కాచిగూడ సహయోగ ఆఫీసులో స్వాధీనం చేసుకున్న పాము
ముషీరాబాద్: నాగ పంచమి సందర్భంగా పాములను పట్టే వారి నుంచి అటవీ శాఖ సహకారంతో వివిధ ఎన్‌జీఓ సభ్యులు దాదాపు 20 తాచు పాములను అటవీశాఖకు అప్పగించారు. నగరంలోని హయత్‌నగర్, చింతలబస్తీ, కాచి గూడ, కామారెడ్డి, వరంగల్ తదితర ప్రాంతాలలో ఈ పాములను రక్షించారు. పాములను కొద్ది రోజుల ముందే పట్టుకుని కోరలు పీకి బంధిస్తారని ఎన్‌జీవో నిర్వాహకులు మహేష్ అగర్వాల్, అవినాష్ తెలిపారు. నాగ పంచమి రోజు పాములను బయటకు తీయడంతో ఇన్ని రోజులు దాహంతో ఉన్న పాములు పాలు పోయగానే వాటిని తాగుతాయని తెలిపారు. ఈ విధంగా పాములను హింసకు గురిచేస్తున్న వారిని గుర్తించి, వారి వద్ద నుంచి పాములను స్వాధీనం చేసుకుని మళ్లీ అడవుల్లోకి వదిలివేసినట్లు తెలిపారు. భక్తులకున్న విశ్వాసాన్ని ఇలా సొమ్ముచేసుకుంటారన్నారు.