
Ankita Lokhande- Vicky Jain Are Married: సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి, బాలీవుడ్ నటి అంకితా లోఖండే ప్రియుడు విక్కీ జైన్‌ను వివాహమాడింది. ఈ వేడుకకు ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్ వేదికైంది. వధువు అంకిత గోల్డెన్ కలర్ లెహంగా ధరించగా, వరుడు విక్కీ జైన్ కూడా వధువుకు సరిపోలే బంగారు- తెలుపు రంగు షేర్వాణీ ధరించాడు. వేదిక వద్దకు వధూవరులిద్దరు పాతకాలపు కారులో రావడం ఆకట్టుకుంది. వీరి పెళ్లి వేదికను వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు.
కాగా కరోనా నిబంధనల నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖుల మధ్య వీరి వివాహ కార్యక్రమం ఈరోజు(డిసెంబర్ 14) ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తన మెహందీ, ఎంగేజ్‌మెంట్, హల్దీ, సంగీత్ కార్యక్రమాలకు సంబధించిన ఫొటోలను అంకిత కొద్ది రోజులుగా షేర్ చేస్తూ వచ్చింది. దీంతో ఆమె ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇండోర్‌లో జన్మించిన అంకిత 2005లో తన నటన కలను సాకారం చేసుకోడానికి ముంబైకి వచ్చింది. తన టాలెంట్ నిరూపించుకునేందుకు 'టాలెంట్ హంట్' రియాలిటీ షోలో పాల్గొంది.
చదవండి: (భార్యభర్తలుగా తొలిసారి మీడియా ముందుకు కత్రినా-విక్కీ, వీడియో వైరల్)
నాలుగేళ్ల తర్వాత 'పవిత్ర రిష్టా' టీవి సీరియల్‌తో పెద్ద బ్రేక్ వచ్చింది. ఈ సీరియల్‌తో పరిచయమైన సుశాంత్ సింగ్‌తో డేటింగ్ చేస్తున్నట్లు 2019లో అంకిత ప్రకటించింది. తర్వాత సుశాంత్‌తో ఆరేళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉంది. కంగనా రనౌత్ నటించిన 'మణికర్ణిక'తో సినిమాల్లోకి అడుగుపెట్టింది అంకిత. తర్వాత 'బాఘీ 3' చిత్రంలో కూడా నటించింది. సుశాంత్‌తో బ్రేకప్ తర్వాత మరో బాలీవుడ్ నటుడు విక్కీజైన్‌తో ప్రేమలో పడింది. గత మూడేళ్లుగా వీరు ప్రేమలో మునిగితేలుతున్నారు.
చదవండి: (Katrina Kaif: సల్మాన్, రణ్‌బీర్ నుంచి కత్రినాకు ఖరీదైన బహుమతులు, అవేంటంటే..)
Comments
Please login to add a commentAdd a comment