
ముంబై : మతపరమైన అసమ్మతిని సృష్టించేలా ట్వీట్లు చేసిన బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్పై కేసు నమోదు చేయాలని పోలీసులును ముంబై కోర్టు ఆదేశించింది. ప్రజల మధ్య విభేదాలు సృష్టించేలా కంగనా అభ్యంతరకర ట్వీట్ చేశారంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించగా.. ఫిర్యాదును స్వీకరించిన కోర్టు న్యాయస్థానం ఆమెపై కేసు నమోదు చేయాలని అదేశించింది.
(చదవండి : నేనూ బాలీవుడ్‌కి ఇచ్చాను!)
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మృతిపై మహారాష్ట్ర పోలీసులు, కేంద్ర దర్యాప్తు బృందాలు విచారణ చేస్తున్న సమయంలో ప్రజల్లో అనుమానాలు కలిగేలా వివాదస్పద వ్యాఖ్యలతోపాటు, ముంబైని పాక్ అక్రమిత కశ్మీర్‌గా పోలుస్తూ ప్రజల మధ్య విభేదాలు సృష్టించే విధంగా కంగనా రనౌత్ అభ్యంతరకర ట్వీట్ చేసిందని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలిపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని ముంబైలోని బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశంతో ముంబై పోలీసులు కంగనపై దేశ ద్రోహం కేసు కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment