బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై కేతన్ కక్కడ్ అనే వ్యక్తికి సంచలన ఆరోపణలు చేశాడు. ఇటీవల కేతన్ కక్కడ్ ఓ యూట్యూబ్ చానల్ తో మాట్లాడుతూ.. పన్వేల్‌లోని సల్మాన్ ఖాన్ ఫాంహౌస్‌లో సినీ తారల శవాలను ఖననం చేశారని , అంతేకాకుండా సల్మాన్‌పై చిన్న పిల్లల అక్రమ రవాణా ఆరోపణలు కూడా ఉన్నాయని సదరు వ్యక్తి తెలిపాడు. దీంతో సల్మాన్ ఖాన్ అతనిపై కోర్టులో పరువు నష్టం దావా వేశాడు.
దీనిపై ముంబయి కోర్టులో సల్మాన్ తరఫు న్యాయవాది ప్రదీప్ గాంధీ వాదనలు వినిపిస్తూ.. సల్మాన్ ఖాన్ కు చెందిన పన్వేల్ ఫాంహౌస్లో సినీ తారల శవాలను పాతిపెడుతున్నారంటూ కేతన్ కక్కడ్ అసత్య ఆరోపణలు చేశాడని, పిల్లల అక్రమ రవాణా ఆరోపణలు.. కేవలం కల్పితాలని సల్మాన్ న్యాయవాది కోర్టుకు వివరించాడు. అయితే ఓ ఆస్తి వివాదానికి సంబంధించిన వ్యవహారమని, అందుకోసమే సల్మాన్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు సదరు వ్యక్తి ప్రయత్నిస్తున్నారని తెలియజేశాడు. కాగా, సల్మాన్ ఖాన్ తన పరువునష్టం దావాలో గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ల పేర్లను కూడా పేర్కొన్నాడు. ఆయా సామాజిక మాధ్యమాలు కేతన్ కక్కడ్ ఇంటర్వ్యూ వీడియోలను తొలగించాలని సల్మాన్ తరపు న్యాయవాది కోర్టును కోరాడు.
Comments
Please login to add a commentAdd a comment