బిగ్‌బాస్‌ హౌస్‌లో అందరిముందే భర్తను చెప్పుతో కొట్టిన భార్య..! | Ankita Lokhande Hits Husband Vicky Jain With Chappals | Sakshi
Sakshi News home page

Ankita: భర్తను చెప్పుతో కొట్టిన బిగ్‌బాస్ కంటెస్టెంట్.. వీడియో వైరల్!

Published Wed, Nov 22 2023 5:07 PM | Last Updated on Wed, Nov 22 2023 6:32 PM

Ankita Lokhande Hits Husband Vicky Jain With Chappals - Sakshi

ప్రస్తుతం బాలీవుడ్‌లో  బిగ్ బాస్ 17 సీజన్‌ అభిమానులను అలరిస్తోంది. ఈ ఏడాది కూడా సల్మాన్ ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహిస్తున్నారు. అయితే హౌస్‌లో ఈసారి భార్యభర్తలు కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టారు. బుల్లితెర నటులైన అంకిత, విక్కీ జైన్ రియాల్టీ షో  స్ట్రాంగ్‌ కంటెస్టెంట్స్‌గా కొనసాగుతున్నారు. హౌస్‌లోకి వెళ్లినప్పటి నుంచి ఇద్దరి మధ్య చాలాసార్లు వివాదాలొచ్చాయి. 

(ఇది చదవండి: నాగచైతన్య-చందు మొండేటి మూవీ.. ఆసక్తిగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్!)

అయితే తాజాగా హౌస్‌లో భార్యభర్తలిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. పక్కనే మరికొందరు కంటెస్టెంట్స్ ఉండగా.. ఒకరినొకరు తోసుకుంటూ హౌస్‌లో అల్లరి చేశారు. విక్కీ చేసిన సరదా కాస్తా అంకిత కోపానికి కారణమైంది.  దీంతో ఆమె వెంటనే తన చెప్పులను తీసి భర్తపైకి విసిరింది. హౌస్‌లోని కంటెస్టెంట్స్‌ ముందే తన భర్తను చెప్పులతో కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

కాగా.. ఈ వారం నామినేషన్స్‌లో  అంకిత లోఖాండే ఉన్నారు. కానీ ఆమె భర్త విక్కీ మాత్రం నామినేట్ కాలేదు. కాగా.. గతంలో  తనతో ఎక్కువ సమయం మాట్లాడటం లేదని.. ఇతర హౌస్‌మేట్స్‌తోనే చనువుగా ఉంటున్నారని అంకిత చాలాసార్లు హోస్ట్‌కు ఫిర్యాదు చేసింది.  మరోవైపు తాను కేవలం ఆటపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు అంకితకు వివరించాడు. అయితే హౌస్‌లో వీరిద్దరి తీరుపై ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్స్ సైతం మండిపడుతున్నారు. 

అయితే అంతకుముందే విక్కీ జైన్‌ మరో మహిళ కంటెస్టెంట్‌తో సన్నిహితంగా మెలిగారు. హౌస్‌లోని ఉన్న సనాతో చేయి పట్టుకుని కనిపించారు. ఇది చూసిన నెటిజన్స్ అతని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌస్‌లో భార్య ఉండగా.. ఇలా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు, మరికొందరేమో సనానే అతని చేయి పట్టుకుందని విమర్శిస్తున్నారు.  

(ఇది చదవండి: ఓటీటీలో 20 సినిమాలు.. ఆ హిట్ సినిమా ఉచితం కాదు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement