సుశాంత్ ఆత్మహత్య.. అందుకే వెళ్లలేదన్న మాజీ ప్రియురాలు! | Ankita Lokhande Gets Emotional Remembering Sushant Singh Rajput | Sakshi
Sakshi News home page

Ankita Lokhande: సుశాంత్ మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా: అంకిత

Published Tue, Nov 21 2023 3:19 PM | Last Updated on Tue, Nov 21 2023 4:18 PM

Ankita Lokhande Gets Emotional Remembering Sushant Singh Rajput - Sakshi

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. ఎంస్‌ ధోని సినిమాతో సినీ ప్రేక్షకుల మనసులను ఆకట్టుకున్నారు. అయితే ఎవరు ఊహించని విధంగా సుశాంత్ మరణించారు. ముంబయిలోని తన గదిలో సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. 

ప్రస్తుతం హిందీ బిగ్‌ బాస్‌ సీజన్-17 జరుగుతోంది. ఈ రియాలిటీ షోకు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోలో బాలీవుడ్ నటి, సుశాంత్ ప్రియురాలు అంకితా లోఖాండే కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఈ నేపథ్యంలో హౌస్‌లో ఉన్న ఆమె తన మాజీ ప్రియుడు సుశాంత్‌ను గుర్తుకు తెచ్చుకుంది. అతని గురించి మరో కంటెస్టెంట్‌ మునావర్ ఫారూఖీతో మాట్లాడింది. అంకితా లోఖండే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ అంత్యక్రియలను మళ్లీ గుర్తు చేసుకున్నారు.

మునావర్ ఫరూఖీతో మాట్లాడుతూ.. అలాంటి వ్యక్తిని కోల్పోవడం నా జీవితంలో ఇదే మొదటిసారి. సుశాంత్ మరణం నాకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది.  అందువల్లే నేను అతని అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు. ఈ విషయం తెలిసి కూడా నేను వెళ్లలేకపోయాను. ఆ పరిస్థితిలో నేను సుశాంత్‌ను చూడలేను. విక్కీ నన్ను వెళ్లమని చెప్పాడు. కానీ నేనే నిరాకరించాను. నా జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురుకాలేదు. మొదటిసారి మా నాన్నని అలా చూశా. ఒక వ్యక్తిని కోల్పోతే కలిగే నష్టాన్ని నేను గ్రహించా. కాగా.. అంకిత తండ్రి శశికాంత్ లోఖండే ఈ ఏడాదిలోనే మరణించారు. అంకిత ప్రస్తుతం బిగ్ బాస్ -17లో తన భర్త విక్కీ జైన్‌తో కలిసి పాల్గొంది. వీరిద్దరు 2021లో పెళ్లి చేసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement