freed
-
న్యూజిలాండ్ పైలట్‌కు 19 నెలల తర్వాత విముక్తి
జకార్తా: న్యూజిలాండ్ పైలట్‌ను ఏడాదిన్నర క్రితం నిర్బంధంలోకి తీసుకున్న ఇండోనేసియాలోని పపువా ప్రాంత వేర్పాటువాద గ్రూపు శనివారం విడిచిపెట్టింది. క్రైస్ట్‌చర్చ్ వాసి ఫిలిప్ మార్క్ మెహర్టెన్స్(38) ఇండోనేసియాకు చెందిన సుశి ఎయిర్ విమానయాన సంస్థలో పైలట్‌గా ఉన్నారు. మారుమూల పపువా ప్రాంతంలోని విమానాశ్రయంలో ఉన్న ఫిలిప్‌ను రెబల్స్ 2023 ఫిబ్రవరి 7వ తేదీన నిర్బంధంలోకి తీసుకున్నారు. 2023 ఏప్రిల్‌లో మెహర్టెన్స్ను విడిపించేందుకు ప్రయతి్నంచిన ఇండోనేసియా సైనికులు ఆరుగురిని రెబల్స్ చంపేశారు. దీంతో, అప్పటి నుంచి చర్చి మధ్యవర్తిత్వంతో ఇండోనేసియా ప్రభుత్వం, ఇతర విభాగాలు రెబల్స్‌తో చర్చలు జరుపుతూ వచ్చాయి. ఎట్టకేలకు చర్చలు సఫలమై మెహర్టెన్స్ బయటకు రాగలిగారు. ఇది చాలా క్లిష్టమైన వ్యవహారమంటూ ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో సైతం వ్యాఖ్యానించడం గమనార్హం. మెహర్టెన్స్ విడుదలకు సంబంధించిన వివరాలను ఎవరూ బహిర్గతం చేయలేదు. రెబల్స్ చెర నుంచి విముక్తి లభించిన అనంతరం మెహర్టెన్స్ పపువాలోని తిమికా నుంచి జకార్తాకు చేరుకున్నారు. అతడి కుటుంబం బాలిలో ఉంటోంది. ఇండోనేసియా సంస్కృతి, జాతిపరంగా పపువా ప్రజలు విభిన్నంగా ఉంటారు. న్యూ గినియాలోని పశ్చిమ భాగమైన పపువా గతంలో డచ్ పాలకుల చేతుల్లో ఉండేది. 1969లో ఐరాస సారథ్యంలో పపువాలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి ఇండోనేసియా కలిపేసుకుంది. ఇదంతా బూటకమంటున్న వేర్పాటువాదులు స్వతంత్రం కోసం సాయుధ పోరాటం సాగిస్తున్నారు. గతేడాది నుంచి ఈ పోరాటం తీవ్రరూపం దాలి్చంది. -
Kathleen Folbigg: కన్నబిడ్డల మృతి కేసులో ఆస్ట్రేలియా మహిళ.. 20 ఏళ్లకు విముక్తి
సిడ్నీ: కన్నబిడ్డల మృతి కేసులో 20 ఏళ్లపాటు కారాగారంలో మగ్గిన ఆf స్ట్రేలి యా మహిళకు ఎట్టకేలకు విముక్తి లభించింది.న్యూ సౌత్ వేల్స్ లోని క్రిమినల్ కోర్టు ఆదేశాలతో గురువారం ఆమె విడుదలయ్యారు. కాథ్లీన్ ఫాల్బిగ్కు జన్మించిన నలుగురు సంతానం 1989–1999 సంవత్సరాల మధ్య వివిధ కారణాలతో చనిపో యారు. అయితే, వారి మరణాలకు తల్లి కాథ్లీనే కారణమంటూ పోలీసులు 2003లో హత్య కేసు నమోదు చేసి, జైలు శిక్ష విధించారు. తాను అమాయకురాలినని, తన బిడ్డల మరణాలు సహజంగానే జరిగినవని ఆమె ఎంతగా చెప్పినా ఎవరూ వినలేదు. మీడియా ఆమెను వరస్ట్ ఫిమేల్ సీరియల్ కిల్లర్‌గా అభివర్ణించింది. 2019లో మరోసారి జరిగిన దర్యాప్తులోనూ ఆమెనే దోషిగా తేలింది. 2022లో మాజీ న్యాయాధికారి జరిపిన విచారణలో మాత్రం..చనిపోయిన నలుగురు బిడ్డల్లో ఇద్దరు జన్యు సంబంధ వ్యాధులతోనే చనిపోయి ఉండొచ్చంటూ తెలిపింది. దీంతో, ఈ ఏడాది జూన్‌లో ఆమెకు కోర్టు క్షమాభిక్ష ప్రకటించింది. ఆమెపై వచ్చిన ఆరోపణలను న్యూ సౌత్ వేల్స్ కోర్టు కొట్టివేస్తూ జైలు నుంచి విడుదల చేసింది. జైలు నుంచి విడుదలైన కాథ్లీన్ ఫాల్బిగ్ హర్షం వ్యక్తం చేశారు. 1999లోనే తనపై మోపిన ఆరోపణలకు జవాబులు దొరికినా, నిరపరాధినని నిరూపించుకోలేకపోయాను. పిల్లలు ఆకస్మికంగా, గుర్తు తెలియని కారణాలతో చనిపోయే అవకాశం ఉందని భావించని యంత్రాంగం నన్ను దోషిగా చూసింది’అని పేర్కొన్నారు. రెండు దశాబ్దాలపాటు తనను నిర్బంధించిన యంత్రాంగం నుంచి భారీగా పరిహారం కోరుతూ దావా వేస్తానన్నారు. ఫాల్బిగ్ను విడుదల చేయాలంటూ పలువురు వైద్య నిపుణులు, వైద్యులు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను సైతం చేపట్టారు. -
19 ఏళ్లకు.. చార్లెస్ శోభరాజ్ రిలీజ్‌కు గ్రీన్‌సిగ్నల్
ఖాట్మాండు: ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్‌కు.. 19 ఏళ్ల జైలు శిక్ష తర్వాత ఊరట లభించింది. వయసు రీత్యా అతన్ని విడుదల చేయాలని నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇద్దరు అమెరికన్ టూరిస్టులను హత్య చేసిన ఆరోపణలపై చార్లెస్ శోభరాజ్ 2003 నుంచి నేపాల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతని వయసు ఇప్పుడు 78 ఏళ్లు. 1975లో శోభరాజ్ నేపాల్‌లో నకిలీ పాస్‌పోర్ట్‌తో ప్రవేశించడం.. అమెరికా పౌరుడు 29 ఏళ్ల కొన్నీ జో బోరోన్జిచ్, అతని స్నేహితురాలు 26 ఏళ్ల కెనడియన్ లారెంట్ క్యారియర్ ఇద్దర్నీ హత్య చేసిన నేరంపై నేపాల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. శోభరాజ్ తండ్రి భారతీయుడు. తల్లి వియత్నాం వాసి. శోభరాజ్‌కు ఫ్రెంచ్ పౌరసత్వం ఉంది. పూర్తి పేరు చార్లెస్ గురుముఖ్ శోభరాజ్ హాట్చంద్ భవనాని. అతని ఫోటో నేపాల్‌లోని ఒక వార్త పత్రికలో ప్రచురితమవ్వడంతో ఆచూకీ ప్రపంచానికి తెలిసింది. జంట హత్యలు చేసినందుకుగానూ ఖాట్మండులోని సెంట్రల్ జైలులో 20 ఏళ్లు శిక్ష, నకిలీ పాస్‌పోర్ట్ ఉపయోగించినందుకు గానూ ఒక ఏడాది జైలు శిక్ష కలిపి మొత్తం 21 ఏళ్లు జైలు శిక్షను అనుభవించాడు. అంతేగాదు రూ. 2 వేలు జరిమానా కూడా చెల్లించాడు. ఈ కరడుగట్టిన నేరస్తుడి గురించి సినిమాల్లో రిఫరెన్సులు ఉండడం, అతనిపై పలు సినిమాలు కూడా రావడం తెలిసిందే. (చదవండి: రష్యా సైనికుల్లో సన్నగిల్లుతున్న ధైర్యం.. చావు తప్ప మరో మార్గం లేదంటూ..) -
‘ఎవర్ గివెన్’ ఎట్టకేలకు కదిలింది
సూయెజ్(ఈజిప్ట్): సూయెజ్ కాలువలో కూరుకుపోయిన అత్యంత భారీ కంటెయినర్ ఓడ ‘ఎవర్ గివెన్’ ఎట్టకేలకు కదిలింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దాదాపు వారం క్రితం ఈ ఓడ.. అంతర్జాతీయ సరుకు రవాణాలో కీలకమైన సూయెజ్ కాలువలో అడ్డం తిరిగి చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. దాంతో సూయెజ్ కాలువలో సరుకు రవాణా ఒక్కసారిగా ఆగిపోయింది. వారం రోజులుగా అంతర్జాతీయ సరుకు రవాణా నిలిచిపోయి, వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ఆ భారీ రవాణా నౌకను కదిలించేందుకు అంతర్జాతీయ నిపుణులు గత వారం రోజులుగా చేస్తున్న కృషి సోమవారానికి ఫలించింది. వాతావరణ పరిస్థితులు, పోటెత్తిన అలలు కొంతవరకు వారికి సహకరించాయి. కూరుకుపోయిన నౌక భాగాన్ని కదిలించేందుకు ఒకవైపు డ్రెడ్జింగ్ చేస్తూ, మరోవైపు 10 టగ్ బోట్లతో వెనక్కు లాగుతూ నిపుణులు ప్రయత్నించారు. అలాగే, నౌక చుట్టూ 18 మీటర్ల లోతు వరకు 27 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తొలగించారు. అనంతరం, కెనాల్ ఉత్తర, దక్షిణ తీరాలకు మధ్యనున్న వెడల్పైన ‘గ్రేట్ బిట్టర్ లేక్’ వద్దకు 2.2 లక్షల టన్నుల బరువైన ఆ నౌకను తీసుకు రాగలిగారు. అక్కడ ఆ నౌకను క్షుణ్నంగా పరిశీలిస్తారు. నౌక సాంకేతిక సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. నౌక కదులుతున్న దృశ్యాలను ఉపగ్రహ ఛాయాచిత్రాలతో ‘మెరైన్‌ట్రాఫిక్.కామ్’ వెబ్సైట్లో పొందుపర్చారు. ఈ విధానం సఫలం కానట్లైతే, నౌకలోని దాదాపు 20 వేల కంటెయినర్లను వేరే షిప్‌లోకి మార్చి, అనంతరం, బరువు తగ్గిన ఈ నౌకను కదిలించాల్సి వచ్చేది. ఇసుక, బురదలో కూరుకుపోయిన ‘ఎవర్ గివెన్’ నౌకను తిరిగి కదిలించి, ప్రధాన మార్గంలోకి తీసుకువచ్చే బాధ్యతను ‘బొస్కాలిస్’ అనే నౌకా నిర్వహణ, మరమ్మత్తుల సంస్థకు అప్పగించారు. ఆ పని పూర్తికాగానే ‘మా పని పూర్తి చేశాం. సూయెజ్ కెనాల్ అథారిటీస్‌తో కలిసి మా నిపుణులు ఎవర్‌గివెన్‌ను జలాల్లోకి తీసుకురాగలిగారు. ఈ కాలువ ద్వారా రవాణా మళ్లీ ప్రారంభమయ్యేందుకు మార్గం సుగమమయింది’ అని ఆ సంస్థ సీఈఓ పీటర్ ప్రకటించారు. కాలువ మార్గానికి అడ్డంగా గత మంగళవారం జపాన్‌కు చెందిన సరకు రవాణా నౌక ‘ఎవర్ గివెన్’ చిక్కుకుపోవడంతో వారం రోజులుగా అంతర్జాతీయ రవాణా నిలిచింది. దాంతో రోజుకు దాదాపు 900 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది. సూయెజ్ కాలువ మార్గంలో వారం రోజుల పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడిన నేపథ్యంలో.. ఎవర్ గివెన్ నౌకను కదిల్చినప్పటికీ.. ఈ కాలువ గుండా సాధారణ స్థాయిలో నౌకల రవాణా జరిగేందుకు మరికొంత సమయం పట్టే అవకాశముంది. ఇప్పటికే దాదాపు 367 నౌకలు ఇరువైపులా నిలిచిపోయాయి. ఇవన్నీ క్లియర్ అయ్యేందుకు 10 రోజులు పడుతుందని రిఫినిటివ్ అనే సంస్థ అంచనా వేసింది. పలు నౌకలు ప్రత్యామ్నాయ, సుదూర మార్గమైన ‘కేప్ ఆఫ్ గుడ్‌హోప్’ ద్వారా వెళ్తున్నాయి. అంతర్జాతీయ సరకురవాణా వాణిజ్యంలో 10% సూయెజ్ కాలువ ద్వారా జరుగుతుంది. క్రూడాయిల్ రవాణాలో ఈ మార్గం వాటా దాదాపు 7%. గత సంవత్సరం ఈ మార్గం గుండా 19 వేలకు పైగా నౌకలు వెళ్లాయి. -
రోజుకు 72వేల కోట్లు నష్టం : తాజా శుభవార్త
సాక్షి, న్యూఢిల్లీ : సూయజ్ కెనాల్లో చిక్కుకున్న భారీ నౌక ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రోజుకు 72వేల కోట్ల రూపాయల చొప్పున గత వారం రోజులుగా సంభవించిన నష్టం ప్రపంచ ఆర్థికవ్యవస్థను అతలాకుతలం చేసింది. ప్రపంచంలో పదోవంతు వ్యాపారం జరిగే సూయజ్ కెనాల్లో ఇరుక్కున్న ఈ భారీనౌకను దారిలోకి తీసుకొచ్చేందుకు మల్లగుల్లాలు పడుతున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన ఒక గుడ్‌న్యూస్ ఊరటనిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పెను సవాల్‌గా భారీ కంటైనర్ షిప్ ఇపుడు పాక్షికంగా ముందుకు కదిలింది. తాజా పరిణామంతో ఈ ప్రతిష్టంభనకు త్వరలోనే తెరపడనుందనే ఆశలు భారీగా వ్యాపించాయి. షిప్పింగ్ సర్వీసెస్ ప్రొవైడర్ మారిటైమ్ సర్వీసెస్ సంస్థ ఇంచ్‌కేప్ ఈ వార్తను ధృవీకరించింది. ఈ మేరకు ‘ఎవర్ గివెన్’ నౌక కదిలిందంటూ సోమవారం సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. అటు "ఇది శుభవార్త" అని సూయజ్ కెనాల్ అథారిటీ చైర్మన్ ఒసామా రాబీ మీడియాకు చెప్పారు. ఇంకా పూర్తి కాలేదు, కానీ కొంచెం కదిలిందని వెల్లడించారు. కానీ 400కి పైగా నౌకల ప్రతిష్టంభనకు ముగింపు ఎపుడనేదిమాత్రం స్పష్టం చేయలేదు. షిప్-ట్రాకింగ్ సిస్టం వెసెల్ ఫైండర్ వెబ్సైట్లో ఎవర్ గివెన్ స్టేటస్‌ను అండర్వేగా మార్చుకుందని, తద్వారా జలమార్గం త్వరలో తిరిగి తెరుచుకోనుందనే ఆశలు పెంచుతోందంటూ ఈజిప్ట్ టుడే మ్యాగజీన్ ట్వీట్ చేసింది. కాగా ఈ షిప్‌ను ముందుకు కదిలించే ప్రయత్నాలు నిలిపివేశామని సూయజ్ కెనాల్ అథారిటీ (ఎస్‌సిఎ) ఈ ప్రయత్నాన్ని వాయిదా వేశామని ఆదివారం ప్రకటించారు. తగినంత టగ్ శక్తి అమలయ్యే వరకు తదుపరి రిఫ్లోటింగ్ ప్రయత్నాన్ని సోమవారం సాయంత్రానికి వాయిదా వేయాలని నిర్ణయించింది. రాబోయే 24-48 గంటల్లో ఓడను తరలించే అవకాశం ముందని కూడా షిప్పింగ్ డేటా, న్యూస్ కంపెనీ లాయిడ్స్ లిస్ట్ ఎడిటర్ రిచర్డ్ మీడే వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో తాజా వార్తలు భారీ ఊరటనిస్తున్నాయి. అటు వేల కిలోమీటర్ల ఇసుకలో ఆఫ్రికా నుంచి సినాయ్ పెనిన్సులా మధ్యలో ఉన్న ఈ కెనాల్లో చిక్కుకుపోయిన ఈషిప్ను ఎవర్ గ్రీన్ అనే పనామా షిప్పింగ్‌కి చెందిన నౌకని కదల్చలేని పరిస్థితిలో ఇక చేసేదిలేక డ్రెడ్జింగ్‌కూడా సిద్ధమవుతున్నట్లు ఒసామా రాబేయ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ షిప్‌ను విడిపించేందుకు మరిన్ని టగ్బోట్లు అవసరమని ఈజిప్టు అధికారులు ఆదివారం నిర్ణయించారు. సుమారు 20వేల కంటైనర్లను తొలగించడానికి సన్నాహాలు ప్రారంభించారు. మరోవైపు రష్యా ఇప్పటికే సహాయాన్నిఅందించగా, అమెరికాతో సహా ఇతర దేశాలు కూడా ముందు కొస్తున్నాయి. ఈజిప్ట్ ప్రభుత్వం కోరితే సాయం చేయడానికి తాము సిద్దమంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. (సూయజ్ కెనాల్లో అడ్డం తిరిగిన భారీ నౌక.. గంటకు 3వేల కోట్ల నష్టం) #BREAKING: watch video of the Ever Given, which was previously clogging the Suez Canal and has now been refloated. Good news in #Egypt. pic.twitter.com/6HbkeBpA40 — Steve Hanke (@steve_hanke) March 29, 2021 #BREAKING | Ship-tracking service VesselFinder has changed Ever Given’s status to under way on its website. raising hopes the busy waterway will soon be reopened.#Egypt #Suez #SuezCanal #EVERGIVEN #Evergreen #BreakingNews|#قناة_السويس #السفينة_الجائحة #عاجل pic.twitter.com/lz5EuNM5Ty — Egypt Today Magazine (@EgyptTodayMag) March 29, 2021 -
పసుపు కుంకుమ
‘‘ఆలోచించేపని లేదు. చెప్పినట్లు చెయ్యండి. కొంచెం పసుపు, కుంకుమ కావాలి’’ అన్నాడు. తీసుకురాబోయింది ప్రమతి. ఆగమన్నాడు వీరభద్రం. ‘‘డబ్బాలోని పసుపు, భరిణెలోని కుంకుమ కాదు’’ అన్నాడు. ‘‘పట్టేశాను’’ అన్నాడు వీరభద్రం.ఉలిక్కిపడింది ప్రమతి. ఉలిక్కిపడకుండా ఉండేందుకు ప్రయత్నించాడు సహస్ర. ప్రమతి భర్త సహస్ర.‘పట్టేశాను’ అన్న వెంటనే, తన వెంట తెచ్చుకున్న బీకరులాంటి గాజు పాత్రలో పెట్టేసి, గట్టిగా బిరడా బిగించాడు వీరభద్రం. వీరభద్రం భూత వైద్యుడు కాదు. భూత తాంత్రికుడు. మనుషులకు పట్టే దెయ్యాల్ని వదిలించడంలో అతడికి ఇంట్రెస్ట్ లేదు. మనుషుల్ని వదలకుండా పట్టి పీడించే దెయ్యాల్ని బంధించడంలో అతడు ఎక్స్పర్ట్. ప్రమతి, సహస్ర మొదట తనను కలిసేందుకు వచ్చినప్పుడు అతడేం ఉత్సాహం చూపలేదు. ఏమిటన్నట్లు చూశాడు. ‘‘ద..ద..’’ అని ప్రమతి తత్తరపడుతుంటే.. సహస్రే చెప్పాడు, ‘‘దెయ్యం ఉన్నట్లుంది మా ఇంట్లో.. దాన్ని వదిలించాలి’’ అని. ‘‘ఎన్నాళ్ల నుంచి ఉందనుకుంటున్నారు మీ ఇంట్లో దెయ్యం?’’ అడిగాడు వీరభద్రం. భార్యాభర్తలు ముఖాలు చూసుకున్నారు. యువ దంపతులు వాళ్లు. పెళ్లయి ఒక వారమైనా అయినట్లు లేదు. అంత ఉక్కిరిబిక్కిరిగా ఉన్నారు. ‘‘ఏడాది నుంచీ ఉంటున్నాం. ఆ దెయ్యం కూడా ఏడాది నుంచీ మాతోనే ఉన్నట్లు అనిపిస్తోంది. దెయ్యం వదలట్లేదని, ఇంటినే వదిలేయడానికి కూడా లేదు. అద్దెల్లు కాదు. సొంతది. మాకోసం మా అత్తమామలు కొని ఇచ్చింది. పెళ్లయిన నెల రోజులకు గృహప్రవేశం చేశాం’’ చెప్పింది ప్రమతి.‘‘సరే.. వస్తాను వెళ్లండి’’ అన్నాడు వీరభద్రం. ‘వస్తాను, వెళ్లండి’ అనగానే.. ‘మా ఇంటి అడ్రస్..’ అంటూ దారులు, దిక్కులు చెప్పబోయింది ప్రమతి. అవసరం లేదన్నట్లు చేత్తో వారించాడు వీరభద్రం. సహస్రకు భలే ఆశ్చర్యం అనిపించింది. వెనక్కు వచ్చేశారు. అలా వెనక్కు వచ్చేటప్పుడు కూడా వీరభద్రం వెనక నుంచి వాళ్లనేమీ అడగలేదు. ఏ టైమ్‌లో ఉంటారూ.. ఇద్దరూ ఒకే టైమ్‌లో ఎప్పుడుంటారూ, ఆఫీస్‌లకు సెలవెప్పుడూ.. ఇలాంటివేమీ అడగలేదు. వాళ్లలా వెళ్లగానే ఇలా.. పుస్తకాలేవో తెరుస్తుండడం ప్రమతి, సహస్ర గమనించారు. ఆ తర్వాత ఇద్దరూ కొంతసేపు దెయ్యం సంగతి మర్చిపోయి, వీరభద్రం గురించి మాట్లాడుకున్నారు. ఆయన కళ్లల్లో వారికేదో తేజస్సు కనిపించింది. ‘‘పట్టేస్తాడు’’ అనుకున్నారు. ‘‘పట్టేశాను’’ అని చెప్పి, బీకరులో పడేసి, బిరడాలో పెట్టేశాక.. దానిని ఈశాన్యంలోని దేవుడి మూలకు అభిముఖంగా, నైరుతి మూలలో చేతికి అందే ఎత్తులో అటకమీద ఉంచి చెప్పాడు వీరభద్రం.. ‘‘దీన్నిక్కడే కొన్నాళ్లు కదలకుండా ఉంచండి’’ అని. భయంగా చూశారు భార్యాభర్తలు. ‘‘దెయ్యాన్ని మీరు తీసుకెళతారనుకున్నాం’’ అన్నారు ఇద్దరూ ఒకేసారి. ‘‘లేదు. కొన్నాళ్లు ఈ బీకరు ఇక్కడే ఉండాలి. బీకరుకు అడ్డంగా కర్టెన్లాంటిది కూడా ఏమీ వేలాడదీయకండి. అది మీకు కనిపిస్తూ ఉండాలి’’ చెప్పాడు వీరభద్రం. ‘‘కానీ దాన్ని చూస్తుంటే మాకు భయంగా ఉంటుంది. బీకరులోని దెయ్యం మమ్మల్నే చూస్తూ ఉంటుందేమోనని. పైగా బీకరు అక్కడ ఉంటే.. మేం ఏ పనిలో ఉన్నా ఆ దెయ్యానికి కనిపిస్తూ ఉంటాం. తింటున్నా, టీవీ చూస్తున్నా, పడుకోడానికి వెళుతున్నా, స్నానం చేసి వస్తున్నా..’’ చెప్పాడు సహస్ర. అవునన్నట్లు చూసింది ప్రమతి. ‘‘కనిపించాలి’’ అన్నాడు వీరభద్రం.. బీకరులోకి చూస్తూ. ఆ మాటకు భయంగా గుటకలేశారు భార్యాభర్తలు. దెయ్యం ఇంట్లో ఏమూలన తిరుగుతోందో తెలియక భయపడడంవేరు. ఫలానా చోటు ఉందని తెలిసీ దెయ్యం.. ముందు ఇంట్లో తిరగడం వేరు. అది ఆలోచిస్తున్నారు వాళ్లు. అది కనిపెట్టాడు వీరభద్రం. ‘‘ఆలోచించే పని లేదు. చెప్పినట్లు చెయ్యండి.కొంచెంపసుపు, కుంకుమ కావాలి’’ అన్నాడు. తీసుకురాబోయింది ప్రమతి. ఆగమన్నాడు వీరభద్రం. ‘‘డబ్బాలోని పసుపు, భరిణెలోని కుంకుమ కాదు’’ అన్నాడు. ‘మరి!’ అన్నట్లు చూశారు ప్రమతి, సహస్ర. ‘‘నీ కాలికి రాసుకున్న పసుపు. నీ భర్త గుండెలకు నువ్వద్దిన కుంకుమ’’ అని చెప్పాడు వీరభద్రం. కాళ్లకు పసుపు రాసుకుని, ఆ రాసుకున్న పసుపులోంచి కొంత తీసింది ప్రమతి. అలాగే భర్త గుండెకు కుంకుమ అద్ది, ఆ అద్దిన కుంకుమలోంచి కొంత తీసింది. వాటిని చిన్న కాగితం ముక్కలో వేసుకుంది. రెంటినీ కుడిచేతి ఉంగరపు వేలు, బొటనవేలితో కలపి, నలపమని చెప్పాడు వీరభద్రం. కలిపి, నలిపింది. దాంట్లోంచి భార్యాభర్తల్ని చెరిసగం తీసుకోమని చెప్పాడు. తీసుకున్నారు. బీకరు దగ్గరికి వెళ్లి, బీకరుపై ఇద్దర్నీ వేర్వేరుగా రెండు బొట్లు పెట్టమన్నాడు. మళ్లీ ఉలిక్కిపడింది ప్రమతి. ఉలిక్కిపడకుండా ఉండేందుకు సహస్ర ప్రయత్నించాడు కానీ వీలుకాలేదు. ‘‘భయంలేదు. వెళ్లమ్మా.. నువ్కొక బొట్టు పెట్టు, నువ్వూ ఒక బొట్టు పెట్టబ్బాయ్’’ అన్నాడు. బొట్లు పెడుతున్నప్పుడు వాళ్ల వేళ్లు వణికాయి. బీకరు లోపల ఊపిరి ఆడకుండా ఎవరో టపటపా కొట్టుకుంటున్నట్లనిపించింది. ఆ తర్వాత వీరభద్రం వెళ్లిపోతుంటే.. భయంగా అడిగింది ప్రమతి. ‘‘ఎప్పుడు తీసుకెళతారు ఆ దెయ్యాన్ని’’ అని. ‘‘ఎవరూ తీసుకెళ్లే పని లేదు. సమయం వచ్చినప్పుడు బీకరే దానంతటది కిందపడి బద్దలవుతుంది’’.. చెప్పాడు వీరభద్రం. ‘‘అప్పుడు దెయ్యం మా పని పట్టదా.. అన్నాళ్లూ బంధించి ఉంచినందుకు?’’ అడిగాడు సహస్ర. ‘‘అలా జరగదు’’ అన్నాడు. వెళ్లే ముందు ఇంకో మాట కూడా చెప్పాడు. ‘‘మీరనుకున్నట్లు ఆ బీకరులో దెయ్యం లేదు. దెయ్యాలు ఉన్నాయి. రెండు దెయ్యాలు. ఒకటి ఆడ దెయ్యం, ఇంకోటి మగదెయ్యం. అంతేకాదు, అవి రెండూ కూడా బతికే ఉన్న ఇద్దరు మనుషుల ఆత్మలు.’’బతికున్న మనుషులకు కూడా ఆత్మలు ఉంటాయా అని ఆ రాత్రి చాలాసేపు మాట్లాడుకున్నారు ప్రమతి, సహస్ర. ఆ తర్వాతెప్పుడూ బీకరులోని ఆ రెండు దెయ్యాల గురించిమాట్లాడుకోలేదు. ఇంట్లో దెయ్యం ఉందని మునుపు వాళ్లకు అనిపించడానికి కారణమైన సంఘటనలు కూడా వీరభద్రం వచ్చి వెళ్లాక మళ్లీ ఆ ఇంట్లో జరగలేదు. కొన్నాళ్ల తర్వాత.. ఓ రోజు ఉదయాన్నే నిద్ర లేచిన ప్రమతి, సహస్రలకు భళ్లున ఏదో పగిలిన చప్పుడు వినిపించింది. వెళ్లి చూశారు. బీకరు! ముక్కలై పడి ఉంది. ఆ మధ్యాహ్నం వాళ్లకు వేర్వేరుగా రెండు పెళ్లి కార్డులు వచ్చాయి. ఒక జంటలో వరుడు పంపిన కార్డు ప్రమతి పేరు మీద వచ్చింది. ఇంకో జంటలో వధువు పంపిన కార్డు సహస్ర పేరు మీద వచ్చింది. ‘నువ్వు లేకుండా బతకలేను’ అని ప్రమతికి చెప్పి, ప్రమతికి పెళ్లవుతున్న రోజు.. చీకట్లో ప్రమతినిపట్టుకుని బోరుమని ఏడ్చిన అబ్బాయి వరుడు. ‘నువ్వే నా సర్వస్వం. నిన్ను తప్ప ఎవర్నీ పెళ్లి చేసుకోనని నమ్మించి, ఇప్పుడు వేరే అమ్మాయిని చేసుకుంటున్నావా!’’ అని.. చివరిసారి కలవడానికి వచ్చిన సహస్రను ఇంట్లోకి రానివ్వకుండా తలుపులు వేసుకుని, లోపల్నుంచి దభీదభీమని తలను తలుపుకేసి కొట్టుకున్న అమ్మాయి వధువు. ∙∙ మర్నాడు వీరభద్రాన్ని కలిసి బీకరు పగిలిపోయిందని చెప్పారు ప్రమతి, సహస్ర. ‘‘ఆత్మ విముక్తి జరిగింది’’ అన్నాడు వీరభద్రం. ‘‘బీకరును మీతో తీసుకెళ్లితే ఆత్మ విముక్తి జరిగి ఉండేది కాదా?’’ అడిగాడు సహస్త్ర.. ఆసక్తి కొద్దీ. ‘‘కసితో జరిగిన ఆత్మవిముక్తి అది. మీ దాంపత్యాన్ని ఆ ఆత్మలు కళ్లారా చూశాక’’.. చెప్పాడు వీరభద్రం. ∙మాధవ్ శింగరాజు -
బాలికకు విముక్తి
