ్‌తో మాట్లాడినట్లు పోలీసులు గతంలోనే గుర్తించారు. ఈ నేపథ్యంలో సుశాంత్ ఆత్మహత్య కేసులో సీబీఐ అధికారులు ఇతడిపై విచారణ జరిపారు. అలాగే ఈ కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంలోనూ ఎన్సీబీ అధికారులు సిద్ధార్థ్‌ను పలుమార్లు విచారించారు.
చదవండి: సుశాంత్ కేసు: నటుడి పీఆర్ మేనేజర్ అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment