Vicky
-
బిగ్‌బాస్ హౌస్‌లో అందరిముందే భర్తను చెప్పుతో కొట్టిన భార్య..!
ప్రస్తుతం బాలీవుడ్లో బిగ్ బాస్ 17 సీజన్ అభిమానులను అలరిస్తోంది. ఈ ఏడాది కూడా సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహిస్తున్నారు. అయితే హౌస్‌లో ఈసారి భార్యభర్తలు కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టారు. బుల్లితెర నటులైన అంకిత, విక్కీ జైన్ రియాల్టీ షో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌గా కొనసాగుతున్నారు. హౌస్‌లోకి వెళ్లినప్పటి నుంచి ఇద్దరి మధ్య చాలాసార్లు వివాదాలొచ్చాయి. (ఇది చదవండి: నాగచైతన్య-చందు మొండేటి మూవీ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!) అయితే తాజాగా హౌస్‌లో భార్యభర్తలిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. పక్కనే మరికొందరు కంటెస్టెంట్స్ ఉండగా.. ఒకరినొకరు తోసుకుంటూ హౌస్‌లో అల్లరి చేశారు. విక్కీ చేసిన సరదా కాస్తా అంకిత కోపానికి కారణమైంది. దీంతో ఆమె వెంటనే తన చెప్పులను తీసి భర్తపైకి విసిరింది. హౌస్‌లోని కంటెస్టెంట్స్ ముందే తన భర్తను చెప్పులతో కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. ఈ వారం నామినేషన్స్‌లో అంకిత లోఖాండే ఉన్నారు. కానీ ఆమె భర్త విక్కీ మాత్రం నామినేట్ కాలేదు. కాగా.. గతంలో తనతో ఎక్కువ సమయం మాట్లాడటం లేదని.. ఇతర హౌస్‌మేట్స్‌తోనే చనువుగా ఉంటున్నారని అంకిత చాలాసార్లు హోస్ట్‌కు ఫిర్యాదు చేసింది. మరోవైపు తాను కేవలం ఆటపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు అంకితకు వివరించాడు. అయితే హౌస్‌లో వీరిద్దరి తీరుపై ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్స్ సైతం మండిపడుతున్నారు. అయితే అంతకుముందే విక్కీ జైన్ మరో మహిళ కంటెస్టెంట్‌తో సన్నిహితంగా మెలిగారు. హౌస్‌లోని ఉన్న సనాతో చేయి పట్టుకుని కనిపించారు. ఇది చూసిన నెటిజన్స్ అతని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌస్‌లో భార్య ఉండగా.. ఇలా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు, మరికొందరేమో సనానే అతని చేయి పట్టుకుందని విమర్శిస్తున్నారు. (ఇది చదవండి: ఓటీటీలో 20 సినిమాలు.. ఆ హిట్ సినిమా ఉచితం కాదు!) Mujhe yeh vali fight dekhni hain Serious vali nahi bolna mat chappal maari 😂 Kyuki yeh bohot Masti vala tha jaise bestfriends ek dooshre ko maarte hain Ek gala daba raha ek chapal 😂😂🤣 Ankita is in muanku mood#ankitalokhande #vickyjain #biggboss17 #munawarfaruqui pic.twitter.com/zbtRESokWN — Ankitalokhande (fan) (@Ankitafam) November 19, 2023 -
ప్రియుడ్ని పెళ్లాడిన అంకిత లోఖండే, ముంబైలో గ్రాండ్ వెడ్డింగ్
Ankita Lokhande- Vicky Jain Are Married: సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి, బాలీవుడ్ నటి అంకితా లోఖండే ప్రియుడు విక్కీ జైన్‌ను వివాహమాడింది. ఈ వేడుకకు ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్ వేదికైంది. వధువు అంకిత గోల్డెన్ కలర్ లెహంగా ధరించగా, వరుడు విక్కీ జైన్ కూడా వధువుకు సరిపోలే బంగారు- తెలుపు రంగు షేర్వాణీ ధరించాడు. వేదిక వద్దకు వధూవరులిద్దరు పాతకాలపు కారులో రావడం ఆకట్టుకుంది. వీరి పెళ్లి వేదికను వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. కాగా కరోనా నిబంధనల నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖుల మధ్య వీరి వివాహ కార్యక్రమం ఈరోజు(డిసెంబర్ 14) ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తన మెహందీ, ఎంగేజ్మెంట్, హల్దీ, సంగీత్ కార్యక్రమాలకు సంబధించిన ఫొటోలను అంకిత కొద్ది రోజులుగా షేర్ చేస్తూ వచ్చింది. దీంతో ఆమె ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇండోర్‌లో జన్మించిన అంకిత 2005లో తన నటన కలను సాకారం చేసుకోడానికి ముంబైకి వచ్చింది. తన టాలెంట్ నిరూపించుకునేందుకు 'టాలెంట్ హంట్' రియాలిటీ షోలో పాల్గొంది. చదవండి: (భార్యభర్తలుగా తొలిసారి మీడియా ముందుకు కత్రినా-విక్కీ, వీడియో వైరల్) నాలుగేళ్ల తర్వాత 'పవిత్ర రిష్టా' టీవి సీరియల్‌తో పెద్ద బ్రేక్ వచ్చింది. ఈ సీరియల్‌తో పరిచయమైన సుశాంత్ సింగ్‌తో డేటింగ్ చేస్తున్నట్లు 2019లో అంకిత ప్రకటించింది. తర్వాత సుశాంత్‌తో ఆరేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉంది. కంగనా రనౌత్ నటించిన 'మణికర్ణిక'తో సినిమాల్లోకి అడుగుపెట్టింది అంకిత. తర్వాత 'బాఘీ 3' చిత్రంలో కూడా నటించింది. సుశాంత్‌తో బ్రేకప్ తర్వాత మరో బాలీవుడ్ నటుడు విక్కీజైన్‌తో ప్రేమలో పడింది. గత మూడేళ్లుగా వీరు ప్రేమలో మునిగితేలుతున్నారు. చదవండి: (Katrina Kaif: సల్మాన్, రణ్‌బీర్ నుంచి కత్రినాకు ఖరీదైన బహుమతులు, అవేంటంటే..) -
చెప్పిందే చేస్తాడు
రాయలసీమ నేపథ్యంలో సినిమా అనగానే ఫ్యాక్షన్ ప్రధానాంశమని అనుకుంటారు. అయితే రాయలసీమలో అహింసను కోరుకునే శాంతి కాముకులు ఉన్నారనే కథాంశంతో తెరకెక్కనున్న చిత్రం ‘పులి బిడ్డ’. ‘చెప్పిందే చేస్తాడు’ అన్నది ఉపశీర్షిక. ‘పోలీస్ సిస్టర్స్, ఖాకీ చొక్కా, అశోక చక్రం’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఫైట్ మాస్టర్ విక్కీ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నారు. రాజా ఫిలిమ్స్ పతాకంపై ఈ సినిమా రూపొందనుంది. డైరెక్టర్ విక్కీ మాస్టర్, కథారచయిత యస్.ఎం. బాషా మాట్లాడుతూ– ‘‘రాజకీయ నేపథ్యంలో సాగే కథ ఇది. ఓ యువ ముఖ్యమంత్రికి శత్రువులు అడుగడుగునా అడ్డు తగులుతుంటారు. అయినప్పటికీ వారిపై కక్ష తీర్చుకోకుండా వారిలో మార్పు తీసుకురావడానికి సీఎం ఎలాంటి ప్రయత్నం చేశాడన్నది కథాంశం. విజయదశమి రోజున ఈ చిత్రం షూటింగ్‌ను ఒంగోలులో ప్రారంభిస్తాం. ఇద్దరు ప్రముఖ సీనియర్ నటులతో పాటు పాత, కొత్త నటీనటులతో తెరకెక్కిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: భగవతి బాల, ఫైట్స్, దర్శకత్వం: విక్కీ మాస్టర్. -
శృంగార నటి కొడుకుపై దాడి
సినిమా: శృంగార నటి మాయ కొడుకుపై కొందరు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చెన్నై విరుగంబాక్కంలో ఉంటున్న మాయ ఇంటికి గురువారం రాత్రి ఎనిమిది మంది గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఆమె కొడుకు విక్కీపై కత్తులదో దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు దుండగులను పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే వారు అక్కడి నుంచి పరారయ్యారు. కాగా విక్కీకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని స్థానిక వడపళనిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నారు. కాగా నుంగంబాక్కం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే విక్కీ మద్యం సేవిస్తూ తరచూ స్థానికులతో గొడవ పడుతుంటాడని, అతని బాధితులు పాత కక్ష్యల కారణంగా దాడి చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
అమిత్, విక్కీలకు రజతాలు
జియాన్ (చైనా): గత ఏడాది ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో కేవలం రెండు కాంస్య పతకాలు నెగ్గిన భారత రెజ్లర్లు ఈసారి మాత్రం అదరగొట్టారు. బుధవారం ముగిసిన ఫ్రీస్టయిల్ విభాగంలో రెండో రోజు భారత్‌కు రెండు రజతాలు, మూడు కాంస్య పతకాలు లభించాయి. ఓవరాల్‌గా భారత్‌కు ఈ విభాగంలో ఒక స్వర్ణం, మూడు రజతాలు, నాలుగు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు వచ్చాయి. ఫలితంగా భారత్ 155 పాయింట్లతో టీమ్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచింది. 220 పాయింట్లతో ఇరాన్ ఓవరాల్ చాంపియన్ టైటిల్‌ను గెల్చుకుంది. బుధవారం జరిగిన ఐదు ఈవెంట్స్‌లో బరిలోకి దిగిన భారత రెజ్లర్లు పతకాలు నెగ్గడం విశేషం. అమిత్ ధన్కర్ (74 కేజీలు), విక్కీ (92 కేజీలు) రజత పతకాలు సొంతం చేసుకోగా... రాహుల్ అవారె (61 కేజీలు), దీపక్ పూనియా (86 కేజీలు), సుమీత్ (125 కేజీలు) కాంస్య పతకాలను దక్కించుకున్నారు. 74 కేజీల ఫైనల్లో 2013 ఆసియా చాంపియన్ అమిత్ 0–5తో కైసనోవ్ దానియర్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. ‘ఫైనల్లో ఓడినందుకు నిరాశగా ఉంది. అయితే తాజా ప్రదర్శన నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. రాబోయే టోర్నీల్లో మరింత మెరుగ్గా రాణిస్తా. వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తా’ అని అమిత్ అన్నాడు. 92 కేజీల ఫైనల్లో విక్కీ 0–11తో అలీరజా కరిమిమచియాని (ఇరాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. సెమీస్‌లో విక్కీ 3–2తో జియో సన్ (చైనా)పై గెలిచాడు. కాంస్య పతక బౌట్లలో రాహుల్ అవారె 9–2తో కిమ్ జిన్ చెయోల్ (కొరియా)పై, దీపక్ పూనియా 8–2తో కొదిరోవ్ బఖ్దుర్ (తజకిస్తాన్)పై, సుమీత్ 8–2తో అనకులోవ్ ఫర్ఖోద్ (తజికి స్తాన్)పై విజయం సాధించా రు. నేడు మహిళల ఫ్రీస్టయిల్ విభాగం పోటీలు మొదలవుతాయి. భారత్ తరఫున సీమా (50 కేజీలు), లలిత షెరావత్ (55 కేజీలు), మంజు (59 కేజీలు), దివ్య కక్రాన్ (68 కేజీలు), పూజా (76 కేజీలు) బరిలోకి దిగనున్నారు. -
కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ ఎన్కౌంటర్లో మృతి
ఛండీగడ్: కరడుగట్టిన పంజాబ్ గ్యాంగ్‌స్టర్ విక్కీ గౌండర్, అతని సహచరుడు ప్రేమ్ లాహోరియాలు పంజాబ్-రాజస్థాన్ సరిహద్దులో పోలీస్ ఎన్కౌంటర్లో మృతిచెందారు. గౌండర్ నవంబర్, 2016 నుంచి పరారీలో ఉన్నాడు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న పంజాబ్‌లోని నాభా సెంట్రల్ జైలు నుంచి గౌండర్‌తో పాటు మరో ఐదుగురు 2016లో తప్పించుకున్నారు. వీరిలో ఇద్దరు ఉగ్రవాదులు కూడా ఉన్నారు. తప్పించుకున్న కొద్ది నెలల్లోనే మిగతా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు కానీ గౌండర్ మాత్రం పట్టుబడలేదు. విక్కీ గౌండర్ అసలు పేరు హర్జీందర్ భుల్లార్. విక్కీ గౌండర్ పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాధల్ స్వస్థలమైన లాంబిలోని సారావాన్ బోడ్లా గ్రామవాసి. మరో కరడుగట్టి నేరస్తుడు సుఖా కహ్లావాన్‌ను ఓ కేసు విషయమై పోలీసులు కోర్టుకు తీసుకువెళ్తుండగా ఆయనపై 2015లో దాడి చేసిన వారిలో ప్రధాన నిందితుడిగా విక్కీగౌండర్‌ను పోలీసులు అనుమానిస్తున్నారు. విక్కీ గౌండర్, ఆయన అనుచరులు జైలు నుంచే దందాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
దాచిన పత్తే..ఉసురు తీసింది
గిట్టుబాటు ధర రాకపోవడంతో పత్తిని అమ్ముకోలేక ఇంట్లో దాచుకుంటే.. అది ముగ్గురు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. ఇంట్లో ఉన్న పెద్దవాళ్లంతా బయటకు వెళ్లగా.. ఆ చిన్నారులు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ముగ్గురు కలిసి ఎంతో సంతోషంగా ఆడుకున్నారు. అయితే వారు ఆడుకుంటూ పత్తి కూటు పరదాను తాకారో.. లేక బరువుతోనే అది కూలిందో గానీ.. ఆ పత్తి కూటు ఆ చిన్నారులపై పడింది. వారు ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతిచెందారు. పెద్దలు ఇళ్లు చేరేసరికి ఆ చిన్నారులు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. కేసముద్రం, న్యూస్‌లైన్ : ఆ ఇంట్లో బోసినవ్వులు మాయమయ్యూయి. అప్పటిదాక తాతయ్యా అంటూ ఆటలాడిన ఆ ముగ్గురి పిల్లలు అనంతలోకాలను చేరారు. ధర రాకపోవడంతో దాచిపెట్టిన పత్తే వారి ప్రాణం తీసింది. ఇంట్లో ఉన్న పత్తి కూటు అమాంతం మీదపడగా ఊపిరాడక ముగ్గురు చిన్నారులు మృతిచెందిన సంఘటన మండలంలోని కోరుకొండపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. కోరుకొండపల్లి గ్రామాని కి చెందిన బేతు వెంకటయ్య, యాదమ్మ దంపతులకు కుమారులు వీరన్న, శ్రీను, కుమార్తె సుజాత ఉన్నారు. వారిలో వీరన్నకు కురవి మండలం కాంపెల్లికి చెందిన భవానితో వివాహం కాగా వారికి కుమారుడు విక్కీ(3) ఉన్నాడు. పది రోజుల క్రితమే మళ్లీ కుమారుడు జన్మించాడు. సుజాతకు కూడా కురవి మండలం కాంపెల్లి గ్రామానికి చెందిన మేనమామ చిట్టాల వీరన్నతో వివాహమైంది. వారికి కుమారుడు వేణు(12), కుమార్తె భద్రకాళి(6) ఉన్నారు. కాగా సుజాత, చిట్టాల వీరన్న దంపతులు బతుకు దెరువు కోసం సూరత్ వెళ్లారు. అయితే శివరాత్రి పర్వదినంతోపాటు తన అన్న వీరన్నకు కుమారుడు పుట్టాడని తెలియడంతో సుజాత సూరత్ నుంచి కాంపల్లికి వచ్చింది. శివరాత్రి రోజు కురవిలో జాగారం ఉండి, ఆ తర్వాత ఆస్పత్రిలో ఉన్న అన్న కుమారుడిని చూసింది. అనంతరం ఆదివారం కోరుకొండపల్లిలోని తల్లిగారింటికి వచ్చింది. కాగా బేతు వెంకటయ్య అన్న కొమురయ్య కోడలు ఉమ పురుగుల మందు తాగి మానుకోట ఆస్పత్రిలో చికిత్సపొందుతుండగా ఆమెను చూసేందు కు సోమవారం వెంకటయ్య భార్య యాదమ్మ, కుమారుడు వీరన్న, కూతురు సుజాత వెళ్లారు. ఇంటి దగ్గర పిల్లలు జాగ్రత్త అని వెంకటయ్యకు చెప్పి వెళ్లారు. మనవళ్లను, మనవరాలిని దగ్గరకు తీసుకుని అప్పటిదాక ఆడించిన వెంకటయ్య వారికి అన్నం తినిపించాడు. విక్కీ నిద్రకు రావడంతో పడుకోబెట్టాడు. మేము టీవీ చూస్తాం తాతయ్య.. బయటకు పోములే అని తలుపు పెట్టుకున్నారు. వారు టీవీ చూస్తున్నారులే అనుకుని వెంకటయ్య బయటకు వెళ్లి వచ్చాడు. పిల్లలను ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో కిటికీకి ఉన్న జాలిని కోసి చూడడంతో పత్తి కూటు కుప్పకూలి కనిపించింది. దీంతో లబోదిబోమంటూ గట్టిగా కేకలు పెడుతూ తలుపులను ఎంత నెట్టినా రాలేదు. ఇంతలో అక్కడికి చేరుకున్న స్థానికులు తలుపులు బద్దలు కొట్టి తెరిచారు. పత్తి మొత్తం ఆ ముగ్గురు పిల్లలను కప్పేసి ఉంది. పత్తిని తోడి తీయడంతో ముగ్గురు విగత జీవులుగా కనిపించారు. వారిని చూసిన వెంకటయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు కన్నీరుమున్నీరవుతూ వారిని బయటకు తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న వీరన్న, సుజాత కన్నీరుమున్నీరుగా విలపిస్తూ వచ్చి పిల్లల శవాలపై పడి బోరునవిలపిస్తూ సొమ్మసిల్లారు. కొడుకు పుట్టిన సంబురంలోనే... వీరన్న, భవాని దంపతులకు రెండో కుమారుడు పది రోజుల క్రితమే పుట్టాడు. దీంతో విక్కీ తల్లితోనే కాంపల్లిలోని అమ్మమ్మ ఇంట్లో ఉన్నాడు. అయితే సూరత్ నుంచి తన చెల్లెలి పిల్లలు రావడంతో వీరన్న విక్కీని కోరుకొండపల్లికి తీసుకొచ్చాడు. రెండో సారి కుమారుడు పుట్టాడనే సంబురా న్ని కుటుంబ సభ్యులతో పూర్తిగా పంచుకోకముందే మూడేళ్ల విక్కీ మాయమయ్యూడు. నీ తమ్మున్ని చూద్దువు లేరా కొడుకా అంటూ వీరన్న తన కొడుకు శవంపైపడి బోరున విలపించడాన్ని చూసి గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. -
ఓటమి ఒప్పుకోలేదు... ఓరిమి వదులుకోలేదు!
జీవితంలోని ఫెయిల్యూర్స్‌లో పెయిన్ ఎంత ఎక్కువ స్థాయిలో ఉంటే సక్సెస్‌లో అంత మజా ఉంటుంది. ఎదిగిన స్థాయి నుంచి ఎదిగి వచ్చిన స్థాయి వైపు చూసుకొంటే ఎదుగుదల విలువ ఏమిటో అర్థం అవుతుంది. ఢిల్లీ వీధుల చెత్తలోంచి చిత్తు కాగితాలను ఏరుకొంటూ గడిపిన కుర్రాడు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి ఫొటో గ్రాఫర్ అయ్యాడు! అతడు తీసే చిత్రాలు అంతర్జాతీయ స్థాయి అద్భుతాలవుతున్నాయి. అతడి ఫొటోలే కాదు అతడి సక్సెస్ స్టోరీ కూడా ఒక అద్భుతమే... ‘‘నా జీవితం ఎందుకింత దారుణంగా ఉంది, ఎవరైనా డబ్బులిస్తే బావుండు. ఎవరైనా నన్ను పెంచుకొంటే బావుండు, అన్ని సౌకర్యాలూ సమకూరిస్తే బావుండు.. ’’ అని అనుకొనే వాడట విక్కీ ... ఢిల్లీ రోడ్లమీద స్ట్రీట్ చైల్డ్‌గా తిరుగుతున్న రోజుల్లో. అయితే జీవితం అనేది ఒక రాత్రిలో మారిపోదు, ఎవరి జీవితానికీ మ్యాజికల్ టచ్ ఉండదు అని అతి తొందరలోనే అర్థం చేసుకొన్నాడు. ఎవరి జ్ఞానబోధ లేకుండానే ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొన్నాడు. అందులోని కష్టనష్టాలను అర్థం చేసుకొని, ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకొని అహోరాత్రులూ కష్టపడి తను అనుకొన్న లక్ష్యాన్ని సాధించాడు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన విక్కీ తన జీవితంలోని చీకటి గురించి మరిచిపోలేదు. పదిమంది చెప్పుకోదగిన స్థాయికి ఎదిగినా కూడా అహంకారాన్ని, ఆర్భాటాన్ని దరి చేరనివ్వలేదు. అందుకే ఇతడు విజేతగానూ స్ఫూర్తిమంతుడే, వ్యక్తిగానూ స్ఫూర్తిమంతుడే! కోల్‌కతాలోని తాతయ్య ఇంట్లో ఉండేవాడు విక్కీరాయ్. ఆ ఇంట్లో పరిస్థితులు అత్యంత దుర్భరంగా ఉండేవి. ఇంట్లో హింసను తట్టుకోలేక 11 యేళ్ల వయసులో మామయ్య జేబులోని డబ్బును కాజేసి ఢిల్లీ రెలైక్కేశాడు. అక్కడ నుంచి విక్కీ జీవితం కొత్త మలుపు తీసుకొంది. ఢిల్లీలో ఇతడిని రోడ్ల మీద చూసి ఎవరో ‘సలాం బాలక్ ట్రస్ట్’లో చేర్చారు. అయితే అక్కడ పరిస్థితులు ఏ మాత్రం నచ్చలేదు విక్కీకి. అక్కడ నుంచి పారిపోయి మళ్లీ రోడ్ల మీదికి వచ్చిపడ్డాడు. పనిదొరికితే పనిచేయడం... లేకపోతే చెత్త ఏరి నాలుగైదు రూపాయలు సంపాదించుకోవడం. అప్పటికి అదే జీవితం అనుకొన్నాడు. అయితే క్రమంగా తనలో ఒక ఆత్మవిమర్శ. జీవితం ఎటుపోతోందో అర్థం కావడం లేదనే భావన. ఆ భావన నుంచి కొన్ని పగటి కలలు, ఆశలు పుట్టుకొచ్చాయి. ఉన్నట్టుండి తన స్థితిగతులను ఎవరైనా మార్చేస్తే బావుండననే ఆశ కలిగింది. అయితే అది సాధ్యం కాదని చాలా త్వరగా అర్థం చేసుకొన్న విక్కీ తిరిగి ‘బాలక్ ట్రస్’్టలో చేరిపోయాడు. ఈసారి అక్కడ పరిస్థితులు చాలా కొత్తగా కనిపించాయి. ఇష్టంగా మారాయి. ఎందుకంటే ఏదో ఒకటి సాధించాలనే తపన మొదలైందప్పటికే. ఆ బాలక్ట్రస్ట్కు అనేక మంది వ్యక్తులు వచ్చేవారు. అక్కడి పిల్లలకు వివిధ విషయాల గురించి చెప్పేవారు. అలా ఒక విదేశీ ఫొటోగ్రాఫర్ బాలక్ ట్రస్ట్‌కు వచ్చాడు. అతడి చేతిలోని కెమెరాను చూడగానే విక్కీ కళ్లు మెరిశాయి. ఫొటోగ్రఫీ మీద ఆసక్తి పెంచుకొన్నాడు. దాన్నే కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకొన్నాడు. ‘బాలక్ ట్రస్ట్’లో ఉండగానే ఆ ఇంగ్లిష్ ఫొటోగ్రాఫర్‌కు సహాయకుడిగా మారాడు. భాషతో ఎంతో ఇబ్బంది వచ్చింది. అతడు చెప్పే మాటలేవీ విక్కీకి అర్థం అయ్యేవి కాదు. అయితే ఇంగ్లిష్ రాకపోయినా ఫొటోగ్రఫీలో రాణించవచ్చనే విషయాన్ని అర్థం చేసుకొన్నాడు. మెలకువలు నేర్చుకొని బాలక్ట్రస్ట్లోనే లోన్ తీసుకొని సొంతంగా కెమెరాను కొనుగోలు చేశాడు. ఆ కెమెరాతో విక్కీ చేసిన తొలి ప్రయత్నమే ‘స్ట్రీట్ డ్రీమ్స్’ ప్రాజెక్ట్. అనాథ ఆశ్రమంలో ఉండే యువకుల జీవితాన్ని తన ఫొటోలతో కళ్లకు కట్టాడు విక్కీ. అతడి ఫొటోల్లోని ఫీల్, టైమింగ్ అందరినీ ఆకట్టుకొన్నాయి. తాను అనుభవించిన స్ట్రీట్ చిల్డ్రన్ జీవితాన్ని ఫొటోల రూపంలో చూపాడు. ఆ ప్రాజెక్ట్‌కు చాలా మంచి పేరొచ్చింది. విక్కీ నేపథ్యం కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. అలా తీసిన ఫొటోలే విక్కీ జీవితానికి, విజయానికి ప్రతిరూపాలయ్యాయి. ‘జీవితంలో మరీ గొప్ప వాడినైపోవాలి’ అనే లక్ష్యమేదీ లేదని అంటున్నాడు విక్కీ. తన జీవితంలో ఇప్పటికే చాలా మార్పు వచ్చిందని, ఇప్పుడు వచ్చిన గుర్తింపుతో లభించిన మధ్యతరగతి జీవితాన్నే తాను ఆస్వాదిస్తున్నానని అంటూ విక్కీ తన సింప్లిసిటీను చాటుకున్నాడు. ఆ కెమెరాతో విక్కీ చేసిన తొలి ప్రయత్నమే ‘స్ట్రీట్ డ్రీమ్స్’ ప్రాజెక్ట్. అనాథాశ్రమంలో ఉండే యువకుల జీవితాన్ని తన ఫొటోలతో కళ్లకు కట్టాడు విక్కీ. అతడి ఫొటోల్లోని ఫీల్, టైమింగ్ అందరినీ ఆకట్టుకొన్నాయి. తాను అనుభవించిన స్ట్రీట్ చిల్డ్రన్ జీవితాన్ని ఫొటోల రూపంలో చూపాడు విక్కీ. ఆ ప్రాజెక్ట్‌కు చాలా మంచి పేరొచ్చింది.