కొరాపుట్ : కొరాపుట్ జిల్లా దశమంతపూర్ సమితిలోని మొర్చిగుడ గ్రామంలో ఇతరుల బంధనలో చిక్కుకున్న బాలికకు విముక్తి లభించింది. జిల్లా శిశు సంరక్షణ విభాగం ఆ బాలికను చెరనుంచి విముక్తిరాలిని చేసింది. తండ్రి పరారీలో ఉండగా తల్లి మరణంతో ఆ బాలిక అనాథగా మిగిలిపోయింది. దూరపు చుట్టమైన సోదరిగా చెప్పుకున్న ఒక మహిళ ఆ బాలికను చేరదీసింది. తన పిల్లలను ఎత్తుకోవడం, ఇంటి చాకిరీ చేయించడంతో పాటు గ్రామంలో కూలి పనులకు వినియోగించడంతో పాటు చాలీ చాలని తిండిపెడుతూ ఆ బాలికను నానా హింసలు పెడుతున్న వైనం ఈ నోట ఆ నోట జిల్లా శిశు సంరక్షణ అధికారిణి రాజశ్రీ దాస్ చెవికి చేరింది. ఆమె తన బృందంతో గ్రామానికి వెళ్లి దర్యాప్తు నిర్వహించి ఆ బాలికను బాల కార్మికురాలిగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. జిల్లా శిశు సంక్షేమ కమిటీ ముందు శుక్రవారం హాజరు పరిచారు. ఆ బాలికను శిశు సంరక్షణ విభాగం గృహంలో ఉంచుతూ చదువుకునేందుకు ఏర్పాటు చేశారు. బంధ విముక్తురాలు కావడంతో ప్రస్తుతం ఆ బాలిక ఆనందిస్తోంది. -
సాధ్వి ప్రజ్ఞ, పురోహిత్‌కు స్వల్ప ఊరట
ముంబై: మాలెగావ్ బాంబుపేలుడు కేసులో నిందితులు సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్‌లకు బుధవారం ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) ప్రత్యేక కోర్టులో స్వల్ప ఊరట లభించింది. సాధ్వి, పురోహిత్ సహా 8 మందిపై ‘మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం’ కింద నమోదైన అభియోగాలను కోర్టు కొట్టేసింది. ఉగ్రవాద కార్యకలాపాల వ్యతిరేక చట్టం కింద మాత్రం విచారణ కొనసాగుతుందన్టి స్పష్టం చేసింది. మరో ముగ్గురి పేర్లను నిందితుల జాబితా నుంచి తొలగించిన కోర్టు వారికి కేసు నుంచి విముక్తి కల్పించింది. మిగిలిన నిందితులందరిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)లోని సెక్షన్ల కింద విచారణ కొనసాగుతుందని కోర్టు పేర్కొంది. -
20 పాములకు విముక్తి
ముషీరాబాద్: నాగ పంచమి సందర్భంగా పాములను పట్టే వారి నుంచి అటవీ శాఖ సహకారంతో వివిధ ఎన్జీఓ సభ్యులు దాదాపు 20 తాచు పాములను అటవీశాఖకు అప్పగించారు. నగరంలోని హయత్‌నగర్, చింతలబస్తీ, కాచి గూడ, కామారెడ్డి, వరంగల్ తదితర ప్రాంతాలలో ఈ పాములను రక్షించారు. పాములను కొద్ది రోజుల ముందే పట్టుకుని కోరలు పీకి బంధిస్తారని ఎన్జీవో నిర్వాహకులు మహేష్ అగర్వాల్, అవినాష్ తెలిపారు. నాగ పంచమి రోజు పాములను బయటకు తీయడంతో ఇన్ని రోజులు దాహంతో ఉన్న పాములు పాలు పోయగానే వాటిని తాగుతాయని తెలిపారు. ఈ విధంగా పాములను హింసకు గురిచేస్తున్న వారిని గుర్తించి, వారి వద్ద నుంచి పాములను స్వాధీనం చేసుకుని మళ్లీ అడవుల్లోకి వదిలివేసినట్లు తెలిపారు. భక్తులకున్న విశ్వాసాన్ని ఇలా సొమ్ముచేసుకుంటారన్నారు. -
తెలుగుకు మెలిక
సాక్షి ప్రతినిధి, చెన్నై: నిర్బంధ తమిళం నుంచి విముక్తి కోరుతున్న తెలుగు విద్యార్థులకు వెసులుబాటు కల్పిస్తున్న ముసుగులో ప్రభుత్వం మెలిక పెట్టింది. ఇతర రాష్ట్రాల నుంచి బదిలీపై వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మాత్రమే నిర్బంధ తమిళం నుంచి వెసులుబాటు ఉంటుందనే కొత్త వాదనను తెరపైకి తెచ్చింది.దేశంలోని నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో ఒకటైన తమిళనాడు పలుభాషా ప్రజల సమ్మేళనంగా ఉంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. ఉద్యోగరీత్యా వస్తూ పోయే వాళ్లూ ఉన్నారు. అయితే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం విడిపోయిన నేపధ్యంలో తమిళనాడులో తెలుగువారే అధికశాతం స్థిరపడిపోయారు. ఆంధ్రప్రదేశ్‌గా వేరుపడినా తమిళనాడులోనే కొనసాగారు. ఇలా తమిళం తరువాత అధికశాతం ఉన్న తెలుగువారికి 2006లో డీఎంకే ప్రభుత్వం తీసుకువచ్చిన నిర్బంధ తమిళ చట్టం ఆశనిపాతమైంది. మాతృభాషపై మమకారం చంపుకుని తమిళభాషను నేర్చుకోవాలన్న ఈ చట్టంపై తెలుగుతోపాటు ఇతర మైనార్టీ భాషల వారంతా మండిపడ్డారు. గత 10 చట్టపరమైన పోరు సాగిస్తూనే ఉన్నారు. 2006లో తీసుకువచ్చిన ఈ చట్టం ప్రకారం గత 2015-16 విద్యాసంవత్సరంలో మైనార్టీ భాషల విద్యార్థులంతా తమిళంలోనే పరీక్షలు రాయాల్సి వచ్చింది. న్యాయస్థానంలో అవిశ్రాంత పోరుతో ఎట్టకేలకూ దిగివచ్చిన ప్రభుత్వం గత విద్యాసంవత్సరం వరకు తెలుగు పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరి వచ్చే ఏడాది మాటేమిటి: దినగండం నూరేళ్లాయుష్షులా మారిన నిర్బంధ తమిళ చట్టం నుండి ఈ విద్యాసంవత్సరంలో మినహాయింపు లభించేనా అనే ప్రశ్న మళ్లీ ఉత్పన్నమైంది. పాఠశాలలు ప్రారంభమై నెలలు గడుస్తుండగా పది పరీక్షల్లో తెలుగా, తమిళమా అనే అంశంపై విద్యార్థులోల్లో ఆయోమయం నెలకొంది. ఈ అయోమయానికి ప్రభుత్వం తెరదించుతూ రానునున్న పది పరీక్షల్లో తమిళంకు బదులుగా తెలుగు పరీక్ష రాయగోరు విద్యార్దులు ఈనెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కోర్టు ద్వారా హామీ ఇచ్చారు. లింగ్విస్టిక్ మైనార్టీ భాషల విద్యార్దులు తమ అభీష్టాన్ని ఈనెల 20వ తేదీలోగా లిఖితపూర్వకంగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజే యాలని సూచించారు. మళ్లీ ఇదేమి మెలిక: ఇదిలా ఉండగా, ప్రభుత్వం మైనార్టీ భాషల విద్యార్దులకు, ముఖ్యంగా తెలుగును ఆశించే విద్యార్దులకు పరోక్షంగా కొత్త మెలిక పెట్టింది. ఇతర రాష్ట్రాల నుండి తమిళనాడుకు బదిలీపై వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు వారు కోరిన భాషలో పరీక్ష రాసుకోవచ్చని ప్రకటించింది. అంటే బదిలీపై వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు 2006 నిర్బంధ తమిళ చట్టం వర్తించదని పరోక్షంగా స్పష్టం చేసింది. అంటే నిర్బంధ తమిళం చట్టం నుండి విముక్తి కోరుతూ పోరాడుతున్న వారి గోడును పట్టించుకోకుండా ఎక్కడి నుంచో బదిలీపై రానున్న వారి పిల్లల కోసం ప్రభుత్వం ఎర్రతివాచీ పరిచింది. ఈ కొత్త వాదన వల్ల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకున్న మైనార్టీ భాషల విద్యార్థుల విజ్ఞప్తులకు ప్రభుత్వం విలువ ఇస్తుందా, అందులోని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందా అనే అనుమానాన్ని లేవనెత్తింది. ప్రభుత్వ తాజా ధోరణిపై ముస్లీం మైనార్టీ విద్యాసంస్థలు, సంఘాలతో కలిసి కోర్టులో సవాలు చేయనున్నట్లు ఏఐటీఎఫ్, లింగ్విస్టిక్ మైనార్టీల ఫోరం చైర్మన్ డాక్టర్ సీఎంకే రెడ్డి తెలిపారు. -
చోరీకిపోయి ఇరుక్కున్నాడు
పిల్లలు అల్లరి చేస్తుంటారు. అందులోనూ ఎప్పుడూ చూడని వస్తువులు కనిపిస్తే ఇంకాస్త అత్యుత్సాహం ప్రదర్శించి చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఆస్ట్రేలియాలోని ఓ నాలుగేళ్ళ కుర్రాడి విషయంలో అదే జరిగింది. అంతకు ముందు ఎప్పుడూ చూడలేదో ఏమో కొత్తగా కనిపించిన వెండింగ్ మెషీన్ లో చేతులు పెట్టి ఇరుక్కు పోయాడు. అదృష్టం బాగుండి ఆరుగంటలు దాటాక ఎటువంటి అపాయం లేకుండా బయట పడ్డాడు. ఆస్ట్రేలియా బెల్బోర్న్ సిటీ సెంటర్ లో లియో అనే నాలుగేళ్ళ చిన్నారి బిస్కెట్లు, చాక్లెట్లు అమ్మకానికి వినియోగించే వెండింగ్ మెషీన్ లో చేతులు పెట్టేశాడు. విషయాన్ని గమనించిన అక్కడివారు వెంటనే ఫైర్ సిబ్బందికి ఇతర అధికారులకు సమాచారం అందించడంతో సహాయక చర్యలు చేపట్టారు. జరిగిన ఘటనతో చిన్నారి ఎంతో భయాందోళనలకు గురయ్యాడని, దీంతో సహాయక చర్యలు అతి సున్నితంగా నిర్వహించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. అయితే బిస్కెట్లు, చాక్లెట్లను దొంగతనంగా చేజిక్కించుకోవడంకోసం లియో వివిధ పద్ధతుల్లో ప్రయత్నాలు చేశాడని చివరికి అవి దక్కక పోగా చేతులు మెషీన్ లో ఇరుక్కుపోయాయని అధికారులు చెప్తున్నారు. ఆరు గంటలపాలు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ సమయంలో లియో పలుమార్లు ఆందోళనకర స్థితికి చేరుకున్నాడు. మెషీన్లో ఇరుక్కున్న లియో చేతులను తీసేందుకు మెషీన్ ను కట్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో లియో అరుపులను విని ఎంతో భయం వేసిందని, అతని దృష్టిని మరిపించేందుకు స్మార్ట్ ఫోన్లు వంటివి చూపించామని చుట్టుపక్కల వీధుల్లోని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం లియోకు ఎటువంటి ప్రమాదం లేదని, శరీరంపై ఎటువంటి గాయాలుకూడ కనిపించడం లేదని అధికారులు తెలిపారు. అయినప్పటికీ అతడ్ని పరిశీలించేందుకు మెల్బోర్న్ లోని రాయల్ ఛిల్డ్రన్స్ హాస్పిటల్ కు తరలించామని అన్నారు. ఇదిలా ఉంటే మా అబ్బాయి ఇంతకు ముందెప్పుడూ వెండింగ్ మిషన్ చూసినట్లు లేడని, బహుశా ఇదే మొదటిసారి కావడంతో బిస్కట్లు, చాక్లెట్లకోసం అందులో చేతులు పెట్టి ఉంటాడని నార్తరన్ టెర్రిటరీ ఆర్నెమ్ ల్యాండ్ లో నివసించే లియో తండ్రి ఆరోన్ అంటున్నాడు. ఏది ఏమైనా తమ కొడుకు సురక్షితంగా బయటపడటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. -
బాలకార్మికులు పనికి రావొద్దు
స్పందించిన స్పిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: దశాబ్దాల క్రితం మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటైన పలు స్పిన్నింగ్ మిల్లుల కార్మికుల సంక్షేమం కోసం ఏమాత్రం పట్టించుకోని తీరుపై ‘సాక్షి’లో కథనం వెలువడడంతో మిల్లుల యాజమాన్యాలు అంతర్మథనంలో పడ్డాయి. ఆమనగల్లు, మిడ్జిల్, కల్వకుర్తి, అడ్డాకుల ప్రాంతాల్లో ఉన్న స్పిన్నింగ్ మిల్లుల యజమానులు బాలకార్మికులను పనిలోకి రావద్దంటూ ఆదేశాలు జారీచేశారు. కార్మికులకు ఎవరికైనా పని కావాలంటే తమకు 18 సంవత్సరాలు నిండినట్లుగా ఆధార్ కార్డులో నమోదైతేనే పనిస్తామంటూ నిబంధనలు పెట్టారు. దీంతో సోమవారం ఆయా స్పిన్నింగ్ మిల్లుల్లో బాలకార్మికులు విధులకు హాజరుకాలేదు. అయితే బాలకార్మికుల స్థానంలో కొత్త కార్మికులను పెట్టుకోకపోవడంతో అనేక అనుమానాలకు తావి స్తోంది. కేవలం కొద్దిరోజులు బాలకార్మికులను పక్కనపెట్టి తర్వాత వారినే అదే తక్కువ వేతనంతో పనిలో పెట్టుకోవాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బాలకార్మికులను పనికి రావద్దని చెప్పిన యాజమాన్యాలు.. వారిని ప్రభుత్వానికి అప్పజెప్పకపోవడం, వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు గాని చదువుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గం చూపెట్టకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ‘సాక్షి’లో వచ్చిన కథనం వల్ల వందలాది బాలకార్మికులకు మాత్రం పని భారం నుండి విముక్తి లభించినట్లయింది. -
18 మంది బాల కార్మికులకు విముక్తి
మెదక్(పుల్కల్): 18 మంది బాల కార్మికులకు కార్మిక శాఖ అధికారలు విముక్తి కల్పించారు. ఈ ఘటన మెదక్ జిల్లా పుల్కల్ మండలంలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. మండలంలోని సుల్తాన్ పూర్ జెఎన్టీయూలో భవన నిర్మాణం సందర్భంగా కూలీ పనులు చేస్తున్న చిన్నారులకు అధికారులు విముక్తి కల్పించారు. సదరు కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేస్తున్నట్టు అసిస్టెంట్ కమిషనర్ సోమేశ్వర్ తెలిపారు. చిన్నారులంతా బీహర్, చత్తీస్‌ఘడ్‌కు చెందిన వారిగా సమాచారం. -
9 మంది బాలకార్మికులకు విముక్తి
హైదరాబాద్: నగరంలోని బహుదూర్ పూర ప్రాంతంలో స్టెయిన్లెస్ స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 9 మంది బాల కార్మికులకు అధికారులు విముక్తి కల్పించారు. శనివారం రాత్రి జార్కండ్, బహుదూర్‌పుర పోలీసులతో పాటు కార్మిక శాఖ అధికారులు సంయుక్తంగా ఈ దాడి చేశారు. అనంతరం వారిని వసతి గృహానికి తరలించారు. -
ఇరాక్‌లో కేరళ నర్సులకు విముక్తి, రేపు కోచికి
తిరువనంతపురం: ఇరాక్‌లో ఉగ్రవాదుల చెరలో ఉన్న 46 మంది కేరళ నర్సులను శుక్రవారం విడుదల చేశారు. వీరిందరని శనివారం ఉదయం ప్రత్యేక విమానంలో కేరళకు తీసుకురానున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ప్రకటించారు. 'నర్సులందరూ క్షేమంగా ఉన్నారు. వారిని బస్సులో ఇరాక్‌లోని ఎర్బిల్ నగరానికి తీసుకువస్తారు. వారిని తీసుకువచ్చేందుకు శుక్రవారం సాయంత్రం ఎయిర్ ఇండియా విమానాన్ని ఎర్బిల్‌కు పంపనున్నారు. ఇందులో కేంద్ర, కేరళ అధికారులు వెళ్లారు. ఎర్బిల్ నుంచి ఈ విమానం ద్వారా నర్సులను కేరళకు తీసుకువస్తారు. శనివారం ఉదయం 7 గంటలకు విమానం కోచికి చేరుకుంటుంది' అని ఉమెన్ చాందీ చెప్పారు.