ఇతడు తెలుగు నటుడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ మధ్య వచ్చిన 'సలార్' మూవీలోనూ గుర్తుంచుకోదగ్గ పాత్రలో అలరించాడు. ఆ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. అంతా బాగానే ఉందనుకునేలోపు.. ఇతడికి ఆలందూర్ కోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో అందరూ షాకయ్యారు. నోటీసులు జారీ చేసేంతలా ఇతడు ఏం చేశాడా అని మాట్లాడుకుంటున్నారు.
ఇంతకీ ఏం జరిగింది?
ఆలందూర్‌కు చెందిన జేఎంఏ హుస్సేన్.. బాబీసింహపై కోటి రూపాయలు పరువు నష్టం దావా వేస్తూ ఆలందూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను బాబీసింహ స్నేహితులమని.. చిన్నప్పుడు కలిసి చదువుకున్నామని పేర్కొన్నారు. జమీర్ కాశీం అనే వ్యక్తి.. తన ద్వారా బాబీసింహకు పరిచయమయ్యారని, అతడు భవన నిర్మాణ రంగంలో ఉన్నారని హుస్సేన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే బాబీసింహ.. కొడైక్కానల్‌లో నిర్మించే భవన నిర్మాణ బాధ్యతలను జమీర్ కాశీంకు అప్పగించారని చెప్పాడు.
(ఇదీ చదవండి: 'యానిమల్' ఓటీటీ రిలీజ్.. ఆ విషయంలో అభిమానులు అసంతృప్తి)
అయితే 90 శాతం భవన నిర్మాణ పనులను పూర్తి చేయగా.. అప్పటివరకు అయిన ఖర్చుని బాబీసింహా చెల్లించలేదని.. ఈ వ్యవహారంలో వారిద్దరి మధ్య గొడవ జరిగిందని హుస్సేన్ చెప్పాడు. దీంతో తన తండ్రి.. వాళ్లిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించారని.. కానీ ఆ సమయంలో 77 ఏళ్ల తన తండ్రిని బాబీసింహ బెదిరించారని హుస్సేన్ ఆరోపించారు. గతేడాది సెప్టెంబర్ 27న ప్రెస్ మీట్ పెట్టి మరీ తన గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ నేపథ్యంలో బాబీసింహపై తగిన చర్యలు తీసుకోవాలని హుస్సేన్.. ఆలందూర్ కోర్టులో పిటిషన్‌లో వేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను గురువారం విచారించిన న్యాయస్థానం.. వివరణ కోరుతూ ప్రముఖ నటుడు బాబీసింహకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరికి వాయిదా వేసింది.
(ఇదీ చదవండి: చిరంజీవికి 'పద్మ విభూషణ్'.. ఈ అవార్డుతో పాటు ఏమేం ఇస్తారు?)
Comments
Please login to add a commentAdd a comment