బిగ్‌బాస్ సీజన్-18 దాదాపు చివరిదశకు చేరుకుంది. ఈనెల 19న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఇప్పటికే టాప్-6 కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్‌లో మిగిలి ఉన్నారు. ముఖ్యంగా ఫైనలిస్ట్‌లో కచ్చితంగా ఉంటుందని భావించిన నమ్రతా శిరోద్కర్ సిస్టర్ శిల్పా శిరోద్కర్ ఊహించని విధంగా ఎలిమినేట్ అయింది. ఫైనలిస్ట్ అయ్యే అవకాశాన్ని ఒక్క అడుగు దూరంలోనే మిస్ చేసుకుంది. హౌస్ నుంచి బయటకు వచ్చిన ఆమె బిగ్‌బాస్ హౌస్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే తన సిస్టర్ నమ్రతా, మహేశ్ బాబు గురించి మాట్లాడింది. వాళ్లు సోషల్ మీడియాలో తనకు మద్దతు ప్రకటించకపోవడంపై కూడా స్పందించింది.
ఎలిమినేషన్ గురించి శిల్పా మాట్లాడుతూ..'ఈ లిటీ షోకు నేను పెద్ద అభిమానిని. మిడ్‌వీక్‌లో ఎవిక్షన్ ఉంటుందని మనందరికీ తెలుసు. ఏ విషయంలోనూ నేను అబద్ధం చెప్పను. ఈ సీజన్‌లో టాప్ -3లో ఉండాలని ఆశించా. నా పేరు ప్రకటించినప్పుడు కాస్తా విచారంగా అనిపించింది. కానీ నా ఎలిమినేషన్ చాలా గౌరవంగా ఉంది. బిగ్ బాస్ నా పేరును కూడా ప్రకటించలేదు. నా లేఖను కూడా నేనే చదివా. ఈ షో అభిమానిగా హౌస్‌లో ప్రవేశించా. బిగ్ బాస్ హౌస్‌లో నా ప్రయాణంతో సంతోషంగా ఉన్నా' అని అన్నారు.
అయితే శిల్పా శిరోద్కర్‌కు సోదరి నమ్రతా శిరోద్కర్, మహేష్ బాబు దంపతుల నుంచి ఆమెకు తగినంత సపోర్ట్ లభించలేదని కొందరు సోషల్ మీడియా పోస్ట్‌లు పెట్టారు. ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానులు ఆమెకు ఓట్లు వేయాలని నమ్రతా కోరకపోవడంపై కొందరు అభిమానులు షాకయ్యారు.
అయితే ఇదే విషయం శిల్పా మాట్లాడుతూ.. "ఒక కుటుంబంగా, మాకు ఒకరిపై ఒకరికి అలాంటి అంచనాలు ఉండవు. ఈ ఇంటి ద్వారా నేను అన్ని రకాల వ్యక్తులను కలిశాను. మన తెలివితేటలను బట్టే మనల్ని అంచనా వేస్తారని తెలుసుకున్నా. నమ్రతా నన్ను ఎంతగా ప్రేమిస్తుందో నాకు తెలుసు. అలా అని నాకు సపోర్ట్ చేయాలని నేను చెప్పను. ఇలాంటివీ మా మధ్య బంధాన్ని ప్రభావితం చేయలేవు. ఆమె నాకు మద్దతు ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. తానేంటో నాకు తెలుసు..నేనేంటో తనకు తెలుసు.' అని వెల్లడించింది. మరోవైపు బిగ్‌బాస్ హౌస్‌లో వివియన్ ద్సేనా, కరణ్ వీర్ మెహ్రా తనకు స్నేహితులని శిల్పా శిరోద్కర్ తెలిపింది.
బిగ్‌బాస్‌లో అనుభవం గురించి మాట్లాడుతూ..' ఇక్కడ నా ఆత్మగౌరవం గురించి ప్రశ్నించారని నాకు తెలుసు. కానీ నేను ఎలాంటి అంచనాలు లేకుండా షోలోకి ప్రవేశించా. అసలు నేను ఇన్ని రోజులు హౌస్‌లోని ఉంటానునుకోలేదు. ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తారని తెలుసు. మేం చేసే ప్రతి విషయం వారికి గుర్తుంటుంది. నా కుమార్తె హౌస్‌లోకి వచ్చినప్పుడు చాలా సంతోషం కలిగింది. అప్పుడే గెలిచినంత ఆనందం వేసింది.' అని పంచుకుంది. కాగా.. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన బిగ్‌బాస్ సీజన్-18 రియాలిటీ షో ఫైనల్ జనవరి 19 ఆదివారం జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment